E-Paper
Advertisement

Crime Thriller OTT : థియేటర్లలోకి బ్లాక్ బస్టర్ సిరీస్ ‘మీర్జాపూర్’… ఎప్పటి నుంచి చూడచ్చు అంటే ?

Crime Thriller OTT : థియేటర్లలోకి బ్లాక్ బస్టర్ సిరీస్ ‘మీర్జాపూర్’… ఎప్పటి నుంచి చూడచ్చు అంటే ?
Advertisement

Crime Thriller OTT : క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ అంటే మొదటగా గుర్తుకు వచ్చేది ‘మీర్జాపూర్’. అంతలా ఇది ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. డైలాగ్స్ నుంచి, యాక్షన్ వరకు ఆడియన్స్ తెగ ఎంజాయ్ చేశారు. ఇప్పటి వరకు వచ్చిన మూడు సీజన్లు సూపర్ హిట్ అయ్యాయి. సీజన్ 4, ఈ ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది. షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైందని, వేగంగా జరుగుతోందని సమాచారం. అమెజాన్ ప్రైమ్ వీడియో ఇంకా అధికారికంగా తేదీని ప్రకటించలేదు. ఈ ఫ్రాంచైజీ మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. ‘మీర్జాపూర్’ ఇప్పుడు సినిమా రూపంలో రాబోతోంది. మరి ఇది ఎప్పుడు థియేటర్లలో అడుగు పెట్టబోతోంది ? అనే విషయం తెలుడుకుందాం.

థియేటర్లలో రిలీజ్

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలో విడుదల అవుతుందో తెలియజేసే పోస్టర్‌ను మేకర్స్ షేర్ చేశారు. ఇది ‘మీర్జాపూర్ ది మూవీ ‘ (Mirzapur The Movie) అనే పేరుతో 2026 సెప్టెంబర్ 4 థియేటర్లలో విడుదల కానుంది. ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ‘మిర్జాపూర్ ది మూవీ’లో అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి, దివ్యేందు, జితేంద్ర కుమార్, అభిషేక్ బెనర్జీ, రసిక దుగల్, శ్వేతా త్రిపాఠి, శ్రియా పిల్‌గావ్‌కర్, హర్షిత గౌర్, షీబా చద్దా, రాజేష్ తైలాంగ్‌భూషణ్, కులభూషణ్ తదితరులు నటించారు. ఈ మూడు సిరీస్ లను ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.

పోస్టర్ తోనే హైప్

Advertisement

‘మీర్జాపూర్ ది మూవీ’ పోస్టర్ ఎడారిలో సెట్ చేశారు. ఈ పోస్టర్ కలీన్ భయ్యా కూర్చున్న సింహాసనాన్ని కార్లతో లాగుతున్నట్లు చూపించారు. ఇది చూడటానికి మరింత ఆసక్తి పెంచుతోంది. ‘మీర్జాపూర్ ది మూవీ’ సిరీస్ నుండి బబ్లూ భయ్యాను చంపిన క్షణం నుండి, గుడ్డు పండిట్ మున్నా భయ్యాను చంపి ప్రతీకారం తీర్చుకునే వరకు ప్రతి పాత్రను తిరిగి తెరపైకి తీసుకువస్తుంది. ఇక సీజన్ 4 కూడా ఈ ఏడాది వచ్చే అవకాశం ఉంది. మూడవ సీజన్ చివరలో గుడ్డు పండిట్ జైలుకు వెళ్లడం, కాలీన్ భయ్యా తిరిగి రావడం వంటి మలుపుల తర్వాత, సీజన్ 4లో అధికారం కోసం వీరిద్దరి మధ్య జరిగే భీకర పోరాటాన్ని మనం చూడవచ్చు. ఈ సినిమా చూడాలంటే ఫ్యాన్స్ మరికొంత సమయం ఆగాల్సిందే.

Read Also : ఫ్యూచర్ నుంచి వచ్చే పెళ్ళాం… భర్తకి షాకింగ్ ట్విస్టులు… ఇన్స్టా లో ట్రెండ్ అవుతున్న మాస్టర్ పీస్

Related News

నైట్ క్లబ్ లో డ్రీం గర్ల్… కట్ చేస్తే కిరాక్ ట్విస్ట్… మనసుకు హత్తుకునే లవ్ స్టోరీ

హఠాత్తుగా ఆకాశంలో హోల్… టైమ్ ట్రావెల్ తో థ్రిల్లింగ్ సై-ఫై అడ్వెంచర్

విశ్వంభర ఓటీటీ డీల్ పై సందిగ్ధత.. తెరపైకి కొత్త విడుదల తేదీ!

స్కూల్ పిల్లాడి దారుణ హత్య… ప్రాణం పణంగా పెట్టి నిజం తేల్చే తండ్రి… ఊపిరి బిగబట్టించే సైకలాజికల్ మిస్టరీ

పగ, ప్రతీకారంతో క్రిటిక్ ప్రాణాంతక కుట్రలు… ఈ డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ ను డోంట్ మిస్

​ఏలియన్స్ దాడి నుండి భూమిని కాపాడే ఏజెంట్లు… మైండ్ బ్లోయింగ్ సై-ఫై హై-టెక్ యాక్షన్ అడ్వెంచర్

వైట్ హౌస్ పై ఉగ్రవాదుల అటాక్… ప్రెసిడెంట్ ను కాపాడేందుకు సీక్రెట్ ఏజెంట్ మైండ్ బ్లాక్ ప్లాన్… డెడ్లీ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో

సమస్యలతో అల్లాడుతున్న ఐదుగురి జీవితాల్లోకి బాబా ఎంట్రీ… ఎమోషనల్ స్పిరిచువల్ డ్రామా

Big Stories

Advertisement
×