OTT Movie : ఇప్పుడు మలయాళం సినిమాలకు ఆదరణ పెరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. థియేటర్లలో సందడి చేసి, ఓటిటి లో కూడా ఇవి దూసుకుపోతున్నాయి. అయితే కొన్ని సినిమాలు థియేటర్లలో అంతగా ఆడకపోయినా, ఓటీటీలో మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా అందులోకే వస్తుంది. బెంగళూరులో స్నేహితుల మధ్య ఈ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ సరదాగా సాగిపోతూ, మధ్యలో వచ్చే ట్విస్ట్ లతో ఒక్కసారిగా మారిపోతుంది. దీని పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే
నెట్ ఫ్లిక్స్ (Netflix) లో
ఈ మలయాళ డ్రామా మిస్టరీ మూవీ పేరు ‘డియర్ ఫ్రెండ్’ (Dear Friend). 2022 విడుదలైన ఈ మలయాళ మూవీ వినీత్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో టోవినో థామస్, దర్శన రాజేంద్రన్, బాసిల్ జోసెఫ్, అర్జున్ లాల్, అర్జున్ రాధాకృష్ణన్, సంచన నటరాజన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా బెంగళూరులో నివసించే ఐదుగురు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
వినోద్ (టోవినో థామస్), జన్నత్ (దర్శన రాజేంద్రన్), అర్జున్ (అర్జున్ లాల్), శ్యామ్ (అర్జున్ రాధాకృష్ణన్), సజిత్ (బాసిల్ జోసెఫ్) అనే ఐదుగురు స్నేహితులు బెంగళూరులో కలిసి ఉంటారు. వీరు ఒక హెల్త్ యాప్‌ను అభివృద్ధి చేసే స్టార్టప్‌లో పనిచేస్తూ, జీవితాన్ని సరదాగా గడుపుతుంటారు. వాళ్ళు పార్టీలు, ప్రాంక్‌లతో ఎంజాయ్ చేస్తుంటారు. ఒక సారి వినోద్ పుట్టినరోజు సందర్భంగా, అతన్ని సూపర్‌మ్యాన్ కాస్ట్యూమ్‌లో నగరంలో తిరిగేలా ప్రాంక్ చేస్తారు. అయితే ఈ సరదా కారణంగా ఒక గొడవ జరిగి, వారు పోలీసులచే అరెస్ట్ అవుతారు. ఈ ఘటన వినోద్‌ను ఇబ్బంది పెడుతుంది. కానీ అతను దాన్ని తేలిగ్గా తీసుకుంటాడు. ఇలా సాగిపోతున్న వీరి జీవితాల్లో అనుకోని మలుపు తిరుగుతుంది. ఒక రోజు వినోద్ అనూహ్యంగా తన స్నేహితుల నుండి దూరమవుతాడు. ఎటువంటి సమాచారం లేకుండానే అదృశ్యమవుతాడు. ఈ సంఘటన స్నేహితులను గందరగోళానికి గురిచేస్తుంది. వాళ్ళు వినోద్ గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు, అతని గతం గురించి కొన్ని షాకింగ్ విషయాలు బయటపడతాయి. వినోద్ నిజంగా మంచివాడా లేక అతని వెనుక ఏదైనా రహస్యం ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతాయి. అతని గురించి అసలు విషయాలు తెలుసుకోవడానికి మగతా ఫ్రెండ్స్ ప్రయత్నిస్తారు. చివరికి వినోద్ అదృశ్యం వెనుక కారణం ఏమిటి ? అతను మళ్ళీ తిరిగి వస్తాడా ? స్నేహితులు అతన్ని ఎలా కనిపెడతారు ? ఈ విషయాలను, ఈ మలయాళం సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : కాటికి కాళ్ళు చాపే వయసులో తోడు కోసం ఆరాటం … ముసలోడే కానీ మహానుభావుడు భయ్యా