E-Paper
Advertisement

చనిపోయిన అమ్మాయి నుంచి వాయిస్ మెసేజ్… అసలు కథ తెలిస్తే దిమ్మతిరుగుతుంది మావా

చనిపోయిన అమ్మాయి నుంచి వాయిస్ మెసేజ్… అసలు కథ తెలిస్తే దిమ్మతిరుగుతుంది మావా
Advertisement

Crime Thriller on OTT: ఒకే వారంలో నాలుగు హత్యలు… మరోవైపు ఆత్మహత్య చేసుకున్న ఓ కాలేజీ అమ్మాయి. ఆ అమ్మాయిపై అత్యాచారం జరిగిందని నిరూపించి, ఒక వ్యక్తికి ఉరిశిక్ష పడేలా చేసిన లాయర్‌ను సమాజం హీరోగా చూస్తుంది. కానీ ఉరిశిక్ష అమలుకు ఒక్కరోజు ముందు ఆ నిందితుడు చెప్పిన ఒక్క మాటతో… ఆ లాయర్‌కు ఇన్నాళ్లుగా తాను నమ్మిన కథ మొత్తం అబద్ధమేమో అనే అనుమానం వస్తుంది. ఇంతలో చనిపోయిన ఆ అమ్మాయి మొబైల్ నంబర్ నుంచి అతని ఫోన్‌కు ఓ వాయిస్ మెసేజ్ వస్తే ? ఫోరెన్సిక్ పరీక్షలో అది నిజంగానే ఆమె గొంతు అని తేలితే ? చనిపోయిన అమ్మాయి ఎలా మెసేజ్ చేసింది ? ఆమె ఆత్మహత్యకు, వరుస హత్యలకు ఉన్న సంబంధం ఏంటి ? కోర్టు కూడా నమ్మిన కేసు వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు ? ఈ ప్రశ్నల చుట్టూ సాగే మైండ్ బ్లోయింగ్ క్రైమ్ థ్రిల్లర్ ‘డార్క్ ఫేస్’ (Dark Face). మరి ఈ తమిళ సినిమాను ఎక్కడ చూడవచ్చు? తెలుగులో ఉందా? ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

 

Advertisement

చెన్నై నగరంలో ఒకే వారంలో వరుసగా నాలుగు దారుణ హత్యలు జరుగుతాయి. ఈ కేసులను పోలీసులు సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు మొదలు పెడతారు. హత్యలకు సంబంధించిన ఆధారాలను పరిశీలిస్తున్న సమయంలో, కొంతకాలం క్రితం ఆత్మహత్య చేసుకున్న శరణ్య అనే కాలేజీ విద్యార్థినికి సంబంధించిన ఓ కేసు తెరపైకి వస్తుంది. శరణ్యపై అత్యాచారం జరిగిందని నిరూపించి, ఆ కేసులో నిందితుడికి ఉరిశిక్ష పడేలా చేసిన ఒక శక్తివంతమైన లాయర్ ఈ కేసులో కీలకంగా ఉంటాడు.

సమాజం దృష్టిలో ఆ లాయర్ ఒక హీరో. ఒక అమ్మాయికి న్యాయం చేయడానికి పోరాడి, నిందితుడికి కఠినమైన శిక్ష పడేలా చేశాడనే పేరు అతనికి వస్తుంది. కానీ ఉరిశిక్ష అమలు కావడానికి ఒక్కరోజు ముందు ఆ నిందితుడు లాయర్‌ను కలవాలని చివరి కోరిక కోరతాడు. ఆ భేటీలో అతను చెప్పిన కొన్ని విషయాలు లాయర్‌ను పూర్తిగా షాక్‌కు గురిచేస్తాయి. తాను నిర్దోషినని, కేసులో అసలు నిజాలు వేరే ఉన్నాయని అతను చెప్పడంతో లాయర్‌కు అనుమానం మొదలవుతుంది.

Advertisement

ఇన్నాళ్లూ తాను నమ్మిన ఆధారాలు, సాక్ష్యాలు నిజమేనా ? కోర్టులో తన వాదనల ద్వారా ఒక నిర్దోషికి శిక్ష పడేలా చేశానా ? అనే ప్రశ్నలు అతన్ని వెంటాడుతాయి. దీంతో అధికారికంగా కేసు ముగిసిపోయినప్పటికీ, లాయర్ వ్యక్తిగతంగా దర్యాప్తు మొదలుపెడతాడు. అప్పుడే కథలో అసలు ట్విస్ట్ వస్తుంది. అతని ఫోన్‌కు ఊహించని విధంగా శరణ్య మొబైల్ నంబర్ నుంచి ఓ వాయిస్ మెసేజ్ వస్తుంది. చనిపోయిన వ్యక్తి ఫోన్ నుంచి మెసేజ్ రావడం అసాధ్యమని భావించిన లాయర్, ఆ వాయిస్‌ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపిస్తాడు. అక్కడ వచ్చిన రిపోర్ట్ అతన్ని మరింత భయపెడుతుంది. ఆ వాయిస్ నిజంగానే శరణ్యదేనని తేలుతుంది.

