E-Paper
Advertisement

అపార్ట్‌మెంట్‌లోని అందరికీ కోట్ల రూపాయల ఆఫర్‌… బిల్డర్‌ కు బిగ్ ట్విస్ట్ ఇచ్చే రిటైర్డ్‌ టీచర్‌

అపార్ట్‌మెంట్‌లోని అందరికీ కోట్ల రూపాయల ఆఫర్‌… బిల్డర్‌ కు బిగ్ ట్విస్ట్ ఇచ్చే రిటైర్డ్‌ టీచర్‌
Advertisement

Social Drama on OTT: ముంబై లాంటి మహానగరాల్లో ఒక సొంత ఇల్లు సంపాదించుకోవడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది ఒక ఇంట్లో ఎన్నో ఏళ్లుగా జీవిస్తూ, అక్కడి మనుషులతో అనుబంధాలు పెంచుకున్న తర్వాత దాన్ని వదులుకోవాల్సి వస్తే ఆ బాధ ఎలా ఉంటుంది? అందులోనూ చుట్టూ ఉన్నవాళ్లంతా డబ్బు కోసం ఇల్లు అమ్మేయడానికి సిద్ధపడి, ఒక్కరు మాత్రం ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే పరిస్థితి ఎలా మారుతుంది? ఇలాంటి ఆసక్తికరమైన పాయింట్‌తో తెరకెక్కిన హిందీ సోషల్ డ్రామా ‘Last Man in the Tower’. బుకర్ ప్రైజ్ విజేత అరవింద్ అడిగా రాసిన నవల ఆధారంగా ఈ సినిమాను బెన్ రేఖి తెరకెక్కించారు. నేషనల్ అవార్డ్ విన్నర్ మనోజ్ బాజ్‌పాయ్, బోమన్ ఇరానీ, దివ్యా దత్తా లీడ్ రోల్స్ లో నటించిన ఈ గ్రిప్పింగ్ సోషల్ సైకలాజికల్ డ్రామా సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదలై, నవంబర్ 6 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమాను ఏ ఓటీటీలో ఎందుకు చూడాలో తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ముంబైలోని వాకోలా ప్రాంతంలో ఉన్న పాత అపార్ట్‌మెంట్‌ పేరు విశ్రామ్ సొసైటీ. అందులో యోగేష్ మిశ్రా అలియాస్ మాస్టర్‌జీ (మనోజ్ బాజ్‌పాయ్) అనే రిటైర్డ్ స్కూల్ టీచర్ నివసిస్తుంటాడు. భార్య మరణించిన తర్వాత ఒంటరిగా ఉంటున్న ఆయనకు ఆ ఇల్లు కేవలం నివాసం మాత్రమే కాదు.. ఎన్నో జ్ఞాపకాలతో ముడిపడిన ప్రపంచం. ఆ సొసైటీలోని మిగతా కుటుంబాలతోనూ అతడికి మంచి అనుబంధం ఉంటుంది. ఇలాంటి సమయంలో ధర్మెన్ షా (బోమన్ ఇరానీ) అనే సంపన్న రియల్ ఎస్టేట్ డెవలపర్ విశ్రామ్ సొసైటీపై కన్నేస్తాడు. పాత భవనాన్ని తొలగించి అక్కడ భారీ హైరైజ్ నిర్మించాలనేది అతడి ప్లాన్. అందుకోసం ఫ్లాట్ల యజమానులకు మార్కెట్ ధర కంటే రెండున్నర రెట్లు ఎక్కువ డబ్బు ఇచ్చే రీడెవలప్‌మెంట్ ఆఫర్ తీసుకొస్తాడు. మొదట కొందరు సందేహించినా, అంత పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందనే ఆశతో చాలామంది ఆ ఒప్పందానికి అంగీకరిస్తారు. ఆ డబ్బుతో అందరి లైఫ్స్ మారిపోతాయని విశ్రామ్ సొసైటీలోని మిగిలిన పొరుగు వాళ్లంతా హ్యాపీగా అగ్రిమెంట్ పై సైన్ చేస్తారు.

