E-Paper
Advertisement

కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్‌ను.. రోకలిబండతో కొట్టి చంపిన భార్య!

కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్‌ను.. రోకలిబండతో కొట్టి చంపిన భార్య!
Advertisement

Husnabad Murder: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని హనుమాన్‌నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ నెలాఖరులో ఉద్యోగ విరమణ చేసి ప్రశాంతంగా గడపాల్సిన కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ (CTO) కోటి వెంకటేశ్వర్లు (61) భార్య చేతిలో హత్యకు గురయ్యారు.

ట్యాక్స్ ఆఫీసర్‌..

వెంకటేశ్వర్లు కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఆయన మొదటి భార్య రాజమణి హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏఎన్‌ఎంగా విధులు నిర్వహిస్తున్నారు. రిటైర్మెంట్ నామినీలో రెండో భార్య పేరు ఉండటంపై మొదటి భార్యకు కోపం రావడంతో పాటు ఆస్తి పంపకాల విషయంలో కొంతకాలంగా విభేదాలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement

Also Read: మంత్రి ప‌ద‌వి ఇచ్చేదాకా ఇదే తీరు..! ఇవ్వ‌డానికి చాన్సు లేదు.. కోమ‌టిరెడ్డి మారేదీ లేదూ!

ఇద్దరి మధ్య వాగ్వాదం..

ఆదివారం సాయంత్రం ఇంట్లో మరోసారి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆవేశానికి గురైన రాజమణి ఇంట్లోని రోకలిబండతో వెంకటేశ్వర్లు వెనుక భాగంలో బలంగా కొట్టినట్లు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఆయన కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.

కేసు నమోదు..

Advertisement

సమాచారం అందుకున్న హుస్నాబాద్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించి మొదటి భార్య రాజమణితో పాటు ఆమె కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

Also Read: పెళ్లి కాగానే.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు.. కొత్త జర్నీ ఇక్కడి నుంచే!

Tags

Related News

టిమ్స్ క్రెడిట్ కేటీఆర్‌దా? ఎర్రగడ్డలో షాకిస్తే సెట్ అవుతుంది.. సీఎం రేవంత్ సెటైర్లు

చీరతో భర్తను కట్టేసి.. కర్రతో తలపై బాది.. హైదరాబాద్‌లో భార్య ఘాతుకం!

ట్రైనీ ఐపీఎస్‌కు బిగ్ షాక్.. పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు సంచలన ఉత్తర్వులు!

సనత్ నగర్ TIMS ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

సిద్దిపేటలో షాకింగ్ క్రైమ్.. డబ్బు కోసం కొడుకును క్రిమినల్‌గా మార్చిన తల్లి

22A భూ బాధితులకు.. క్షమాపణలు చెప్పిన మంత్రి పొంగులేటి!

మేడ్చల్‌లో బీఆర్‌ఎస్ హల్చల్.. చెక్కుల కోసం భారీగా ధర్నా!

Big Stories

Advertisement
×