అయితే చనిపోయిన శరణ్య గొంతు నుంచి ఆ మెసేజ్ ఎలా వచ్చింది? ఆమె ఆత్మహత్య వెనుక అసలు నిజం ఏంటి? ఆమె కేసులో కోర్టును తప్పుదోవ పట్టించిన వాళ్లు ఎవరు? అదే సమయంలో చెన్నైలో జరుగుతున్న నాలుగు వరుస హత్యలకు ఈ కేసుతో ఏ సంబంధం ఉంది? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్న కొద్దీ లాయర్ మరింత ప్రమాదకరమైన కుట్రలోకి వెళ్లిపోతాడు. చివరకు చట్టాన్ని, సాక్ష్యాలను, కోర్టు వ్యవస్థను కూడా తమకు అనుకూలంగా మార్చుకున్న అసలు వ్యక్తి ఎవరో బయటపడే సమయంలో కథ మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది. తాను న్యాయం చేశానని భావించిన లాయర్… నిజానికి ఓ పెద్ద కుట్రలో భాగమయ్యాడా? శరణ్యకు నిజంగా ఏం జరిగింది? నాలుగు హత్యల వెనుక ఉన్న రహస్యం ఏంటి? అనేదే క్లైమాక్స్‌లో అసలు సస్పెన్స్.

స్ట్రీమింగ్ ఎక్కడ ?

శరణ్ ప్రకాష్, అబు కరీమ్ ఇస్మాయిల్, వై.జి. మహేంద్రన్, వై.జి. మధువంతి తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ లీగల్ సస్పెన్స్ థ్రిల్లర్ సుమారు 2 గంటల 28 నిమిషాల నిడివితో సాగుతుంది. ఈ సినిమాను Simply Southలో, అలాగే Amazon Prime Videoలో చూడవచ్చు. ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్, కోర్టు రూమ్ డ్రామా, లీగల్ మైండ్ గేమ్స్, వరుస హత్యల మిస్టరీ కలగలిసిన ఈ సినిమా సాధారణ క్రైమ్ థ్రిల్లర్స్‌ కంటే డిఫరెంట్ గా ఉంటుంది. మొదటి నుంచి చివరి వరకు అసలు నేరస్థుడు ఎవరు అనే సస్పెన్స్ చివరి వరకూ కొనసాగుతుంది. అయితే ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో లేదు.

Read Also: పుతిన్ వెనుక ఉన్న ఆ మాంత్రికుడు ఇతనేనా ? రష్యా పవర్ గేమ్ వెనకున్న మాస్టర్ మైండ్ కథ

Related News

30 ఏళ్ల క్రితం మాయమైన పడవ రిటర్న్… దానితో పాటు వచ్చే టైమ్ ట్రావెల్ మిస్టరీ… చివరికి ఊహించని ట్విస్ట్

రూ. 1185 కోట్ల కలెక్షన్స్… తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న రాబిన్ హుడ్ చివరి కథ

కూతురి స్విమ్మింగ్ కోచ్ పై తల్లికి అలాంటి కోరిక… చివరికి ఏం జరిగిందో చూస్తే బుర్రపాడు

30 ఏళ్లుగా దాచుకున్న రహస్యం… పెళ్లిలో అన్నదమ్ముల అరాచకం… ఈ సైకలాజికల్ థ్రిల్లర్ చూస్తే మైండ్ బ్లాంక్

గోడ వెనుక దొరికిన వింత వస్తువు తెచ్చిన అనర్థం… భర్త కళ్లు పచ్చగా… శరీరం నుంచి నల్లటి ద్రవం… భార్య ఏం చేసిందంటే ?

తల్లిదండ్రుల ప్రేమకథ వెనుక ఎయిడ్స్ విషాదం… ఈ అమ్మాయి తెలుసుకున్న నిజం కదిలిస్తుంది మావా

అమ్మకు క్యాన్సర్… కూతురికి ఆటిజం… కానీ ఈ అమ్మాయి చేసిన పని చూస్తే గర్వపడతారు భయ్యా

కొండ ఎక్కమంటే ఏడ్చేశారు… చివరికి ఈ సెలబ్రిటీలు చేసిన పని చూస్తే నవ్వాగదు

Big Stories

Advertisement
×