OTT Movie : బాలీవుడ్ సినిమాలకు ఎప్పటినుంచో మన ప్రేక్షకులు అభిమానులుగా ఉన్నారు. ఈ సినిమాలను చూడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ ఒక ఫీల్ గుడ్ స్టోరీ తో వచ్చింది. జాకీశ్రాఫ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీని, చూస్తున్నంతసేపు మంచి ఫీలింగ్ వస్తుంది. ఒంటరితనంతో బాధపడే ఒక వృద్ధుడి పాత్రలో ఒదిగిపోయాడు ఈ హీరో. ఈ మూవీ చివరి వరకూ సరదాగా సాగిపోతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ బాలీవుడ్ కామెడీ డ్రామా మూవీ పేరు ‘మస్త్ మే రెహ్నే కా’ (Mast Mein Rehne ka). 2023లో విడుదలైన ఈ మూవీకి విజయ్ మౌర్య దర్శకత్వం వహించారు. దీనిని విజయ్ మౌర్య, పాయల్ అరోరా కలసి నిర్మించారు. ఇందులో జాకీ ష్రాఫ్, నీనా గుప్తా ప్రధాన పాత్రలో నటించగా, అభిషేక్ చౌహాన్, మోనికా పన్వర్, ఫైసల్ మాలిక్, రాఖీ సావంత్ సహాయక పాత్రల్లో నటించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ 2023 డిసెంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
కామత్ అనే ఒక 75 ఏళ్ల ఒంటరి వృద్ధుడు ముంబైలో ఒంటరిగా నివసిస్తుంటాడు. తనపని తాను చేసుకుంటూ, సాధారణమైన జీవనశైలిని గడుపుతుంటాడు. అతని జీవితం ఇలా సాగుతుండగా, ఒక రోజు అతని ఇంట్లో దొంగతనం జరుగుతుంది. ఈ క్రమంలో అతను కూడా గాయపడతాడు. పోలీసులు అతని ఒంటరితనం గురించి మాట్లాడతారు. ఈ వయసులో ఎవరైనా తోడు ఉంటే మంచిదని చెప్తారు. అప్పుడే తన ఒంటరి జీవితంలో ఒక తోడు కావాలని అనుకుంటాడు. అతని జీవన విధానం మార్చుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలో అతను ప్రకాశ్ కౌర్ అనే ఒక చురుకైన పంజాబీ మహిళ పరిచయం అవుతుంది. ఆమె కూడా ఒంటరితనంతో ఉంటుంది. వారిద్దరూ ఒకరికొకరు స్నేహంతో బంధం పెంచుకుంటారు. సరదాగా సమయాన్ని గడపాడం అలవాటు చేసుకుంటారు.
మరోవైపు, మధోష్ గుప్తా అనే ఒక టైలర్ స్టోరీ కూడా నడుస్తూ ఉంటుంది. అతను ముంబైలో జీవనోపాధి కోసం వచ్చి, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటాడు. డబ్బు సంపాదించడానికి అతను వృద్ధుల ఇళ్లలో దొంగతనాలు చేస్తాడు. వీటిలో కామత్, కౌర్ ఇళ్లు కూడా ఉంటాయి. అతను రాణి అనే బిచ్చగత్తెతో ప్రేమలో పడతాడు. ఈ నాలుగు పాత్రల జీవితాలు ఊహించని రీతిలో ఒకదానితో ఒకటి ముడిపడతాయి. కామత్, హండా ఒక దొంగను అనుకోకుండా కలుస్తారు. ఆతరువాత వారి జీవితాలలో మరింత మార్పు వస్తుంది.ఈ స్టోరీ హిందీ, తెలుగు డబ్బింగ్‌తో కూడా అందుబాటులో ఉంది. ఒక మంచి ఫీల్ గుడ్ సినిమాను చూడాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.