Sid Sriram:ఈ మధ్యకాలంలో చాలామంది సంగీత దర్శకులు.. ప్రజలతో నేరుగా మమేకం అవ్వడానికి, భారీ గుర్తింపు తెచ్చుకోవడానికి లైవ్ కన్సెర్ట్ నిర్వహించి, భారీ పాపులారిటీ అందుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సంగీత దర్శకులే కాదు సింగర్లు కూడా తాము ఇందుకు అతీతం కాదు అంటూ ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే మెలోడీ సాంగ్స్ తో శ్రోతలను అలరిస్తూ… తన అద్భుతమైన గాత్రంతో ప్రేక్షకులను తనవశం చేసుకుంటున్న సిద్ శ్రీరామ్ (Sid Sriram) కూడా లైవ్ కన్సెర్ట్ నిర్వహించడానికి సిద్ధమైపోయారు. ఈ క్రమంలోనే సిద్ శ్రీరామ్ నిర్వహించబోతున్న ఈ లైవ్ కన్సెర్ట్ ఎప్పుడు? ఎక్కడ? జరగబోతోంది? దీనికి టికెట్స్ ఎలా బుకింగ్ చేసుకోవాలి ? అనే విషయాలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. మరి ఈ లైవ్ కన్సెర్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
సిద్ శ్రీరామ్ నిర్వహించబోయే లైవ్ కన్సెర్ట్ ఎప్పుడు? ఎక్కడంటే..?
దక్షిణాది శ్రోతలను తన అద్భుతమైన స్వరంతో ఆకట్టుకుంటున్న సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్, తన టీం తో కలిసి లైవ్ కన్సెర్ట్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 15వ తేదీన హైదరాబాద్లోని గచ్చిబౌలి సమీపంలో ఉన్న బౌల్డర్ హిల్స్ లో చాలా ఘనంగా జరగబోతోంది.
టికెట్ ధర ఎంత? ఎలా బుక్ చేసుకోవాలంటే..?
ఇకపోతే ఈ విషయం తెలిసి అభిమానులు, సినీ ప్రేక్షకులు, సంగీత శ్రోతలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి టికెట్ బుక్ చేసుకోవడానికి ఎగబడుతున్నారు. ఇటీవల సిద్ తన టీం తో కలిసి విజయవాడలో విద్యుత్ కాంతిలో నిర్వహించిన లైవ్ కన్సెర్ట్ కి మంచి ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలోనే త్వరలో హైదరాబాదులో జరగబోయే ఈ కన్సెర్ట్ కి అప్పుడే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇక మీరు కూడా సిద్ శ్రీరామ్ ని ప్రత్యక్షంగా చూసి, ఆయన స్వరాన్ని స్వయంగా అనుభవించాలి అని, ఆ అనుభూతిని పొందాలనుకుంటే చింతించాల్సిన అవసరం లేదు. జొమాటో, పేటియం యాప్ ద్వారా టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చారు నిర్వాహకులు. అయితే ఈ నెల ప్రారంభంలోనే టికెట్లు అన్నీ బుక్ అయిపోయాయి కానీ గోల్డ్ సెక్షన్ కింద ఇప్పటికి టికెట్లు అందుబాటులోనే ఉన్నాయి. ఒక్కో టికెట్ రూ. 1,299 నుండి రూ.3,499 వరకు ఉంటుంది. 4-5 గంటల పాటు జరిగే కన్సెర్ట్ ను అభిమానులు నిలబడి ఆస్వాదించడానికి , అలాగే కూర్చుని చూడడానికి రేంజ్ను బట్టి టికెట్లను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పేటీఎం యాప్‌లోని కొన్ని టిక్కెట్ వర్గాలకు.. ఫ్యాన్ పిట్ జోన్‌లో భాగంగా వన్ ప్లస్ వన్ ఆఫర్ కూడా లభిస్తోంది. అంటే ఒకటి కొంటే మరో టికెట్ ఉచితంగా పొందవచ్చు.ఈ వర్గానికి టిక్కెట్ ధర రూ.2,499 మరియు రూ. 3,299. కాబట్టి దీన్ని బట్టి చూస్తే సిద్ శ్రీరామ్ అభిమానులు రూ.3500 లోపు రెండు టికెట్లను కొనుగోలు చేయవచ్చు. టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత అభిమానులకు.. ఈ – టికెట్ వారి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు వెళుతుంది. ఈవెంట్ కి వచ్చిన తర్వాత రిస్ట్ బ్యాండ్ ఇవ్వబడుతుంది..అంతేకాదు ఒకసారి కొనుగోలు చేసిన తర్వాత టికెట్ తిరిగి చెల్లించబడవు అని కూడా తెలిపారు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">