Deepika RangaRaju.. దీపిక రంగరాజు (Deepika Rangaraju). ఈ పేరు చెబితే ఎవరూ గుర్తుపట్టరు. కానీ ‘బ్రహ్మముడి’ కావ్య అంటే వెంటనే గుర్తుపట్టేస్తారు. ఈ సీరియల్ తో అంతలా గుర్తింపు తెచ్చుకుంది ఈ తమిళ్ బ్యూటీ. తన అద్భుతమైన వాక్చాతుర్యంతో, అల్లరితో అందరినీ అలరిస్తూ ఉంటుంది. ఒకవైపు సీరియల్స్ లో నటిస్తూనే..మరొకవైపు బుల్లితెరపై ప్రసారమయ్యే పలు షోలలో కూడా సందడి చేస్తూ ఉంటుంది. ఇటీవల ‘ఆదివారం విత్ స్టార్ మా పరివార్ ‘ షోలో సందడి చేసిన ఈమె.. ఈ ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రసారమవుతున్న ‘డాన్స్ ఐకాన్ సీజన్ 2’ లో పాల్గొని సందడి చేస్తోంది. అక్కడ వచ్చీ రాని తెలుగులో మాట్లాడుతూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఒక డాన్సర్ తో మాట్లాడుతూ.. ఆమె చేసిన కామెంట్లు అందరికీ ఆశ్చర్యంతో పాటు కామెడీగా కూడా అనిపించాయి. మరి అసలు విషయం ఏమిటంటే ఇప్పుడు చూద్దాం..
డబుల్ మీనింగ్ డైలాగులతో ఆశ్చర్యపరుస్తున్న బ్రహ్మముడి కావ్య.
ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా వేదికగా డాన్స్ ఐకాన్ సీజన్ 2 ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ఇందులో ఎంతోమంది డాన్సర్ లు తమ టాలెంట్ ను నిరూపించుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ (Sekhar Master) తో పాటు యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఇక వీరితోపాటు టీం లీడర్లుగా బిగ్ బాస్ ఫేమ్ మానస్ (Manas) , బ్రహ్మముడి కావ్య అలియాస్ దీపికా రంగరాజు తో పాటూ మరో ఇద్దరు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జాను డాన్స్ పెర్ఫార్మెన్స్ కి మెచ్చిన దీపికా మాట్లాడుతూ.. “జాను ఇంత శారీ వేసుకున్నాక కూడా.. అంత టైట్ బట్టల్లో కూడా.. నువ్వు వేస్తున్న స్వింగ్స్ తెలుస్తున్నాయి. అంటే ఇక బట్టలు అవసరం లేదు” అని అనగానే మిగతా లీడర్స్ అంతా అరుస్తూ ఏయ్.. బట్టలు కాదు బట్టలతో.. అంటూ తెగ అరిచేసారు. ఇక తర్వాత తన తప్పును సరి చేసుకొని దీపికా రంగరాజు కూడా బట్టలతో అంటూ కామెంట్లు చేసింది .మొత్తానికి అయితే వచ్చీ రాని తెలుగులో మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకుంటున్న ఈమె అప్పుడప్పుడు చేసే కామెంట్లు డబుల్ మీనింగ్ అర్థాలకు దారితీస్తున్నాయని నెటిజెన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది ఇదెక్కడ దొరికిందిరా మీకు అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.ఇక ప్రస్తుతం ఈ ఎపిసోడ్ ఈ రోజు( ఫిబ్రవరి 28) సాయంత్రం 7:00కు స్ట్రీమింగ్ కానుంది.
Peelings Song : NBA గేమ్ లో అల్లు అర్జున్ హవా… అసలైన గ్లోబల్ స్టార్ అంటూ కామెంట్స్..!
దీపికా రంగరాజు కెరియర్..
దీపికా రంగరాజు విషయానికి వస్తే.. తమిళనాడుకు చెందిన దీపికా రంగరాజు.. మమందూర్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసింది. చదువు పూర్తయిన తర్వాత ఒక తమిళ్ ఛానల్ లో న్యూస్ ప్రెసెంటర్ గా కెరియర్ ప్రారంభించిన ఈమె .. ఆ సమయంలోనే ‘చిత్రిరమ్ పెసుతాడి’ అనే సీరియల్ లో అవకాశం రావడంతో ఉద్యోగాన్ని పక్కన పెట్టి నటననే వృత్తిగా మార్చుకుంది. అందులో దీపికా నటనకు తమిళ మహిళా ప్రేక్షకుల ప్రశంసలు లభించాయి. ఈ గుర్తింపుతోనే తెలుగులో ‘బ్రహ్మముడి’ సీరియల్ లో అవకాశం లభించింది. ఈ సీరియల్ లో ఎంతో అమాయకంగా, సైలెంట్ గా కనిపించే ఈమె అల్లరి పిల్ల.. సెట్లోనూ స్నేహితులతోనూ గోలగోల చేస్తూ ఉంటుంది. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈమె ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">