E-Paper
Advertisement

క్యాబ్‌పై కూర్చుని వర్క్.. ఈ ఐటీ ఉద్యోగి కేక!

క్యాబ్‌పై కూర్చుని వర్క్.. ఈ ఐటీ ఉద్యోగి కేక!
Advertisement

Viral Gurugram Video: వర్షం వస్తే సిటీలో ట్రాఫిక్ ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా గురు గ్రామ్‌ లో భారీ వర్షాలు పడితే రోడ్ల మీద వాహనాల రద్దీ మరింత పెరుగుతుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో గురుగ్రామ్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ చుక్కలు చూపించింది. వాహనాలు కదలకపోవడంతో ఉద్యోగులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

మధ్యలో ఆగిపోయిన క్యాబ్

ఈ ట్రాఫిక్‌ లో ఓ ఐటీ ఉద్యోగి ప్రయాణిస్తున్న క్యాబ్ మధ్యలోనే ఆగిపోయింది. వర్షం, ట్రాఫిక్ కారణంగా అప్పటికే ఆఫీస్ టైమ్ కావడం, క్యాబ్ కూడా పనిచేయకపోవడంతో అతడికి ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే, ఆ ఉద్యోగి తన పని మొదలు పెట్టాడు.  అతడు ఏకంగా కారు రూఫ్‌ పైకి ఎక్కాడు. అక్కడే ల్యాప్‌ టాప్ ఓపెన్ చేసి పని మొదలుపెట్టాడు. చుట్టూ ట్రాఫిక్ జామ్.. వాహనాల హారన్లు.. మేఘాలతో కూడిన వాతావరణం ఉన్నప్పటికీ అతడు మాత్రం ల్యాప్‌ టాప్‌ లో పని చేసుకుంటూ కనిపించాడు. ఈ ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉద్యోగి పరిస్థితిని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

 వర్క్ డెడికేషన్ అంటూ ప్రశంసలు

Advertisement

వీడియో చూసిన కొందరు నెటిజన్లు ఆ ఉద్యోగి పని పట్ల ఉన్న నిబద్ధతను ప్రశంసిస్తున్నారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా పని పూర్తి చేయాలనే పట్టుదల కనిపిస్తోందని కామెంట్లు చేస్తున్నారు. ‘వర్క్ డెడికేషన్ అంటే ఇదే’ అంటూ కొందరు సరదాగా స్పందిస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ ఘటనపై క్రేజీగా స్పందిస్తున్నారు. కారు రూఫ్‌పై కూర్చోవడం కాస్త ఓవర్ గా అనిపించడం లేదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. వర్షంలో ఇలా పని చేయడం ప్రమాదకరమని, కాస్త జాగ్రత్తగా ఉండాలని మరికొంత మంది సూచిస్తున్నారు.

ఈ ఘటన సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్నప్పటికీ..  కొంత మంది అతడి పరిస్థితి అర్థం చేసుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఉద్యోగంలో డెడ్‌ లైన్లు, అత్యవసర పనులు ఉండొచ్చు. కానీ, వాటి కోసం వ్యక్తిగత భద్రతను పక్కన పెట్టడం మంచి పని కాదని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు. క్యాబ్ ఆగిపోవడం, భారీ వర్షం, ట్రాఫిక్ జామ్ లాంటి  పరిస్థితుల్లో ముందుగా సేఫ్ ప్లేస్ కు వెళ్లడం ముఖ్యమంటున్నారు. పని తర్వాత కూడా చేసుకోవచ్చు. కానీ, ప్రమాదం జరిగితే కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందంటున్నారు. గురుగ్రామ్‌లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కొందరికి ఇది వర్క్ డెడికేషన్‌గా కనిపిస్తే.. మరికొందరికి మాత్రం ‘ఇదేం పని బాసూ!’ అనిపిస్తోంది.

Advertisement

Read Also: ఇదేం రిస్క్ రా బాబూ.. కదులుతున్న రైలును ఎగబడి ఎక్కుతున్న జనం.. హర్ష్ గోయెంకా షాకింగ్ రియాక్షన్!

Tags

Related News

రైలు ప్రయాణంలో నవరాత్రి జోష్.. లోకల్ ట్రైన్‌లో మహిళల ‘గర్భా’ డ్యాన్స్.. నెటిజన్లు ఫిదా!

సినిమా చూస్తూ ఆటో డ్రైవింగ్.. డ్రైవర్‌పై సీపీ సజ్జనార్ సీరియస్!

భక్తుల కోసం టీటీడీ కొత్త యాప్.. ‘వేంకటాద్రి’ ప్రత్యేకతలు ఇవే!

బీహార్ యువకుడితో రష్యా యువతి ప్రేమ.. గుడిసెలోనే ఉంటానంటూ ఇండియాకు వచ్చేసి..

ఎయిరిండియా విమానానికి హైజాక్ ముప్పు.. జైపూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్, అసలు ఏం జరిగింది?

జోగులాంబ దర్శనానికి వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. హైదరాబాద్ నుంచి బస్సులు!

డ్రీమ్ కారు కోసం ఇంత పిచ్చా? ఏకంగా వృషణా**లను అమ్మేశాడు!

దసరాకు 5 వేల స్పెషల్ బస్సులు.. గుడ్ న్యూస్ చెప్పిన ఏపీఎస్ ఆర్టీసీ!

Big Stories

Advertisement
×