OTT Movie : హాలీవుడ్ నుంచి వచ్చిన ఒక రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ అప్పట్లో ఒక ఊపు ఊపింది. ఇద్దరు కవలలు అమ్మాయిలను ప్రేమపేరుతో పడేసి వాడేస్తుంటారు. చివరికి పేషంట్లను కూడా వదలకుండా పని కానిస్తుంటారు. ఆ తరువాత ఒక అమ్మాయితో ఈ స్టోరీ మలుపు తీసుకుంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ?ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే ..
ఆమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon Prime Video) లో
ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘డెడ్ రింగర్స్'(Dead Ringers). దీనికి డేవిడ్ క్రోనెన్‌బర్గ్ దర్శకత్వం వహించారు. ఇందులో జెరెమీ ఐరన్స్ కవల సోదరుల పాత్రలో నటించాడు. బెవర్లీ మాంటెల్, ఎలియట్ మాంటెల్ అనే గైనకాలజిస్ట్‌లు అమ్మాయిలను ఒకరు పడేసి, ఇద్దరూ వాడేస్తారు. ఆ తరువాత మళ్ళీ ఇంకో అమ్మాయి వేటలో పడేవాళ్ళు. చివరికి వీళ్ళ జీవితాలు ఎటు వెళ్తాయనేది స్టోరీలో తెలుసుకుందాం. ఈ మూవీ ఆమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
బెవర్లీ, ఎలియట్ ఒకే రూపం లో ఉండే కవల సోదరులు. రూపం లో ఏమాత్రం తేడా ఉండదు. వాళ్ళు టొరంటోలో గైనకాలజిస్ట్‌లుగా పనిచేస్తుంటారు. డాక్టర్ లుగా అయితే మంచి పేరు తెచ్చుకుంటారు. బయటి నుండి చూస్తే వారు విజయవంతమైన డాక్టర్ లుగా కనిపిస్తారు. కానీ వారి వ్యక్తిగత జీవితాలు చాలా తేడాగా ఉంటాయి. ఎలియట్ సామాజికంగా చాలా చురుకుగా ఉంటాడు. బెవర్లీ మాత్రం ఎక్కువగా సిగ్గుపడే స్వభావం కలిగి వ్యక్తిగా ఉంటాడు. వారిద్దరూ తమ రోగులతో సంబంధాలను పెట్టుకుంటారు.ఒకరు అమ్మాయిని పడేస్తే ఇద్దరూ కలసి వాడేస్తారు.వాళ్ళల్లో అసలు వ్యక్తిని గుర్తించడం అంత సులువు కాదు. ఎన్నిరోజులు దాచినా కొన్ని విషయాలు దాగవు. ఈ కధలో కూడా అంటువంటి మలుపు ఒకటి వస్తుంది. బెవర్లీ ఒక నటి అయిన క్లైర్ నివాక్స్ అనే రోగితో ప్రేమలో పడతాడు. క్లైర్‌కు అసాధారణమైన గర్భాశయం ఉందని తెలుసుకున్న బెవర్లీ ఆమెకు ట్రీట్ మెంట్ ఇస్తాడు. అలాగే ఆమె అందం పట్ల ఆకర్షితుడవుతాడు. ఈ సంబంధం బెవర్లీ, ఎలియట్ మధ్య విభేదాలు తెస్తుంది. క్లైర్‌తో బెవర్లీ సంబంధం ప్రేమగా మారుతుంది. ఆ తరువాత ఎలియట్ ను దూరం పెడతాడు బెవర్లీ.
బెవర్లీ క్లైర్ ద్వారా మాదక ద్రవ్యాలకు బానిస అవుతాడు. అతని మానసిక స్థితి క్షీణించడం ప్రారంభమవుతుంది.పేషంట్లకి శస్త్రచికిత్స చేయడానికి విచిత్రమైన పరికరాలను రూపొందిస్తాడు. ఈ సమయంలో ఎలియట్ కూడా తన సోదరుడి ప్రవర్తన వల్ల కంగారూపడతాడు. వారిద్దరూ ఒకరిపై ఒకరు ఆధారపడే విధానం, వారిని విషాదకరమైన ముగింపు కు తీసుకెళ్తుంది. బెవర్లీ, ఎలియట్‌ను మామూలు మనిషిని చేయడానికి ఒక శస్త్రచికిత్స చేస్తాడు. ఇది వికటించి ఎలియట్ మరణానికి దారితీస్తుంది. ఆ తరువాత బెవర్లీ కూడా తన సోదరుడు లేని జీవితాన్ని భరించలేక, ఆత్మహత్య చేసుకుంటాడు. ఇలా వీరి కధ విషాధంగా ముగుస్తుంది. ఈ మూవీలో జెరెమీ ఐరన్స్ అద్భుతమైన నటన, క్రోనెన్‌బర్గ్ విలక్షణమైన దర్శకత్వ శైలి కారణంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.