E-Paper
Advertisement

పుతిన్ వెనుక ఉన్న ఆ మాంత్రికుడు ఇతనేనా ? రష్యా పవర్ గేమ్ వెనకున్న మాస్టర్ మైండ్ కథ

పుతిన్ వెనుక ఉన్న ఆ మాంత్రికుడు ఇతనేనా ? రష్యా పవర్ గేమ్ వెనకున్న మాస్టర్ మైండ్ కథ
Advertisement

Political Drama on OTT:  ఒకప్పుడు రష్యా రాజకీయాల్లో ఓ కళాకారుడు… ఆ తర్వాత రియాలిటీ టీవీ ప్రొడ్యూసర్. కానీ అతని అసలు ఆట మాత్రం కెమెరాల ముందు కాదు… అధికార కేంద్రాల వెనుక. ప్రజల ఆలోచనలను, మీడియాను తనకు అనుకూలంగా మలచగలిగిన ఆ వ్యక్తి… చివరకు రష్యా అధ్యక్షుడిగా ఎదగబోతున్న ఓ మాజీ కేజీబీ అధికారికి అత్యంత కీలకమైన రాజకీయ వ్యూహకర్తగా మారితే ? తెరపై కనిపించేది ఒక నాయకుడు… కానీ ఆ నాయకుడి వెనుక అసలు చక్రం తిప్పేది ఎవరు ? అధికారం కోసం మొదలైన ఈ ఆట చివరకు అతన్నే ఎందుకు భయపెట్టింది ? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పే పొలిటికల్ డ్రామా ‘ది విజార్డ్ ఆఫ్ ది క్రెమ్లిన్’ (The Wizard of the Kremlin). మరి ఈ సినిమాను ఏ ఓటీటీలో చూడవచ్చు? తెలుగులో ఉందా? అసలు కథేంటి? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

1990ల నాటి రష్యా. సోవియట్ యూనియన్ పతనం తర్వాత దేశం రాజకీయంగా, ఆర్థికంగా తీవ్ర గందరగోళంలో ఉంటుంది. పాత వ్యవస్థ కూలిపోయింది. కొత్త వ్యవస్థ ఇంకా పూర్తిగా రూపుదిద్దుకోలేదు. ఈ పరిస్థితుల్లో రష్యా భవిష్యత్తు ఎవరి చేతుల్లోకి వెళ్తుంది? దేశాన్ని ఎవరు నడిపిస్తారు? అనే ప్రశ్నలు అధికార వర్గాల్లో మొదలవుతాయి. ఇదే సమయంలో వాడిమ్ బరనోవ్ అనే యువకుడు తనదైన ప్రపంచంలో జీవిస్తుంటాడు. మొదట కళాకారుడిగా పనిచేసిన అతను… ఆ తర్వాత రియాలిటీ టీవీ ప్రొడ్యూసర్‌గా మారతాడు. ప్రజలకు ఏం చూపించాలి? ఏ విషయాన్ని నమ్మేలా చేయాలి? ఒక వ్యక్తి ఇమేజ్‌ను ఎలా మార్చాలి? అనే విషయాల్లో బరనోవ్‌కు మంచి పట్టు ఉంటుంది. కానీ అతని ప్రతిభ కేవలం వినోద రంగానికే పరిమితం కాదు.

