OTT Movie : ఓటీటీ లోకి సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. వీటిని ప్రేక్షకులకు తగ్గట్టు తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇందులో ఒక పోలీస్ ఆఫీసర్, గ్యాంగ్‌స్టర్ ల మధ్య వార్ నడుస్తుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో అదరగొడుతోంది. ఈ వెబ్ సిరీస్ పేరు ఏమిటి ?ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే ..
నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో
ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు’ఖాకీ: ది బెంగాల్ చాప్టర్’ (Khakee: The Bengal Chapter). దీనికి నీరజ్ పాండే దర్శకత్వం వహించారు. ఇది 2025 మార్చి 20న నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో విడుదలైంది. ఈ సిరీస్ 2000వ దశకం ప్రారంభంలో పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో జరిగే స్టోరీని ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు. బాఘా అనే భయంకరమైన డాన్ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. అక్కడ నేరాలు, అవినీతి, రాజకీయ అధికారం మధ్య ఎక్కువగా పోరాటం ఉంటుంది. వీటన్నిటిని కలిపి ఈ వెబ్ సిరీస్ లో చూపించారు.
స్టోరీలోకి వెళితే
2002లో కోల్‌కతాలో శంకర్ బరువా అలియాస్ బాఘా అనే భయంకరమైన గ్యాంగ్‌స్టర్ నగరంలోని అక్రమ కార్యకలాపాలను నిర్వహిస్తుంటాడు. అతనికి బారున్ రాయ్ అనే పవర్ ఫుల్ రాజకీయ నాయకుడి మద్దతు కూడా ఉంటుంది. ఇతను అధికారంలో ఉన్న పార్టీలో కీలక సభ్యుడు గా ఉంటాడు. అందువల్ల బాఘా రెచ్చిపోతూ ఉంటాడు. బాఘా తన అనుచరులైన సాగోర్ తాలుక్‌దార్, రంజిత్ ఠాకూర్ సహాయంతో నగరంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తాడు. అయితే ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్న ఒక గౌరవనీయమైన పోలీసు అధికారి హత్య జరుగుతుంది. ఈ హత్య తర్వాత ప్రజల్లో బాఘాపై ఆగ్రహం బుసలు కొడుతుంది. దీంతో బాఘాను అరెస్ట్ చేసేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటవుతుంది. ఈ బృందానికి సప్తర్షి సిన్హా నాయకత్వం వహిస్తాడు. అయితే అతను కూడా బాఘా చేతిలో హత్యకు గురవుతాడు. ఈ ఘటన తర్వాత, IPS అధికారి అర్జున్ మైత్రా కోల్‌కతాకు బదిలీ అవుతాడు. అర్జున్ ఒక నిజాయితీపరుడైన పోలీసు అధికారి. అతను నేరస్తులను ఎదుర్కొనేందుకు ‘ముందు కాల్చు, తర్వాత ప్రశ్నించు’ అనే విధానాన్ని అనుసరిస్తాడు.
ఈ హత్యల తరువాత అతని లక్ష్యం బాఘా అతని గ్యాంగ్‌ను అంతమొందించి, నగరంలో శాంతిని పునరుద్ధరించడం. అది అంత సులువుగా అయ్యే పని కాదు. అతని మార్గంలో అనేక అడ్డంకులు, రాజకీయ ఒత్తిళ్లు ఎదురవుతాయి. అయితే బాఘా గ్యాంగ్‌లో అంతర్గత విభేదాలు వస్తాయి. సాగోర్, రంజిత్, బాఘా ఆదేశాలను ధిక్కరించి స్వతంత్రంగా నడుచుకోవడం ప్రారంభిస్తారు. ఈ పరిస్థితి మరింత గందరగోళంగా మారుస్తుంది. అర్జున్ తన బృందంలోని ఒక అవినీతిపరుడైన పోలీస్ అధికారిని కనిపెడతాడు. అతడు బాఘాకు హెల్ప్ చేస్తుంటాడు. బాఘా గ్యాంగ్‌ను ఎదుర్కోవడానికి తెలివితో పాటు ధైర్యాన్ని కూడా ప్రదర్శిస్తాడు రంజిత్. కథలో అనేక ట్విస్ట్‌లు, డ్రామాటిక్ మలుపులు చోటు చేసుకుంటాయి. ఇవి చివరి వరకు ప్రేక్షకులను కుర్చీలకు కట్టిపడేస్తాయి.