OTT Movie : భార్య భర్తల సంబంధాలను చూపిస్తూ ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే రీసెంట్ గా మలయాళం లో తెరకెక్కిన ఒక సినిమా, మళ్లీ పాత రోజులు గుర్తుకు తెచ్చింది. కూతురు, అల్లుడి మధ్య అత్త అడ్డంగా ఉంటుంది. చిన్నపాటి గోడవలతో కోర్ట్ వరకూ వెళ్లాల్సి వస్తుంది. అయితే ఈ మలయాళం మూవీ కామెడీతో సరదాగా సాగిపోతుంది. ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? అనే వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ మలయాళం కామెడీ మూవీ పేరు ‘మచంటే మాలాఖా’ (Machante Maalakha). 2025 లో విడుదలైన ఈ మూవీకి బోబన్ శామ్యూల్ దర్శకత్వం వహించారు. దీనిని అజీష్ పి. థామస్ రచించగా, అబామ్ మూవీస్ బ్యానర్‌పై అబ్రహం మాథ్యూ నిర్మించారు. ఇందులో సౌబిన్ షాహిర్, ధ్యాన్ శ్రీనివాసన్, నమిత ప్రమోద్, దిలీష్ పోతన్ ప్రధాన పాత్రలు పోషించారు.ఈ స్టోరీ సజీవన్ అనే KSRTC బస్సు కండక్టర్ చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video), మనోరమ మాక్స్ (Manorama MAX) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
సజీవన్ KSRTC బస్సు కండక్టర్ గా ఉద్యోగం చేస్తుంటాడు. ఇతను అందరితో స్నేహపూర్వకంగా ఉండే వ్యక్తి. అయితే అతను తన జీవిత భాగస్వామిని సాంప్రదాయిక మార్గంలో వెతుకుతుంటాడు. కానీ అతని ప్రయత్నాలు అంతగా ఫలించవు. అతని బస్సులో తరచూ ప్రయాణించే బిజిమోల్ అనే అమ్మాయితో సజీవన్ ఒక సారి గొడవ పడతాడు. ఆ తర్వాత వారి మధ్య ప్రేమ మొదలవుతుంది. మొదట్లో వారి సంబంధం చిన్న చిన్న గొడవలతో నిండి ఉంటుంది. కానీ కాలక్రమేణా సజీవన్ ఆమెపై ప్రేమను పెంచుకుంటాడు. కొంత కాలంలోనే వారు వివాహం కూడా చేసుకుంటారు. అయితే, వివాహం తర్వాత వారి జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. బిజిమోల్, తల్లి కుంజిమోల్ అతని జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఆమె అతనిపై కఠినమైన వైఖరిని ప్రదర్శిస్తుంది.
బిజిమోల్ కూడా తన తల్లిని ఏమీ అనకుండా సైలెంట్ గా ఉంటుంది. ఆమె ప్రవర్తన సజీవన్‌ను ఇబ్బంది పెడుతుంది. ఇందులో సజీవన్ కు అతని మామ సప్పోర్ట్ గా ఉంటాడు. అయితే వీళ్ళ గొడవలు, చిలికి చిలికి కోర్టు వరకు చేరుతాయి. ఇక్కడ భార్య, భర్తలు ఇద్దరూ విడాకుల కోసం దాఖలు చేస్తారు. ఈ సంఘటనల మధ్య, సజీవన్ తన భార్య లోపాలను అర్థం చేసుకుని, ఆమెను అర్థం చేసుకోవడం మొదలు పెడతాడు. ఆ తరువాత ఒక ఊహించని సంఘటన జరుగుతుంది. సజీవన్ అత్త కుంజిమోల్ బావిలో పడి చనిపోతుంది. ఆ తరువాత సజీవన్, బిజిమోల్ సయోధ్యకు వస్తారు. వీరికి ఒక కుమార్తె పుడుతుంది. ఆమె కూడా అత్త లాగా దూకుడుగా ఉంటుందని చూపిస్తూ సినిమాకి శుభం కార్డ్ పడుతుంది.
Read Also : ప్రియురాలి ఇంటికే పనోడిగా వెళ్ళే ప్రియుడు .. పొట్ట చెక్కలయ్యే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్