BigTV English

OTT Movie : దయ్యాలను దబిడి దిబిడి చేస్తున్న కుర్రాళ్ళు… స్పైన్ చిల్లింగ్ హారర్ థ్రిల్లర్

OTT Movie : దయ్యాలను దబిడి దిబిడి చేస్తున్న కుర్రాళ్ళు… స్పైన్ చిల్లింగ్ హారర్ థ్రిల్లర్

OTT Movie : ఫాంటసీ సినిమాలు మూవీ లవర్స్ ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. వీటికి హారర్ కంటెంట్ ని జోడిస్తే ఆ సినిమా మరో లెవల్ లో ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో హాల్విన్ ఫెస్టివల్ ఒక టౌన్ లో జరుగుతుంది. ఆ సమయంలో వచ్చే దయ్యాన్ని ఆ ఊరు కుర్రాళ్ళు చంపుతూ ఉంటారు. ఈ డిఫరెంట్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ ఫాంటసీ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘డార్క్ హార్వెస్ట్‘ (Dark harvest). 2023 లో వచ్చిన ఈ మూవీకి డేవిడ్ స్లేడ్ దర్శకత్వం వహించాడు. ఇది నార్మన్ పార్ట్రిడ్జ్ రాసిన నవల ఆధారంగా రూపొందించబడింది. ఇందులో కేసీ లైక్స్, ఇమిరి క్రచ్‌ఫీల్డ్, డస్టిన్ సీతామెర్, ఎలిజబెత్ రీజర్ మరియు జెరెమీ డేవిస్ నటించారు. ఈ ఫాంటసీ హారర్ థ్రిల్లర్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీలోకి వెళితే 

సిటీకి దూరంగా ఉండే ఒక చిన్న పట్టణంలో హాల్విన్ ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది. అక్కడికి వచ్చిన దయ్యం ఒక చర్చిలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. ఆ ఊరిలో కొంతమంది కుర్రాళ్ళు ఆ దెయ్యాన్ని రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు. చర్చిలోకి దయ్యం వస్తే ఆ ఊరు అంతా మంటల్లో కాలిపోతుంది. ఇంతలో జిమ్ ఆ దెయ్యాన్ని అడ్డుకుని చంపేస్తాడు. అలా దెయ్యాన్ని చంపిన తర్వాత ఆ వ్యక్తికి బాగా డబ్బులు ఇస్తారు. సంవత్సరం వరకు ఆ దయ్యం ఏ హాని చేయదు. చంపిన వాళ్లు టౌన్ విడిచి వెళ్లొచ్చు. అయితే టౌన్ లో నివసించే వాళ్ళు ఎవరూ బయటికి వెళ్లే అవకాశం ఉండదు. అలా జిమ్ దయ్యాన్ని చంపి, కారులో ఊరు వదిలి వెళ్తాడు. జిమ్ కి ఒక తమ్ముడు ఉంటాడు. అతడే ఈ కథలో హీరో. అన్నలాగా దయ్యాన్ని చంపి తను కూడా సిటీకి వెళ్లాలి అనుకుంటాడు. జిమ్ అన్నయ్య ఆ ఫెస్టివల్ లో గెలిచి డబ్బున్న వ్యక్తి అయ్యాడు. మిగతా కుర్రాళ్ళు కూడా ఈసారి మాకు అవకాశం కావాలని హీరోని తిట్టడం మొదలు పెడతారు. వీళ్లకు చెప్పేది అవసరం ఏంటని, హీరో తనకు తానుగా వెళ్ళిపోవాలనుకుంటాడు. అయితే పోలీస్ అతన్ని కొట్టి, ఇంటికి పంపిస్తాడు.

చివరగా ఆ పట్టణంలో హాల్విన్ ఫెస్టివల్ వస్తుంది. ఆ ఊరిలో ఉన్న కుర్రాళ్ళు అందరూ దయ్యాన్ని చంపడానికి పోటీ పడతారు. హీరో తన గర్ల్ ఫ్రెండ్ తో కలసి ఆ దయ్యాన్ని చంపాలనుకుంటాడు. ఆ దయ్యం కొంతమంది కురాళ్ళను కూడా చంపేస్తుంది. హీరో దగ్గరికి దయ్యం వస్తుంది గాని, అతనిని ఏమీ చేయకుండా వెళ్ళిపోతుంది. దయ్యం వేసుకున్న బెల్ట్, తన అన్నయ్య వేసుకున్న బెల్టు ఒక్కటే అని తెలుసుకుంటాడు హీరో. చివరికి హీరో అక్కడ జరుగుతున్న రహస్యాలను వెలుగులోకి తేవాలనుకుంటాడు. ఈ క్రమంలో హీరోకి దిమ్మతిరిగే విషయాలు తెలుస్తాయి. చివరికి ఆ దయ్యాన్ని హీరో చంపుతాడా? తన అన్నయ్య ఏమయ్యాడో తెలుసుకుంటాడా ? ఆ ఊర్లోకి ప్రతి సంవత్సరం దయ్యం ఎందుకు వస్తూ ఉంటుంది? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

Sundarakanda OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన నారా రోహిత్‌ ‘సుందరకాండ’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

OTT Movie : పెంచిన పెదనాన్న ఇంటిని తగలబెట్టే లేడీ కిలాడీ… అమ్మాయి కాదు మావా ఆడపులి… పిచ్చెక్కించే ట్విస్టులు

OTT Movie : మరో వ్యక్తితో భర్త దగ్గర అడ్డంగా దొరికిపోయే భార్య… అతనిచ్చే ట్విస్టుకు దిమాక్ కరాబ్ మావా

OTT Movie : కంటికి కన్పించిన అమ్మాయిని వదలకుండా అదే పాడు పని… ఈ సైకో ఇంత కరువులో ఉన్నాడేంటి భయ్యా ?

OTT Movie : పెళ్ళైన ట్యూషన్ టీచర్ పై ప్రేమ… సీక్రెట్ లెటర్ తో బండారం బట్టబయలు… IMDbలో 7.5 రేటింగ్

OTT Movie : తవ్వకాల్లో బయటపడే శవపేటిక… దుష్ట శక్తి విడుదలవ్వడంతో దబిడి దిబిడి… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు డోంట్ వాచ్

OTT Movie : బాబోయ్ చావడానికెళ్లి ఇలా బుక్కయ్యాడేంటి… 12 జన్మలు, 12 సార్లు చావు… కల్లో కూడా చావు గురించి ఆలోచించరు

OTT Movie : బీచ్ ఒడ్డున బట్టల్లేకుండా… రెండేళ్ల పాటు రెస్ట్ లేకుండా… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

Big Stories

×