E-Paper
Advertisement

Cross Web series OTT : నేరస్తులను వేటాడే డిటెక్టివ్… ఊహించని ట్విస్టులున్న ఒక్కో ఎపిసోడ్

Cross Web series OTT : నేరస్తులను వేటాడే డిటెక్టివ్… ఊహించని ట్విస్టులున్న ఒక్కో ఎపిసోడ్
Advertisement

Cross Web series OTT : క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లకు ఇప్పుడు క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా ఇవే సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ప్రేక్షకుల అభిరుచి మేరకు, మేకర్స్ కూడా ఇలాంటి జానర్ కథలనే ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఒక హాలీవుడ్ సిరీస్ గురించి చెప్పుకోవాలి. ఇందులో ఒక ఫోరెన్సిక్ సైకాలజిస్ట్ డిటెక్టివ్, క్రిమినల్స్ వేటలో పడుతుంటాడు. తెలివితేటలతో అతను పట్టుకునే స్టైల్ చాలా క్రేజీగా ఉంటుంది. ఊహించని ట్విస్టులు వస్తూనే ఉంటాయి. ఈ సిరీస్ మొదటి సీజన్ హిట్ కూడా అయింది. ఇప్పుడు రెండో సీజన్ కూడా స్ట్రీమింగ్ కి వచ్చింది.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘క్రాస్’ (Cross). జేమ్స్ ప్యాటర్సన్ రాసిన పాపులర్ నవలల ఆధారంగా ఇది రూపొందింది. అలెక్స్ క్రాస్ పాత్రలో ఆల్డిస్ హోడ్జ్ నటించగా, ఐజయా ముస్తఫా, జువానిటా జెన్నింగ్స్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. 2024 నవంబర్14న ఈ సిరీస్ Amazon Prime Videoలో విడుదలైంది. మొదటి సీజన్ కు మంచి ఆదరణ పొందడంతో 2026 ఫిబ్రవరి 11 నుంచి రెండో సీజన్ కూడా స్ట్రీమింగ్ కు తెచ్చారు. మొదటి సీజన్ లో ఎనిమిది ఎపిసోడ్స్ ఉండగా, రెండో సీజన్ లో మూడు ఎపిసోడ్స్ ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. మిగతా ఎపిసోడ్స్ ప్రతి వారం ఒక్కోటి చొప్పున రిలీజ్ కానున్నాయి.

స్టోరీ ఏమిటంటే

Advertisement

అలెక్స్ వాషింగ్టన్ డీసీలో ఒక తెలివైన పోలీస్ డిటెక్టివ్. అంతేకాదు అతను ఒక సైకాలజిస్ట్ కూడా. ఇతనికి ఒక ప్రత్యేకమైన పవర్ ఉంది. నేరస్థుల మనసులోకి వెళ్లి, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో ముందే కనిపెట్టగలడు. అయితే ఒక రోజు తన భార్య దారుణంగా హత్యకు గురైన తర్వాత, ఆ బాధ నుండి బయటపడలేక అలెక్స్ చాలా ఇబ్బంది పడుతుంటాడు. ఆ బాధతో పోరాడుతూనే, సమాజంలో తిరుగుతున్న ప్రమాదకరమైన సీరియల్ కిల్లర్లను పట్టుకోవడానికి తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతుంటాడు. ఇక కథలో ఒక సైకో కిల్లర్ తన నేరాలను ఒక ఆర్ట్ లాగా భావిస్తూ వరుస హత్యలు చేస్తుంటాడు. వాడిని అలెక్స్ ఎలా పట్టుకున్నాడనేది ప్రధాన అంశం.

ఇక రెండో సీజన్లో కథ మరింత ఇంటెన్స్ గా మారుతుంది. ఈసారి అవినీతిపరులైన కోటీశ్వరులను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేయడం మొదలుపెడతాడు కిల్లర్. అతన్ని పట్టుకోవడం అలెక్స్‌కు ఒక పెద్ద సవాలుగా మారుతుంది. ఎందుకంటే హంతకుడు చేసేది తప్పు అని తెలిసినా, వాడు చంపేవాళ్లు కూడా నేరస్థులే కావడంతో ప్రజల్లో భిన్నమైన అభిప్రాయాలు వస్తుంటాయి. ఈ చిక్కుముడిని అలెక్స్ ఎలా సాల్వ్ చేశాడానేది మిగతా కథ.

Advertisement

Read Also : 17 ఏళ్లకే గ్యాంగ్ స్టర్… ఒళ్ళు జలదరించేలా ఒక్కో సీన్… అల్టిమేట్ యాక్షన్ థ్రిల్లర్

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×