OTT Movie : మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు చూస్తున్నంత సేపు ఎంగేజింగ్ గా, సూపర్ ఎగ్జైటింగ్ గా ఉంటాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం అదిరిపోయే థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ను ఇస్తాయి. అలాంటి సినిమానే ఒకటి రీసెంట్ గా ఓటీటీలోకి అడుగు పెట్టింది. ఇదొక తమిళ సినిమా. పెళ్ళయి నెలలు కూడా గడవక ముందే కొత్త పెళ్లి కూతురుకు కష్టం వచ్చిపడుతుంది. మొగుడు మూడు నెలలకే కన్పించకుండా పోతాడు. ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే విషయాన్ని తెలుసుకుందాం పదండి.
కథలోకి వెళ్తే…
ఈ సినిమా పూర్ణి (లిజోమోల్ జోస్) అనే కొత్తగా పెళ్ళయిన మహిళ జీవితం చుట్టూ తిరుగుతుంది. ఆమె తన భర్త అరవింద్ (హరి కృష్ణన్)తో చెన్నైలో హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తుంది. అయితే పెళ్ళయిన మూడు నెలలకే భర్త ఆమెపై ఆధిపత్యం చెలాయించడం మొదలు పెడతాడు. ఆమెను వంటింటి కుందేలుగా, తనకు సేవ చేసే పని మనిషిగా మారుస్తాడు. అయినప్పటికీ ఆమె పల్లెత్తు మాట అనదు. చూసే వాళ్ళందరికీ కొత్త జంట సంతోషంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇక్కడే కథలో కీలక మలుపు వస్తుంది.
పూర్ణి తన భర్త అరవింద్ అన్నా (లోస్లియా మరియనేసన్) అనే మరో మహిళతో ఎఫైర్ నడుపుతున్నాడని తెలుసుకుంటుంది. దీంతో ఒక రోజు వంటగదిలో ఇద్దరి మధ్య తీవ్రమైన వాగ్వాదం జరుగుతుంది. ఆ తర్వాత అరవింద్ సడన్ గా మిస్ అవుతాడు. దీంతో విషయం పోలీసులకు చేరుతుంది. అయితే పోలీసులు అతను కన్పించకుండా పోవడానికి ఆర్థిక సమస్యలే కారణం అనుకుంటారు. కానీ అన్నాకు… మొగుడు మిస్ అయ్యాడని ఏమాత్రం టెన్షన్ పడకుండా పూర్ణి ప్రశాంతంగా ఉండడంలో అనుమానం మొదలవుతుంది. దీంతో ఆమె అసలేం జరిగిందో తెల్సుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇంకేముంది మైండ్ బెండ్ అయ్యే ట్విస్ట్ బయట పడుతుంది. మరి ఆ ట్విస్ట్ ఏంటి? పూర్ణి భర్త ఏమయ్యాడు? ఒకవేళ పూర్ణినే భర్తను చంపి ఉంటే, ఆ శవాన్ని ఏం చేసింది? పోలీసులకు దొరకాకుండా ఎలా తప్పించుకుంది? అనే విషయాలను మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : కుళ్లిపోయిన శవాలు… పోలీసే హంతకుడిగా మారితే… నరాలు కట్ అయ్యే మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్
ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ ?
సినిమా నెమ్మదిగా మొదలై, రెండవ భాగంలో వేగం పుంజుకుంటుంది. లిజోమోల్ జోస్ అద్భుతమైన నటన, గోవింద్ వసంత సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ మూవీ పేరు ‘జెంటిల్ ఉమెన్’ (Gentlewoman) ఈ ఏడాదే రిలీజ్ అయిన ఈ తమిళ డ్రామా-మిస్టరీ-థ్రిల్లర్ చిత్రానికి జోషువా సేతురామన్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime video)లో అందుబాటులో ఉంది.