E-Paper
Advertisement

Top 5 Crime Thrillers OTT : సీను సీనుకో ట్విస్ట్… ఖతర్నాక్ క్లైమాక్స్… బుర్రకు పదును పెట్టే బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్స్

Top 5 Crime Thrillers OTT : సీను సీనుకో ట్విస్ట్… ఖతర్నాక్ క్లైమాక్స్… బుర్రకు పదును పెట్టే బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్స్
Advertisement

Top 5 Crime Thrillers OTT : యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పటికీ మంచి ఆదరణే ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఉత్కంఠభరితంగా ఉండటమే కాదు, ఆడియన్స్ ను ఆలోచింపజేస్తాయి. ఇప్పటికే ఓటీటీలో ‘హనీమూన్ సే హత్య’, ‘సైలెంట్ స్క్రీమ్స్: ది లాస్ట్ గర్ల్స్ ఆఫ్ తెలంగాణ’ వంటి క్రైమ్ డాక్యుమెంటరీలు సందడి చేస్తున్నాయి. మరి ఇలా నిజమైన క్రైమ్ కథల ఆధారంగా రూపొందించిన సినిమాలను చూడడం ఇష్టమా ? అయితే ఈ మూవీ సజెషన్ మీ కోసమే. మరి ఆ టాప్ 5 క్రైమ్ చిత్రాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

Talvar Movie

“తల్వార్” చిత్రం 2008లో జరిగిన ఆరుషి తల్వార్, హేమరాజ్ ల మర్డర్స్ ఆధారంగా రూపొందింది. 14 ఏళ్ల బాలిక హత్యకు సంబంధించిన మిస్టరీని ఛేదించడానికి ప్రయత్నించే పోలీస్ గా ఇర్ఫాన్ ఖాన్ నటించారు. సోహా అలీ ఖాన్, రజత్ కపూర్ ఆ పాప తల్లిదండ్రుల పాత్రలను పోషించారు. ఇప్పటికీ ఈ కేసు మిస్టరీగానే ఉండడం గమనార్హం. ఈ కేసులో ఆ పాప తల్లిదండ్రులే నిందితులు అని పోలీసులు చెప్పినా, సరైన ఆధారాలు లేకపోవడంతో కోర్టు కేసును కొట్టేసింది. దీన్ని ప్రైమ్‌లో చూడవచ్చు.

No One Killed Jessica Movie

Advertisement

“నో వన్ కిల్డ్ జెస్సికా” అనే టైటిల్ తో రూపొందిన ఈ క్రైమ్ ఫిల్మ్ ను ఢిల్లీ మోడల్, బార్టెండర్ జెస్సికా లాల్ నిజ జీవిత మర్డర్ ఆధారంగా తెరకెక్కించారు. రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాణి ముఖర్జీ, విద్యాబాలన్, మైరా కర్ణ్ తదితరులు నటించారు. దీన్ని నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు.

Black Friday

“బ్లాక్ ఫ్రైడే” చిత్రం భారతదేశాన్ని కుదిపేసిన ఉగ్రవాద దాడులలో ఒకటైన 1993 ముంబై బాంబు దాడులు, ఆ తరువాత జరిగిన ఇన్వెస్టిగేషన్ ఆధారంగా తెరకెక్కింది. ఈ చిత్రంలో పవన్ మల్హోత్రా, ఆదిత్య శ్రీవాస్తవ, శ్వేతా మీనన్ నటించారు. “బ్లాక్ ఫ్రైడే”ని YouTubeలో చూడవచ్చు.

Batla House

Advertisement

‘బాట్లా హౌస్’ అనే టైటిల్ తో రూపొందిన ఈ బాలీవుడ్ క్రైమ్ డ్రామా 2008లో ఢిల్లీలో జరిగిన బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్ ఆధారంగా నిర్మితమైంది. ఈ చిత్రం ఉత్కంఠభరితమైన కథనంతో ఆద్యంతం ఆసక్తికరంగా నడుస్తుంది. ఈ యాక్షన్ డ్రామాలో జాన్ అబ్రహం, మృణాల్ ఠాకూర్, మనోజ్ పహ్వా, రాజేష్ శర్మ, అపరశక్తి ఖురానా నటించారు. ఇది ప్రైమ్‌ వీడియోలో అందుబాటులో ఉంది.

Raman Raghav 2.0

1960లలో ముంబైలో సంచలనం సృష్టించిన సీరియల్ కిల్లర్ రామన్ రాఘవ్ స్టోరీనే “రామన్ రాఘవ్ 2.0”. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ సీరియల్ కిల్లర్ పాత్రలో నటించగా, విక్కీ కౌశల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. ఈ మూవీని యూట్యూబ్, ZEE5 ఓటీటీలో చూడవచ్చు.

Read Also : ఈ వారం ఓటీటీలోకి కొత్త మలయాళం మూవీస్… ఆ రెండూ డోంట్ మిస్

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×