Advertisement

రష్యా రాజకీయాల్లో కొత్త శక్తులు ఎదుగుతున్న సమయంలో బరనోవ్‌కు మాజీ కేజీబీ అధికారి వ్లాదిమిర్ పుతిన్ పరిచయం అవుతాడు. అప్పటికి పుతిన్ ఇంకా దేశ అత్యున్నత అధికారాన్ని అందుకోలేదు. కానీ అతనిలో ఉన్న పట్టుదల, అధికారాన్ని సాధించాలనే ఆలోచన బరనోవ్‌ను ఆకట్టుకుంటాయి. అక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. బరనోవ్ పుతిన్‌కు రాజకీయ వ్యూహకర్తగా మారతాడు. ప్రజల్లో అతని ఇమేజ్‌ను ఎలా నిర్మించాలి? మీడియాను ఎలా ఉపయోగించాలి? ప్రత్యర్థుల కంటే ముందుండేందుకు ఎలాంటి రాజకీయ కథనాలను సృష్టించాలి? అనే విషయాల్లో తెరవెనుక ఉండి వ్యూహాలు రచిస్తాడు. ఒక సాధారణ రాజకీయ నాయకుడిని… శక్తివంతమైన నాయకుడిగా ప్రజల ముందు నిలబెట్టే ప్రయత్నం మొదలవుతుంది.

బరనోవ్‌కు ఆయుధాలు అవసరం లేదు. పెద్ద సభల్లో ప్రసంగాలు చేయాల్సిన అవసరం లేదు. అతని చేతిలో ఉన్న అసలు ఆయుధం మీడియా. ప్రజలు ఏం చూడాలి? ఏం నమ్మాలి? ఒక నాయకుడిని ఎలా చూడాలి? అనే విషయాలను ప్రభావితం చేయగలిగే శక్తి అతని చేతుల్లోకి వస్తుంది. కాలం గడిచేకొద్దీ పుతిన్ అధికారంలో మరింత బలపడతాడు. అదే సమయంలో బరనోవ్ పేరు కూడా క్రెమ్లిన్ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. తెరపై కనిపించే నాయకుడి వెనుక ఉండి రాజకీయాలను నడిపించే వ్యక్తిగా అతనికి “విజార్డ్ ఆఫ్ ది క్రెమ్లిన్” అనే పేరు వస్తుంది. కానీ అధికారం పెరిగే కొద్దీ… ఆ ఆట కూడా మరింత ప్రమాదకరంగా మారుతుంది.

Advertisement

బరనోవ్ ఒకప్పుడు రాజకీయ వ్యూహంగా భావించిన విషయాలు ఇప్పుడు నిజ జీవితంలో హింసగా మారుతున్నాయని అతనికి అర్థమవుతుంది. అధికారాన్ని కాపాడుకోవడానికి ప్రత్యర్థులను అణచివేయడం, కుట్రలు, అవినీతి, భయపెట్టే రాజకీయ పద్ధతులు పెరుగుతుంటాయి. తాను రూపొందించడంలో భాగమైన వ్యవస్థ తన నియంత్రణను దాటి మరింత క్రూరంగా మారుతుంది. ఇదే సమయంలో క్షేనియా అతని జీవితంలో కీలకమైన వ్యక్తిగా నిలుస్తుంది. అధికార మాయలో పూర్తిగా చిక్కుకుపోయిన బరనోవ్‌కు… బయట నుంచి ఆ ప్రపంచాన్ని చూసే వ్యక్తిగా ఆమె నిజాన్ని గుర్తు చేస్తుంది. రాజకీయ ఆట నుంచి బయటకు రావాలని అతన్ని హెచ్చరిస్తుంది. కానీ అప్పటికే బరనోవ్ చాలా లోతుగా ఆ వ్యవస్థలోకి వెళ్లిపోయి ఉంటాడు.

ఒకప్పుడు అధికారాన్ని నిర్మించడంలో తన తెలివితేటలను ఉపయోగించిన అతనే… ఇప్పుడు అదే అధికార వ్యవస్థకు భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. తాను సృష్టించడంలో సహాయపడిన రాజకీయ యంత్రాంగం ఎటువైపు వెళ్తుందో అతనికి అర్థమవుతుంది. చివరకు క్రెమ్లిన్‌లోని అంతర్గత కుట్రలు, అధికార పోరాటాలు, ప్రమాదకరమైన రాజకీయ పరిస్థితుల నుంచి తప్పించుకోవాలని నిర్ణయించుకుంటాడు. బరనోవ్ రహస్యంగా రాజకీయాలకు దూరమై అజ్ఞాతంలోకి వెళ్లిపోతాడు. కానీ కథ అక్కడితో ముగియదు. చాలా సంవత్సరాల తర్వాత ఓ అమెరికన్ జర్నలిస్ట్‌కు తన గతం గురించి, రష్యా అధికార వ్యవస్థ వెనుక తాను చూసిన విషయాల గురించి చెప్పడం మొదలుపెడతాడు.