Advertisement

కానీ మాస్టర్‌జీ మాత్రం తన ఫ్లాట్‌ను అమ్మడానికి ససేమిరా అంటాడు. ఆ ఇల్లు వదిలి వెళ్లడానికి ఆయనకు ఇష్టం ఉండదు. దీంతో అందరూ అంగీకరించిన డీల్‌కు ఆయన ఒక్కరి నిర్ణయం అడ్డంకిగా మారుతుంది. తన భార్య, కొడుకు జ్ఞాపకాలు ఉన్న ఆ ఇంటిని వదిలి వెళ్లడం ఇష్టం లేక, అతను ఆ కోట్ల రూపాయల ఆఫర్ ని తిరస్కరిస్తాడు. లీగల్ రూల్స్ ప్రకారం ఒక్కరు ఒప్పుకోకపోయినా బిల్డింగ్ కూల్చడం కుదరదు కాబట్టి, ఆ రిటైర్డ్ టీచర్ నిర్ణయం వల్ల అందరి డబ్బు ఆగిపోతుంది. దాంతో నిన్నటివరకు ప్రాణంగా ఉన్న పొరుగు వాళ్లే మాస్టర్ జీ కి శత్రువులుగా మారి, అతనిని మానసికంగా హింసించడం స్టార్ట్ చేస్తారు. తన ఇంటి కోసం, తన ప్రిన్సిపల్స్ కోసం ఆ రిటైర్డ్ టీచర్ ఒంటరిగా చేసిన ఈ పోరాటం చూస్తే శభాష్ అనాల్సిందే. మనోజ్ బాజ్‌పాయ్ తన కెరీర్ బెస్ట్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఇవ్వగా, బోమన్ ఇరానీ మైండ్ గేమ్స్ అయితే అదిరిపోయాయి. ఇది కేవలం ఒక రిటైర్డ్ టీచర్, బిల్డర్ మధ్య జరిగే పోరాటం మాత్రమే కాదు. డబ్బు, స్వార్థం మనుషుల మధ్య ఉన్న అనుబంధాలను ఎలా మార్చేస్తాయో చూపించే కథ ఇది.

జీ 5లో స్ట్రీమింగ్

ఈ చిత్రంలో మనోజ్ బాజ్‌పాయ్, బోమన్ ఇరానీ, దివ్యా దత్తాతో పాటు సుకాంత్ గోయల్, చందన్ రాయ్ సన్యాల్ తదితరులు నటించారు. దర్శకత్వం బెన్ రేఖి వహించగా, ఈ సినిమా 2026 సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదలైంది. నవంబర్ 6 నుంచి ZEE5లో అందుబాటులోకి వచ్చింది. సినిమా నిడివి సుమారు 1 గంట 32 నిమిషాలు. ప్రస్తుతానికి హిందీ ఆడియో మాత్రమే అందుబాటులో ఉంది.

Advertisement

Read Also: బలవంతంగా పెళ్లి… వాయిస్‌ మెసేజ్‌తో కుప్పకూలిన సంసారం… హార్ట్ టచింగ్ రొమాంటిక్ మూవీ

Tags

Related News

ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘గరివిడి లక్ష్మీ’ ..స్ట్రీమింగ్ డేట్ లాక్!

150 ఏళ్ల చరిత్ర ఉన్న దుకాణాన్ని కూల్చేయాలని ప్లాన్… సిస్టమ్‌పై సామాన్యుడి దండయాత్ర

తాతల నాటి రెస్టారెంట్ తెరవడానికి స్టార్ హీరోయిన్ పడ్డ పాట్లు… రియాలిటీ డాక్యుమెంటరీ

రక్తదాహంతో ఉండే దేవతను పూజించే రహస్య తెగ… ప్రేయసి కోసం జ్యోతిష్యుడి డేంజరస్ అడ్వంచర్

రక్తదాహంతో ఉండే దేవతను పూజించే రహస్య తెగ… ప్రేయసి కోసం జ్యోతిష్యుడి డేంజరస్ అడ్వంచర్

గెస్ట్‌హౌస్‌లో రాత్రి… లవర్స్ లైఫ్‌ను రోడ్‌మీదికి లాగిన ఆగంతకుల గ్యాంగ్… కిరాక్ క్రైమ్ థ్రిల్లర్

70s మైసూర్ వైబ్స్… అటు ట్రెడిషన్స్ ఇటు లవ్… ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన మూవీ

Big Stories

Advertisement
×