Kannada Survival Crime Thriller: సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ సినిమాలకు డిజిటల్ స్క్రీన్స్ పై ఎప్పుడూ విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇలాంటి కంటెట్ లో మైండ్ గేమ్స్, ఊహించని ట్విస్టులు ఆడియన్స్‌ని సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడతాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ కూడా అలాంటిదే. ఒక నిర్జన ప్రాంతంలోని గెస్ట్‌హౌస్.. ప్రశాంతంగా గడపాలనుకున్న ఓ జంట.. అనుకోకుండా అక్కడికి చేరుకున్న కొంతమంది యువకులు. ఆ తర్వాత అక్కడ జరిగే దారుణమైన సంఘటనలు.. వాటి నుంచి బయటపడేందుకు కొందరు చేసే పోరాటం. ఇలాంటి కంటెంట్ తో ఓ కన్నడ మూవీ సీట్ ఎడ్జ్ థ్రిల్ ను ఇస్తోంది. థియేటర్లలో రచ్చ చేసి ఏకంగా 9.5 రేటింగ్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సరికొత్త కన్నడ సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘Anireekshita Atithigalu’. సమాజంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, వాటి వెనుక ఉన్న నేర ప్రవృత్తిని ఇందులో కళ్ళకు కట్టినట్లు చూపించారు. మరి ఈ సినిమా కథలోని అసలు ట్విస్టులేంటో ? ఏ ఓటీటీలో చూడచ్చో ? తెలుసుకుందాం పదండి.
విభు (శ్రీ దత్త) తన స్నేహితురాలు తాష్వి (హరితా షా)తో కలిసి ఒక ట్రిప్‌కు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటాడు. అయితే దారిలో అతడి స్నేహితులైన శక్తి (వివేక్ సింహ), చిరు, రాబీ కూడా తమను కొంత దూరం తీసుకెళ్లాలని అడుగుతారు. వారిని నమ్మి కారులో ఎక్కించుకున్న విభుకు అసలు విషయం తెలియదు. ఆ యువకులు తాష్విని స్పృహ కోల్పోయేలా చేసి, అడవిలో ఉన్న ఒక గెస్ట్‌హౌస్‌కు తీసుకెళ్తారు. అక్కడ ఆమెపై లైంగిక దాడికి పాల్పడి, ఆ తర్వాత హత్య చేసి అడవిలోనే పాతిపెట్టాలనేది వారి పథకం. ఇంతకీ ఈ గ్యాంగ్ ఇలాంటి నేరానికి పాల్పడటం ఇదే మొదటిసారా? అనే అనుమానం కూడా కథలో కలుగుతుంది.
ఇదే సమయంలో ఆ గెస్ట్‌హౌస్‌కు మరో జంట అయిన చక్రి (మైత్రి జగ్గి), గిరిజ (సంప్రప్తి అల్వా) కూడా చేరుకుంటారు. అక్కడ జరుగుతున్న భయంకరమైన విషయాన్ని తెలుసుకున్న వీరిద్దరూ తాష్విని కాపాడేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఆమెను రక్షించే క్రమంలో గిరిజ కూడా ప్రమాదంలో చిక్కుకుంటుంది. దీంతో చక్రి తన ప్రేయసిని, తాష్విని కాపాడేందుకు నేరగాళ్లతో పోరాడాల్సి వస్తుంది. మరోవైపు ఆ గెస్ట్‌హౌస్‌కు వచ్చే కేర్‌టేకర్, సీసీటీవీ రిపేర్ చేసే వ్యక్తి వంటి పాత్రలతో కథలో మరిన్ని అనుమానాలు, ఉత్కంఠ పెరుగుతాయి. చివరకు ఆ రాత్రి అక్కడ ఏం జరిగింది? ఈ దారుణం వెనుక ఉన్నవారి నిజస్వరూపం ఎలా బయటపడింది? అనేది సినిమాలో చూడాలి. అయితే ఇందులో హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది అందరూ కలిసి చూసే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కాదు. ముఖ్యంగా అడల్ట్ కంటెంట్, హింసను తట్టుకోగలిగే క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకులే ఈ సినిమాను ఎంచుకోవడం మంచిది.
ఈ చిత్రంలో వివేక్ సింహ, మైత్రి జగ్గి, సంప్రప్తి అల్వా, హరితా షా, శ్రీ దత్త, దయా పల్లవగెరె, దైవిక్ నాగ్ తదితరులు నటించారు. మనోజ్ అన్నయ్య దర్శకత్వం వహించగా, బి. వినోద్ కుమార్ నిర్మించారు. స్వామినాథన్ ఆర్.కే సంగీతం అందించారు. ఈ సినిమా 2026 సెప్టెంబర్ 18న థియేటర్లలో విడుదలైంది. సుమారు 2 గంటల 41 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రం ప్రస్తుతం Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. కన్నడ ఆడియోతో పాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ ప్రస్తుతం లేదు.
Read Also: చీకటి పడితే ఆ అడవిలోకి పోవద్దు… వనదేవత విలయతాండవం… ఒళ్లు గగుర్పొడిచే హారర్