E-Paper
Advertisement

Crime Thriller OTT : కూతురు మర్డర్… చేపలతోనే జాలరి తీర్చుకునే రివెంజ్ కు ఫ్యూజులు అవుట్

Crime Thriller OTT : కూతురు మర్డర్… చేపలతోనే జాలరి తీర్చుకునే రివెంజ్ కు ఫ్యూజులు అవుట్
Advertisement

Crime Thriller OTT : క్రైమ్ థ్రిల్లర్ కథలను ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు ఆడియన్స్. ఇవి ఇచ్చే థ్రిల్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఓటీటీలో ఎక్కువగా ఈ జోనర్ స్టోరీలే ట్రెండింగ్ లో ఉంటున్నాయి కూడా. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో క్లైమాక్స్ వరకు స్టోరీ సస్పెన్స్ గా సాగుతుంది. కూతురు మర్డర్ కి రివేంజ్ తీర్చుకునే ఒక తండ్రి కథ ఇది. థ్రిల్లర్ ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా. ఈ మూవీ పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2023లో విడుదలైన చైనీస్ క్రైమ్ థ్రిల్లర్ ‘అక్రాస్ ది ఫ్యూరియస్ సీ’ (Across the Furious Sea). ఇది కావో బాపింగ్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో హువాంగ్ బో, జౌ జున్, జు ఫెంగ్, జాంగ్ యూహావో, జౌ యిరాన్ నటించారు. ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్, ముబీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also :  25 ఏళ్లుగా క్రైమ్ అంటే ఏంటో తెలియని గ్రామం… బైక్‌ మిససవ్వడంతో గడబిడ… కడుపుబ్బా నవ్వించే కామెడీ ఎంటర్టైనర్

స్టోరీ ఏమిటంటే

జిన్ అనే జాలరి, తన కూతురు లీనాను జపాన్‌లో ఉన్నత చదువుల కోసం పంపిస్తాడు. ఒకరోజు అతనికి ఒక ఫోన్ వస్తుంది. లీనా జపాన్‌లో శవమై కనిపిస్తుంది. ఆమె శరీరంపై 17 సార్లు కత్తితో పొడిచిన గుర్తులు ఉంటాయి. తన ప్రాణప్రదమైన కూతురు అలా అన్యాయంగా చనిపోయిందని తెలిసి జిన్ విలపిస్తాడు. ఆమె ప్రియుడు మియామియా దీనికి కారణమని జిన్ నమ్ముతాడు. ఇక ప్రతీకారం తీర్చుకోవడం మొదలు పెడతాడు. జిన్ జపాన్ వెళ్లి నిందితుడిని పట్టుకోవాలని చూస్తాడు, కానీ మియామియా చైనాకు పారిపోతాడు. జిన్ కూడా చైనాకు వచ్చి, తన కూతురు చావుకు ప్రతీకారం తీర్చుకోవడానికి వేట మొదలుపెడతాడు.

Advertisement

అయితే మియామియా తల్లి జింగ్ లాన్ చాలా ధనవంతురాలు. తన కొడుకు ఎంత తప్పు చేసినా, అతడిని కాపాడటానికి ఆమె జిన్‌కు అడ్డంగా నిలుస్తుంది. ఈ క్రమంలో ఇద్దరు తల్లిదండ్రుల మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది. సినిమా క్లైమాక్స్ వరకు అందరూ మియామియానే చంపాడని అనుకుంటారు. కానీ లీనా డైరీని చదివినప్పుడు, ఆమె గతాన్ని పరిశీలించినప్పుడు ఒక భయంకరమైన నిజం బయటపడుతుంది. ఆ నిజం ఏమిటి ? లీనాను గాయపరచింది ఎవరు ? ఈ స్టోరీ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×