తాను ఒక రాజకీయ నాయకుడిని అధికారంలోకి తీసుకురావడానికి ఉపయోగించిన వ్యూహాలు… చివరకు ఒక భారీ రాజకీయ వ్యవస్థగా ఎలా మారాయి? ఆ వ్యవస్థలో తన పాత్ర ఎంత? తాను సృష్టించిన అధికార ప్రపంచం నుంచి బయటపడటానికి ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? అనే ప్రశ్నలకు సమాధానంగా ఈ సినిమా ముగుస్తుంది.

స్ట్రీమింగ్ ఎక్కడ ?

రాజకీయాలు, అధికారం, మీడియా మానిప్యులేషన్, తెరవెనుక జరిగే కుట్రలను కలిపి తెరకెక్కించిన ‘ది విజార్డ్ ఆఫ్ ది క్రెమ్లిన్’లో జూడ్ లా, పాల్ డానో, అలీసియా వికాండర్, జెఫ్రీ రైట్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఒలివర్ అస్సాయాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, గియులియానో డా ఎంపోలి రాసిన అదే పేరుతో ఉన్న నవల ఆధారంగా రూపొందింది. ప్రస్తుతం ఈ సినిమా హులు (Hulu) ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉంది. కొన్ని ప్రాంతాల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతం తెలుగు డబ్బింగ్ మాత్రం అందుబాటులో లేదు. ఓ నాయకుడి బయోపిక్‌లా కాకుండా… ఆ నాయకుడి వెనుక ఉండే రాజకీయ వ్యూహకర్త కోణంలో కథను చెప్పడం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. ప్రపంచంలో ఎదురులేని నాయకుడిగా ఎదిగిన పుతిన్ వెనకున్న మాస్టర్ మైండ్ గురించి తెలుసుకోవాలంటే ఈ సినిమాను డోంట్ మిస్.

Read Also: జైలు నుంచి క్రైమ్ సామ్రాజ్యం… చెల్లెలికి మైండ్ బ్లాక్ చేసే ట్విస్ట్… క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

Tags

Related News

దర్జీ చెప్పిన ఒక్క అబద్ధం… రెండు దేశాలను యుద్ధానికి దించిందంటే నమ్ముతారా భయ్యా ?

గర్ల్ ఫ్రెండ్ తో బెస్ట్ ఫ్రెండ్ ప్రేమను చెడగొట్టాలని చూశాడు… చివరికి అతనే బుక్కయ్యాడు

ప్రశాంతంగా ఉందని ఈ ఊరికి వచ్చాడు… లోపల గుట్టు తెలిస్తే షాకే భయ్యా

అడవిలో వీకెండ్‌కి వెళ్లిన అమ్మాయి… తెల్లారేసరికి వ్యాన్‌లో బందీ… ఇదెక్కడి ట్విస్ట్ రా బాబూ

తల్లి మరణంతో ఊరు మారిన అమ్మాయి… ఆడపిల్లల వల్ల ఇంత పెద్ద సమస్యా ? అసలు గుట్టేంటి ?

ఒక్క ఫోన్ కాల్‌తో కుటుంబం మొత్తం రోడ్డున… అమ్మాయి రంగంలోకి దిగాక రచ్చ రచ్చ

ప్రాణాలు కాపాడిన డాక్టర్‌పైనే పిచ్చి… పెళ్ళాం ఉన్నా వదలకుండా ఇదేం అరాచకం భయ్యా

Big Stories

Advertisement
×