BigTV English
Advertisement

OTT Movie : ఒకరితో ప్రేమ, మరొకరితో పెళ్లి… ఇద్దరి మధ్య నలిగే అమ్మాయి… దిమ్మ తిరిగే క్లైమాక్స్ ను డోంట్ మిస్

OTT Movie : ఒకరితో ప్రేమ, మరొకరితో పెళ్లి… ఇద్దరి మధ్య నలిగే అమ్మాయి… దిమ్మ తిరిగే క్లైమాక్స్ ను డోంట్ మిస్

OTT Movie : లవ్ స్టోరీలతో ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే కొన్ని లవ్ స్టోరీలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. రియాలిటీ కి దగ్గరగా ఉండే ఇటువంటి లవ్ స్టోరీలను ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తారు. ఇప్పుడు మనం చెప్పుకునే మూవీలో హీరో కవితలు పాడుతూ ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ కి వేరొకరితో పెళ్లి అవుతుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


యూట్యూబ్ (Youtube) లో

ఈ బెంగాలీ మూవీ పేరు ‘జరా బ్రిష్టితే భిజేచ్చిలో’ (Jara bristite bhijechhilo). జాయ్ గోస్వామి రచించిన ‘జరా బ్రిష్టితే భిజేచ్చిలో’ ఆధారంగా 2007లో విడుదలైన ఈ బెంగాలీ మూవీకి అంజన్ దాస్ దర్శకత్వం వహించారు. ఇంద్రాణి హల్దర్, అంజన బసు, సుదీప్ ముఖర్జీ, అలోకానంద రాయ్, జాయ్ సేన్‌గుప్తా ఇందులో నటించారు. ఈ మూవీలో ఇంద్రాణి హల్దార్ తన పాత్రకు మాడ్రిడ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటి అవార్డును అందుకుంది. ఆమె పదేపదే వైవాహిక అత్యాచారానికి గురైన తర్వాత, ప్రేమికుడితో తన జీవితాన్ని గడపే స్త్రీగా నటించింది. ఈ మూవీ యూట్యూబ్ (Youtube) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

అరాని ఒక స్కూల్లో చిన్న టీచర్ ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. కవితలు రాయడంలో అరానికి మంచి ప్రావీణ్యం ఉంటుంది. అదే ఊరిలో రాధ అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. తనని ప్రతిరోజు చూస్తూ ఒక కవిత చెప్తూ ఉంటాడు. రాధ కూడా అతని ప్రయత్నానికి పడిపోతుంది. వీళ్ళిద్దరూ మాటలు కలుపుతూ ముందుకు వెళ్తారు. అయితే ఎక్కడా ఒకరిని ఒకరు ప్రేమిస్తున్నానని చెప్పుకోరు. ఒకరోజు రాధకి ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధం చూస్తారు. అతడు బాగా డబ్బున్న వ్యక్తి. అయితే ఈ విషయం రాధ, అరానికి  చెప్తుంది. అరాని దగ్గర ఒక పూట తిండి పెట్టడానికి కూడా డబ్బులు లేకపోవడంతో ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోతాడు. ఆ తర్వాత రాధకి పెళ్లి జరిగిపోతుంది. అయితే రాధ భర్త సంతోష్ చాలా శాడిజం ఉన్న వ్యక్తి. రాధ జీవితంలో సంతోషం లేకుండా చేస్తాడు. ప్రతిరోజు కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే ఆమెను పిలుస్తాడు. ఆ తర్వాత ఆమెతో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటాడు. అతని శాడిజం తట్టుకోలేక చాలా బాధపడుతూ ఉంటుంది.

చాలా రోజులు గడిచినా పిల్లలు కూడా పుట్టకపోవడంతో మరింత బాధపడుతుంది. పిల్లలు పుట్టక పోవడానికి కారణం రాధ అనుకుని అత్తగారు కూడా తనని వేధిస్తుంది. చివరికి డాక్టర్ రిపోర్ట్స్ చూస్తే భర్తలోనే లోపం ఉందని తెలుసుకుంటుంది. ఇక అప్పటినుంచి భర్తని వదిలి వెళ్ళిపోవాలనుకుంటుంది. ఈ క్రమంలోని భర్తతో బ్రతకలేనని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఊరికి వెళ్ళాక ప్రియుడిని చూసి చలించిపోతుంది. అతడు తాగుతూ చాలా దిగాలుగా ఉంటాడు. అరాని అలా ఉండటానికి కారణం తెలుసుకుని రాధ షాక్ అవుతుంది. చివరికి రాధ ఎవరితో కలిసి బ్రతుకుతుంది? అరానికి వచ్చిన కష్టం ఏమిటి? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ‘జరా బ్రిష్టితే భిజేచ్చిలో’ (Jara bristite bhijechhilo) అనే ఈ మూవీని చూడండి.

Tags

Related News

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

OTT Movie : రాకుమారిని వెంటాడే నాగ బంధనం… ఆత్మను ప్రేమించే నరుడు… ఓటీటీలో సరికొత్త థ్రిల్లర్

OTT Movie : భర్త ఉండగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో… మన తెలుగు సినిమానే కాపీ కొట్టారు మావా

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా

OTT Movie : పక్షవాతం వచ్చినోడితో ప్రేమాయణం… గుండెను పిండేసే ప్రేమకథ… లవర్స్ డోంట్ మిస్

OTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథ

Big Stories

×