E-Paper
Advertisement

అమెజాన్ ప్రైమ్‌లో ‘డార్క్ సీక్రెట్స్’ హవా.. ఏకంగా నంబర్ 1 ప్లేస్‌లో!

అమెజాన్ ప్రైమ్‌లో ‘డార్క్ సీక్రెట్స్’ హవా.. ఏకంగా నంబర్ 1 ప్లేస్‌లో!
Advertisement

Dark Secrets OTT Success:ఓటీటీలు వచ్చిన తర్వాత చిన్న సినిమాలు కూడా చాలా మంది ప్రేక్షకులకు అలరిస్తున్నాయి.తాజాగా ‘డార్క్ సీక్రెట్స్’ సినిమా కూడా ఓటీటీలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.తెలుగులో తెరకెక్కిన ఈ ఆంథాలజీ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా “Top 10 Purchases in India” లిస్టులో నంబర్ 1 స్థానంలో నిలవడం విశేషం.పెద్ద హీరోలు, భారీ బడ్జెట్ సినిమాలతో పోటీ పడుతూ ఈ స్థాయికి చేరుకోవడం నిజంగా మెచ్చుకోతగ్గ విషయమే .

 కథ ఏంటి?

‘డార్క్ సీక్రెట్స్’ సినిమా విషయానికి వస్తే  ఇందులో ఒక కథ ఉండదు. వేర్వేరు కథలు ఉంటాయి. ప్రతి కథలో కొన్ని రహస్యాలు, కొన్ని సమస్యలు, కొన్ని భావోద్వేగాలు ఉంటాయి.మన చుట్టూ ఉన్న మనుషులు బయటికి కనిపించేది ఒకలా ఉంటారు. కానీ వాళ్ల వ్యక్తిగత జీవితాల్లో ఎవరికీ తెలియని విషయాలు ఉండొచ్చు. అలాంటి రహస్యాలు బయటికి వస్తే ఏం జరుగుతుంది? సంబంధాలు ఎలా మారతాయి? అనే అంశాలను ఈ సినిమాలో చూపించారు.ఒంటరితనం, ప్రేమ, సంబంధాలు, సామాజిక ఒత్తిడి, మనసులో దాచుకున్న విషయాలు వంటి అంశాలను కథల్లో చూపించే ప్రయత్నం చేశారు.

 ఓటీటీలో ఎందుకు క్లిక్ ?

Advertisement

థియేటర్లలో పెద్దగా ప్రమోషన్ లభించని కొన్ని సినిమాలు ఓటీటీలోకి వచ్చిన తర్వాత ప్రేక్షకులకు చేరుతున్నాయి. ‘డార్క్ సీక్రెట్స్’ కూడా ఇప్పుడు అదే విధంగా ప్రేక్షకుల దృష్టిలో పడుతోంది.ముఖ్యంగా సస్పెన్స్, డిఫరెంట్ కథలు ఇష్టపడే వాళ్లకు ఇలాంటి ఆంథాలజీ సినిమాలు ఆసక్తిగా అనిపిస్తాయి. ఒక కథ తర్వాత మరో కథ రావడంతో సినిమా ఎలా ముందుకు వెళ్తుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది.సోషల్ మీడియాలో కూడా సినిమా గురించి చర్చ జరగడం వల్ల మరింత మంది ఈ సినిమాను ఓటీటీలో వెతికి చూస్తున్నారని తెలుస్తుంది.

నటీనటులు ఎవరంటే

‘డార్క్ సీక్రెట్స్’ సినిమాకు అవినాష్ కొకటి దర్శకత్వం వహించారు.సినిమాలో అప్సర రాణి, జయశ్రీ, అజిత్ రాధారం, మోహిత్ రెహ్మానియాక్, అరుణ్ కుమార్ కొప్పుల, కృష్ణ నాగరం, నైనిక అనసూయ తదితరులు నటించగా టచ్‌వుడ్ టేల్స్ బ్యానర్‌పై అరుణ్ కుమార్ కొప్పుల, కృష్ణ నాగరం నిర్మించారు.

Advertisement

also read :సూర్య ఈజ్ బ్యాక్…రెండు రోజులకే రూ.100 కోట్లు!

 చిన్న సినిమాకు మంచి గుర్తింపు

పెద్ద స్టార్లు లేకపోయినా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారని ‘డార్క్ సీక్రెట్స్’ మరోసారి చూపిస్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో నంబర్ 1 స్థానానికి చేరుకోవడం ఈ సినిమాకు వచ్చిన మంచి గుర్తింపుగా చెప్పుకోవచ్చు.మొత్తానికి.. డిఫరెంట్ కథలు, రహస్యాలు, సస్పెన్స్ ఇష్టపడే వాళ్లకు ‘డార్క్ సీక్రెట్స్’ ఓటీటీలో ఒకసారి ట్రై చేయొచ్చు. థియేటర్ల కంటే ఓటీటీలో ఇప్పుడు ఈ సినిమాకు మంచి గుర్తింపు వస్తుండటం విశేషం.

Tags

Related News

ఆ ఊరిలో ప్రతి 10 ఏళ్లకో నరబలి… ఓటీటీలోకి అల్టిమేట్ డార్క్ థ్రిల్లర్… హనుమాన్ చాలీసాను పక్కన పెట్టుకుని చూడండి

లోకాన్ని నాశనం చేయాల్సిన విలన్ బాబు మిస్సింగ్… ఏంజెల్ డెమన్ల టెన్షన్ పీక్స్… మతిపోగొట్టే ఫ్యాంటసీ సిరీస్

తండ్రినే చంపాలని కూతురికి ఆర్డర్… మైండ్ బ్లాకింగ్ స్పై థ్రిల్లర్ సిరీస్

30 వేల ఏళ్లుగా నిద్రపోతున్న డెవిల్ ని గెలికింది… క్యూట్ ఫెయిరీ చేసిన పనికి వరల్డ్ కే వణుకు… ఈ ఫాంటసీ లవ్ కాంబో వేరే లెవెల్

కేస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి లవ్ డ్రామా… డాక్టర్ తో ఫైర్‌ఫైటర్ రొమాంటిక్ లవ్ ట్రాక్

లండన్‌లో వడాపావ్ బిజినెస్‌తో కోట్ల సంపాదన… కానీ ఆ ఒక్క సీక్రెట్ బయటపడితే అంతా షెడ్డుకే

18 ఏళ్ల శత్రుత్వం… బద్దశత్రువుల ఇంట్లో పుట్టి ప్రేమలో పడే జంట… క్రేజీ కొరియన్ రొమాంటిక్ సిరీస్

24 ఏళ్లకే ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్… షుమాకర్ లెజెండ్ గా మారిన గూస్‌బంప్స్ మూమెంట్

Big Stories

Advertisement
×