OTT Movie : సైకలాజికల్ థ్రిల్లర్ స్టోరీలు ఆసక్తికరంగా సాగుతుంటాయి. ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులను కన్ఫ్యూజన్ లో పడేస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో మైండ్ ని బెండ్ చేసే ట్విస్టులు ఉంటాయి. ఇందులో ఒక తండ్రి కొడుకుని బీచ్ లో సరదాగా గడపడానికి తీసుకెళ్తాడు. అయితే ఈ కథ ఒక రివేంజ్ థ్రిల్లర్ గా మారుతుంది. ఈ రివేంజ్ ఏమిటి ? ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘The Surfer’ 2024లో విడుదలైన ఆస్ట్రేలియన్ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం. దీనిని లోర్కాన్ ఫిన్నెగన్ డైరెక్ట్ చేశారు. ఇందులో నికోలస్ కేజ్, జూలియన్ మెక్‌మహాన్, ఫిన్ లిటిల్, రాహెల్ రోమాన్ ప్రధాన పాత్రలో నటించారు. 1 గంట 40 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా IMDbలో 6.0/10 రేటింగ్ పొందింది. ఈ చిత్రం 2024 మే 18న 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మిడ్‌నైట్ స్క్రీనింగ్స్‌లో ప్రీమియర్ అయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో 2025 మే 15న థియేటర్లలో విడుదలై, ప్రస్తుతం అమెజాన్ వీడియో, ఆపిల్ టీవీ, హులు లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ కథ ఆస్ట్రేలియాలోని లూనా బే అనే అందమైన బీచ్‌లో జరుగుతుంది. నికోలస్ కేజ్ తన టీనేజ్ కొడుకుతో, తన బాల్యంలో సర్ఫ్ చేసిన బీచ్‌కు వస్తాడు. అతను ఈ బీచ్‌కు ఎదురుగా ఉన్న ఒక తాత ఇంటిని కొనాలని, తన కొడుకుతో సర్ఫింగ్ ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేస్తాడు. కానీ అక్కడ కొంతమంది. ఇక్కడ నీవు లోకల్ కాదు, సర్ఫ్ చేయకు అని హెచ్చరిస్తూ, అతన్ని తన కొడుకు ముందు అవమానిస్తారు. ఈ అవమానం సర్ఫర్‌ను కోపంతో, పట్టుదలతో నింపుతుంది. అతను బీచ్‌లోనే ఉండి, వాళ్లను ఎదిరించాలని నిర్ణయిస్తాడు. కానీ ఈ పోరాటం క్రమంగా అతని మానసిక స్థితిని కుదిపేస్తుంది.
ఈ సమయంలో అతని సర్ఫ్‌బోర్డ్, షూస్, గడియారం, కారు, ఫోన్ ఒక్కొక్కటిగా కోల్పోతాడు. ఎండ, ఆకలి, నీరు లేకపోవడంతో అతను డీల్యూజనల్ లోకి వెళ్తాడు. బీచ్‌లో తిరుగుతూ, ఒక డెడ్ రాట్ తినడం, బాత్రూమ్ ట్యాప్ నీళ్లు తాగడం లాంటి దిగజారుడు స్థితికి చేరుకుంటాడు. ఇక సర్ఫర్ మానసిక పరిస్థితి మరింత దిగజారుతుంది. అతను బే బాయ్స్‌తో ఫైట్ చేస్తాడు. ఈ కథ సైకడెలిక్ వైబ్ గా మారుతుంది. అతను హాలూసినేషన్స్‌లో చిక్కుకుంటాడు. క్లైమాక్స్‌లో ఆ గ్యాంగ్‌తో ఫైనల్ ఫేస్-ఆఫ్ జరుగుతుంది. ఈ కథ ఊహించని మలుపుతో ఎండ్ అవుతుంది. ఈ క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? నికోలస్ కేజ్ రివేంజ్ ఎలా తీర్చుకుంటాడు ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : సీక్రెట్ గా భార్య వీడియోలు తీసి… అనుమానపు భర్తకు అదిరిపోయే షాక్… మస్ట్ వాచ్ మలయాళ మూవీ