E-Paper
Advertisement

డీఎస్పీ భీంరెడ్డికి ఐటీ నోటీసులు.. రూ.200 కోట్ల బినామీ ఆస్తులు జప్తు?

డీఎస్పీ భీంరెడ్డికి ఐటీ నోటీసులు.. రూ.200 కోట్ల బినామీ ఆస్తులు జప్తు?
Advertisement

DSP Bheem Reddy: స్వేచ్ఛ బ్యూరో: అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమాస్తులు పోగేసుకున్న డీఎస్పీ భీంరెడ్డికి ఉచ్చు బిగుసుకుంటోంది. వందల కోట్ల సంపదను కూడబెట్టుకున్న భీంరెడ్డి చాలా ఆస్తులను బినామీల పేర పెట్టినట్టు ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. ఆ వివరాలు తీసుకున్న ఆదాయపు పన్ను శాఖ అధికారులు తాజాగా భీంరెడ్డిపై బినామీ ఆస్తుల లావాదేవీల నియంత్రణ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. 1992వ సంవత్సరం ఎస్ఐ బ్యాచ్ కు చెందిన భీంరెడ్డి అంచలంచెలుగా డీఎస్పీగా ఎదిగారు.

తెలంగాణ, కర్ణాటకలో అక్రమ ఆస్తులు..

Advertisement

ఈ మధ్యకాలంలో ఆయన భారీగా ఆస్తులు సంపాదించినట్టు అందిన సమాచారంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. పక్కాగా వివరాలు సేకరించి కొన్నిరోజుల క్రితం భీంరెడ్డి నివాసంతోపాటు ఆయన బంధుమిత్రుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు జరిపారు. తనిఖీలు జరిపి భీంరెడ్డికి ఇటు తెలంగాణతోపాటు కర్ణాటక రాష్ట్రం బెంగళూరు, మరికొన్ని చోట్ల భూములు, ప్లాట్లు, నివాస, వాణిజ్య భవనాలు ఉన్నట్టు గుర్తించారు. వీటి విలువ ప్రైవేట్ మార్కెట్ లో 200కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేశారు.

భీంరెడ్డిపై అక్రమాస్తుల కేసులు

Advertisement

ఈ క్రమంలో భీంరెడ్డిపై అక్రమాస్తుల కేసులు నమోదు చేసి జైలుకు రిమాండ్ చేశారు. ఆ తర్వాత కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకొని విచారణ చేశారు. ఈ క్రమంలో మనోజ్, లక్ష్మణ్, సరిత,ఇంద్రకరణ్ రెడ్డి, సురేష్, నరేందర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డితోపాటు మరికొందరు భీంరెడ్డికి బినామీలుగా ఉన్నట్టు గుర్తించారు. ఈ వివరాలను సేకరించిన ఐటీ శాఖ భీంరెడ్డిపై బినామీ ఆస్తుల లావాదేవీల నియంత్రణ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని నిశ్చయించింది.

చట్టం ఏం చెబుతోంది..

అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆస్తులు కూడబెట్టుకునే అధికారులపై ఈ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవచ్చు. ఈ చట్టం ప్రకారం ఇతరుల పేర్లపై ఆస్తులు కొనటం, లావాదేవీలు చేయటం నేరం. బినామీ పేర్లతో కూడబెట్టిన ఆస్తులను ప్రభుత్వం ఎలాంటి పరిహారం లేకుండా స్వాధీనం చేసుకోవచ్చు. దోషులుగా తేలితే 7 సంవత్సరాల వరకు కఠినమైన జైలు శిక్ష, ఆస్తి మార్కెట్ విలువలో ఇరవై అయిదు శాతం భారీ జరిమానా విధించవచ్చు.

Also Read: అధికారం కోసం క్షుద్ర పూజలా? తెలంగాణకి వీళ్లే శనీశ్వరులు- సీఎం రేవంత్ రెడ్డి

Tags

Related News

నవంబర్ నుంచి విద్యుత్ బిల్లుల పెంపు.. యూనిట్‌కు ఎంతంటే?

మహిళా టెక్కీ ఆత్మహత్య.. సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు, హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఘటన

తెలంగాణ పశుపోషకులకు బిగ్ షాక్.. 12 ఏళ్లయినా తప్పని తిప్పలు!

ఫ్రీ బస్సు పథకం ఎఫెక్ట్.. కేవలం 3 నెలల్లో రికార్డును బ్రేక్ చేసిన టీజీఎస్ఆర్టీసీ!

వృద్ధులకు భారీ గుడ్ న్యూస్.. తెలంగాణలో జపాన్ తరహా హెల్త్ ప్లాన్!

సింగరేణి కార్మికులకు భారీ గుడ్ న్యూస్.. బోనస్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం!

ఉల్లి రూ.70, వెల్లుల్లి రూ.240.. సామాన్యుడు ఎలా బతకాలి? రేవంత్ సర్కార్‌పై హరీష్ రావు ప్రశ్నల వర్షం

హైదరాబాద్‌లో దారుణం.. వృద్ధుడే లక్ష్యంగా హనీట్రాప్.. రూ.38 లక్షలు కాజేసిన కేటుగాడు!

Big Stories

Advertisement
×