Social Drama on OTT: కార్పొరేట్ శక్తులు, అవినీతి అధికారులు కలిస్తే సామాన్య మిడిల్ క్లాస్ మనుషుల జీవితాలు ఎలా నాశనం అయిపోతాయో మనం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా తరతరాలుగా ఒకే చోట నివసిస్తూ, చిన్న వ్యాపారాలపై ఆధారపడి బతికే కుటుంబాలకు ఇలాంటి వాళ్ళు ఎదురైతే వారి పరిస్థితి మరింత కష్టంగా మారుతుంది. అలాంటి ఒక పవర్‌ఫుల్ అండ్ మోటివేషనల్ సోషల్ డ్రామా థీమ్‌తో తెరకెక్కిన లేటెస్ట్ బాలీవుడ్ మూవీ ‘Notice’. ఇందులో వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఒక చిన్న దుకాణాన్ని కాపాడుకోవడం కోసం ఓ సామాన్య కుటుంబం అవినీతి వ్యవస్థతో పోరాడుతుంది. రామాయణం సీరియల్‌లో రాముడు, సీతగా ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న అరుణ్ గోవిల్, దీపికా చిఖ్లియా దాదాపు 39 ఏళ్ల తర్వాత ఈ సినిమాలో భార్యాభర్తలుగా కలిసి నటించారు. ఈ హిందీ మూవీ నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. మరి దీనిని ఏ ఓటీటీలో చూడవచ్చు ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే..
నారాయణ్ గోవిల్ కుటుంబానికి 150 ఏళ్ల చరిత్ర ఉన్న ఒక పాత దుకాణం ఉంటుంది. అది కేవలం వ్యాపారం చేసుకునే స్థలం మాత్రమే కాదు.. వారి కుటుంబానికి తరతరాలుగా వస్తున్న గుర్తింపు, గౌరవం, ఎన్నో జ్ఞాపకాలతో ముడిపడిన ఆస్తి. ఆ దుకాణంపై ఆధారపడే ఆ కుటుంబం ప్రశాంతంగా జీవిస్తుంటుంది. అయితే అనూహ్యంగా ఒకరోజు ఆ ఏరియాను లగ్జరీ మాల్ గా మార్చాలని చూస్తున్న ఒక కరడుగట్టిన రియల్ ఎస్టేట్ మాఫియా లీడర్ (పంకజ్ ఝా), అధికారులకు లంచాలు ఇచ్చి ఆ 150 ఏళ్ళ నాటి దుకాణాన్ని కూల్చేయాలని ఒక ఫేక్ లీగల్ ‘నోటీస్’ పంపిస్తాడు.
అక్కడి నుండి ఆ సామాన్య వృద్ధుడు ఆ అవినీతి సిస్టమ్‌పై చేసిన దండయాత్రే ఈ సినిమా. కోర్టులు చుట్టూ తిరుగుతూ, లాయర్ల మైండ్ గేమ్స్ ని తట్టుకుంటూ ఆ భారీ శక్తులను అతను ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఇందులో చాలా ఎమోషనల్‌గా డిజైన్ చేశారు. అరుణ్ గోవిల్ తన పవర్‌ఫుల్ అండ్ సాఫ్ట్ యాక్టింగ్ తో వన్-మెన్ షో చేయగా, పంకజ్ ఝా క్రూరమైన విలనిజం సినిమాకు మేజర్ పిల్లర్ లా నిలిచింది. ఒక సామాన్యుడి ధైర్యాన్ని చాటిచెప్పే ఈ గ్రిప్పింగ్ సోషల్ డ్రామాని ఓటీటీ లో తప్పకుండా వాచ్ చేయండి.
ఈ సినిమాలో అరుణ్ గోవిల్, దీపికా చిఖ్లియా, పంకజ్ ఝా, ఆదిత్య ప్రతాప్ సింగ్ రఘువంశీ తదితరులు నటించారు. ప్రదీప్ గుప్తా దర్శకత్వం వహించగా, ఆదిత్య ప్రతాప్ సింగ్ రఘువంశీ కథ అందించడంతో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు. ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాకుండా నేరుగా డిజిటల్ ప్రీమియర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2026 నవంబర్ 6 నుంచి WAVES OTTలో స్ట్రీమింగ్ అవుతోంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, కమర్షియల్ హంగుల కంటే సామాన్యుల జీవితాలు, వ్యవస్థతో చేసే పోరాటం వంటి అంశాలతో సాగే సోషల్ డ్రామాలను ఇష్టపడేవారికి ‘Notice’ నచ్చుతుంది.
Read Also: చెస్ బోర్డ్ మీద ప్రపంచాన్ని జయించాలనుకుంటున్న పదేళ్ల పిల్లాడి కథ… ఇన్స్పిరేషనల్ స్పోర్ట్స్ డ్రామా