Allu Arjun Vs Pawan kalyan : మెగా ఫ్యామిలీ, కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయన్న విషయం తెలిసిందే.. గత ఏడాది జరిగిన ఎన్నికల తర్వాత ఈ గొడవలు బయటపడ్డాయని తెలుస్తుంది.. పుష్ప-2 సినిమా విడుదల సమయంలో విభేదాలు దాదాపు బహిర్గతం అయ్యాయి.. అల్లు అర్జున్ ( Allu Arjun ) అరెస్ట్‌తో తిరిగి మెగాస్టార్ చిరంజీవి అర్జున్ ఇంటికి వెళ్లడం, ఆ తర్వాత బన్నీ కూడా చిరంజీవి ఇంటికి వెళ్లడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు సర్దుమనిగాయని అందరూ భావించారు. కానీ తాజాగా మరోసారి ఆ గొడవలు బయటపడ్డాయి. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్బంగా ఈ గొడవల రచ్చ మరోసారి వెలుగు చూసింది. అసలు మ్యాటర్ ఏంటో ఒకసారి చూసేద్దాం..
అల్లు అర్జున్ బర్త్ డే..
ఏప్రిల్ 8 న అల్లు అర్జున్ బర్త్ డే అన్న విషయం తెలిసిందే.. నేషనల్ వైడ్‌గా హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు, ఫ్యాన్స్ బన్పీకి విషెస్ చెప్పారు. మెగా కాంపౌండ్ కి చెందిన ఏ ఒక్క హీరో కూడా బన్నీకి విషెస్ చెప్పలేదు. కనీసం మెగాస్టార్ చిరంజీవి కూడా శుభాకాంక్షలు తెలుపలేదు. మొన్న మార్చి 27 న రామ్ చరణ్ బర్త్ డే కు అల్లు అర్జున్ కూడా విష్ చెయ్యలేదన్న విషయం తెలిసిందే. ఇక భవిష్యత్తులో అల్లు అర్జున్ వర్సెస్ మెగా హీరోల వైరం అలాగే కొనసాగుతుందని అర్థమవుతోంది. అయితే.. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ మాత్రం అల్లు అర్జున్‌కి ప్రేమతో విషెస్ చెప్పారు. బావ అని అన్నారు. వీరిద్దరి మధ్య స్నేహం ఉందన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
Also Read :నోరు జారాను క్షమించండి.. బాబోయ్ నెటిజన్లు బూ**..
సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్..
నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్బంగా టాలీవుడ్ తో, బాలీవుడ్ తో పాటుగా నేషనల్ వైడ్ గా సినీ సెలెబ్రేటీలు సోషల్ మీడియా వేదికగా బర్త్డే విషెస్ తో చెప్పారు. ఇక అభిమానులు పెద్ద ఎత్తున అల్లు అర్జున్ ఇంటి వద్దకు చేరుకొని ఆయనకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బయట వాళ్లందరూ అల్లు అర్జున్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుంటే మెగా ఫ్యామిలీలో ఒక్కడుంటే ఒక్క హీరో కూడా శుభాకాంక్షలు తెలపలేదు. దీంతో మీరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నట్లు గత కొద్దిరోజులుగా వినిపిస్తున్న వార్తలకు ఆజ్యం పోసినట్లుయింది. ఇక నెట్టింట అల్లు ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ మాత్రం కామెంట్స్ తో రచ్చ లేవుతున్నారు. ఇంత జరిగిన కూడా అల్లు అర్జున్ ఇంకా బుద్ధి రాలేదు అంటూ ఫ్యాన్స్ వార్ జరుగుతుంది. ఇక నెట్టింట అల్లు ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ మాత్రం కామెంట్స్ తో రచ్చ లేవుతున్నారు. పవన్ కళ్యాణ్ కొడుకుకు గాయాలు అయ్యాయి. కనీసం పలకరించలేదు. నువ్వు అసలు మనిషివేనా మానవత్వం లేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక బన్నీ సినిమాల విషయానికొస్తే.. తాజాగా అట్లీ తో మూవీని అనౌన్స్ చేశారు.