E-Paper
Advertisement

Crime Thriller OTT : కలెక్టర్ ను కిడ్నాప్ చేసి ఖతర్నాక్ ప్లాన్… ఇంటెన్స్ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్

Crime Thriller OTT : కలెక్టర్ ను కిడ్నాప్ చేసి ఖతర్నాక్ ప్లాన్… ఇంటెన్స్ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్
Advertisement

Crime Thriller OTT : మలయాళం సినిమాలకు ఇప్పుడు క్రేజ్ బాగా పెరిగింది. స్టోరీలను రియలిస్టిక్ గా చూపించడంలో వీళ్ళు ఒక అడుగు ముందే ఉన్నారు. 1996లో కేరళలో జరిగిన ఒక సంచలనాత్మక యదార్థ సంఘటన ఆధారంగా ఒక మలయాళ సినిమా రూపొందింది. ఐయండిబిలో దీనికి 8.0/10 రేటింగ్ ఉండటం విశేషం. ఈ పొలిటికల్ థ్రిల్లర్ జస్టిస్ థీమ్స్‌తో ఉంటుంది. ఆ యదార్థ సంఘటన ఏమిటి ? ఈ సినిమా స్టోరీ గురించి ఓ లుక్ వేద్దాం పదండి.

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2022లో వచ్చిన ఈ మలయాళ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా పేరు ‘పడ’ (Pada). కమల్ కె.ఎం. దర్శకత్వంలో ఇది తెరకెక్కింది. కుంజాక్కో బోబన్, జోజు జార్జ్, శైని ఆహమద్, జిస్ జార్జ్ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ చిత్రం ఒక గ్రామస్థులు తమ గ్రామాన్ని కాపాడుకోవడానికి పోరాడే స్టోరీ. ఇది క్రిటిక్స్, ఆడియన్స్ రెండింట్లోనూ భారీ హిట్ అయింది. కుంజాక్కో బోబన్, జోజు జార్జ్ నటన పర్ఫార్మెన్స్ రియలిస్టిక్ గా ఉంటుంది. మలయాళ సినిమా లవర్స్‌కు మస్ట్ వాచ్ మూవీ ఇది. Jio Hotstar, prime Videoలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also : తెలంగాణ అమ్మాయిల రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తో… ప్రతీ ఒక్కరూ చూడాల్సిన డాక్యుమెంటరీ

స్టోరీ ఏమిటంటే

1975లో కేరళ ప్రభుత్వం తెచ్చిన ‘ఆదివాసీ భూ చట్టం’ ప్రకారం, గిరిజనుల నుంచి ఇతరులు ఆక్రమించుకున్న భూములను తిరిగి వారికే అప్పగించాలి. అయితే 1996లో అప్పటి ప్రభుత్వం ఈ చట్టానికి ఒక సవరణ తెచ్చి, ఆక్రమణలను క్రమబద్ధీకరించడానికి ప్రయత్నించింది. దీనివల్ల గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని భావించిన ‘అయ్యంకాళి పడ’ అనే గ్రూపు నిరసన తెలపాలని నిర్ణయించుకుంటుంది. అందులో భాగంగా నలుగురు వ్యక్తులు బాలు (వినాయకన్), అరవిందన్ (కుంచాకో బోబన్), కుట్టి (జోజు జార్జ్), నారాయణన్ (దిలీష్ పోతన్) సాధారణ పౌరులుగా పాలక్కాడ్ కలెక్టరేట్‌లోకి ప్రవేశిస్తారు.

Advertisement

వీళ్ళు కలెక్టర్‌ను కలిసే నెపంతో ఛాంబర్‌లోకి వెళ్లి అతన్ని బందీగా చేసుకుంటారు. ప్రభుత్వం ఆ గిరిజన వ్యతిరేక బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తారు. ప్రభుత్వం, పోలీసులు, మీడియా మొత్తం కలెక్టరేట్ వద్దకు చేరుకుంటారు. ముఖ్య కార్యదర్శి (ప్రకాష్ రాజ్) నేతృత్వంలో చర్చలు జరుగుతాయి. చర్చల అనంతరం, ప్రభుత్వం వారి డిమాండ్లను పరిశీలిస్తామని హామీ ఇవ్వడంతో వారు కలెక్టర్‌ను విడుదల చేస్తారు. అయితే చివరిలో వారు ఉపయోగించిన గన్ ఒక బొమ్మ తుపాకీ అని, బాంబులు కూడా నకిలీవని తెలుస్తుంది. కేవలం గిరిజనుల సమస్యను లోకానికి చాటడానికే వారు ఈ సాహసం చేశారని అర్థమవుతుంది. చివరికి వీళ్ళ వల్ల సమస్య పరిష్కారం అవుతుందా ? వీళ్ళు జైలుకు వెళ్తారా ? అనేది ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×