E-Paper
Advertisement

Crime Thriller OTT : ఓటీటీలో విడుదలైన 6 నెలల తరువాత మరో భాషలోకి ‘మార్గన్’… స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

Crime Thriller OTT : ఓటీటీలో విడుదలైన 6 నెలల తరువాత మరో భాషలోకి ‘మార్గన్’… స్ట్రీమింగ్ ఎక్కడంటే ?
Advertisement

Crime Thriller OTT : విజయ్ ఆంటోనీ క్రైమ్ థ్రిల్లర్ ‘మార్గన్’ (Maargan)గత సంవత్సరం థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. నూతన దర్శకుడు లియో జాన్ పాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్లలో మంచి విజయాన్ని సాధించింది. విజయ్ ఆంటోనీ ఈ సినిమాలో నటించడంతో పాటు సంగీతం కుడా అందించారు. అతని భార్య ఫాతిమా విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ చిత్రాన్ని నిర్మించారు. అంతేకాకుండా ఈ సినిమా ఓటీటీలో కుడా విడుదలై మంచి రెస్పాన్స్ పొందింది. అయితే ఇప్పుడు మరో ఓటీటీలో అడుగు పెట్టి ఆడియన్స్ కి మరింత దగ్గర అయింది సినిమా. ఈ వివరాలు ఏమిటో తలుసుకుందాం.

ఏ ఓటీటీలో అంటే

ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా తెలుగు, తమిళ వెర్షన్ ఇదివరకే ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఆ తరువాత హిందీ డబ్బింగ్ వెర్షన్ జియో హాట్‌స్టార్‌లో వచ్చింది. తాజా అప్‌డేట్ ప్రకారం హిందీ వెర్షన్ ఇప్పుడు ప్రైమ్ వీడియోలో కూడా ప్రీమియర్ అయింది. మరొక ఓటీటీలో ప్లాట్‌ ఫామ్‌లో హిందీ డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో ఉండటం వల్ల, హిందీ ప్రేక్షకులలో ఈ సినిమా ప్రజాదరణ పెరుగుతుందని భావిస్తున్నారు. 2025 జూన్ 27న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ సినిమాలో అజయ్ ధీషన్, సముద్రఖని, బ్రిగిడా, దీప్శిఖ, మహానతి శంకర్ లీడ్ రోల్స్ లో నటించారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

హైదరాబాద్ నగరంలో రమ్య అనే ఒక అమ్మాయి దారుణంగా హత్యకు గురవడంతో కథ మొదలవుతుంది. ఆ హంతకుడు అమ్మాయి శరీరంలోకి ఒక రకమైన ఇంజెక్షన్ ఇస్తాడు. దీనివల్ల మరణించిన తర్వాత ఆ శరీరం మొత్తం నల్లగా మారిపోతుంది. ఆ తరువాత మరిన్ని ఇలాగే జరుగుతాయి. ఈ కేసును ఛేదించడానికి ముంబై అసిస్టెంట్ డీజీపీ ధ్రువ్ (విజయ్ ఆంటోనీ) నియమించబడతాడు. గతంలో తన కూతురు ప్రియ కూడా ఇదే తరహాలో హత్యకు గురవడంతో, ధ్రువ్ ఈ కేసును పర్సనల్ గా తీడుకుంటాడు. నిజానికి గతంలో హంతకుడిని పట్టుకునే క్రమంలో ధ్రువ్ శరీరంపై కూడా ఆ రసాయనం ప్రభావం పడటంతో, అతని శరీరంలో ఒక భాగం నల్లగా మారిపోయి ఉంటుంది. ఇక ఉత్కంఠభరితమైన ఈ ఇన్వెస్టిగేషన్ లో ధ్రువ్ కిల్లర్ ని కనిపడతాడా ? కిల్లర్ ఎందుకు అలా చంపుతున్నాడు ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తలుసుకోవాల్సిందే.

Read Also : ఓటీటీలోకి రానున్న ఫిబ్రవరి మోస్ట్ అవైటింగ్ మలయాళం మూవీస్… ఏ మూవీ ఏ ఓటీటీలో ?

Related News

ఈ వారం ఓటీటీని షేక్ చేస్తున్న 5 క్రేజీ మలయాళం సినిమాలు, సిరీస్‌లు ఇవే… తెలుగులోనూ స్ట్రీమింగ్

తేనె కోసం కొట్టుకుచచ్చే బిజినెస్ మ్యాన్లు… ఇలాంటి గ్యాంగ్‌స్టర్ డ్రామాను ఎక్కడా చూసుండరు

క్రష్ ని ఇంప్రెస్ చేయడానికి అబద్ధం… కట్ చేస్తే వరల్డ్ పాపులర్ చెఫ్

ప్రాంక్ కాస్తా క్రేజీ అడ్వెంచర్ గా మారితే… కడుపుబ్బా నవ్వించే కామెడీ డ్రామా

భార్య తప్పును తలపై వేసుకుని జైలుకు… హై-వోల్టేజ్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ ధమాకా

అర్ధరాత్రి లాంగ్ డ్రైవ్‌… రాంగ్ టర్న్ తో డైరెక్ట్ గా నరకంలోకి… బోన్ చిల్లింగ్ ట్విస్టులు

ఒంటి నిండా రక్తంతో అపరిచిత మహిళ… నిజమైన మొసళ్ళతో తీసిన డార్క్ హర్రర్ అడ్వెంచర్

నైట్ క్లబ్ లో డ్రీం గర్ల్… కట్ చేస్తే కిరాక్ ట్విస్ట్… మనసుకు హత్తుకునే లవ్ స్టోరీ

Big Stories

Advertisement
×