Peelings Song :ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన చిత్రం ‘పుష్ప’. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో దాదాపు మూడేళ్ల పాటు కష్టపడి ‘పుష్ప 2’ సినిమాను గత ఏడాది డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఏ రేంజ్ లో కష్టపడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా గంగమ్మ జాతర సీక్వెన్స్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. ఇందులో అల్లు అర్జున్ లేడీ గెటప్ లో ఆకట్టుకున్నారు. ఇకపోతే గత ఏడాది విడుదలైన ఈ సినిమా సౌత్ ఆడియన్స్ కంటే నార్త్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఒక బాలీవుడ్ నుండే దాదాపు రూ.800 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు అయ్యాయి. మొత్తానికైతే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూలు రాబట్టింది. అంతేకాదు యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా రూ.1871 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి.. అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన రెండవ భారతీయ చిత్రంగా పేరు సొంతం చేసుకుంది.
అమెరికా NBA లో పీలింగ్స్ పాట ప్రదర్శన..
ఇకపోతే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు, డైలాగ్స్, సిగ్నేచర్ సైన్ అన్నీ కూడా ప్రేక్షకులలో విపరీతమైన ట్రెండ్ క్రియేట్ చేశాయి. అంతేకాదు జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు కూడా ‘తగ్గేదేలే’ అనే సంజ్ఞను చూపిస్తూ సోషల్ మీడియా ద్వారా తెగ వైరల్ చేశారు. ఇందులో అల్లు అర్జున్ కూడా పుష్పరాజ్ క్యారెక్టర్ లో చాలా అద్భుతంగా ఒదిగిపోయారు. ఇకపోతే ఈ సినిమా గుర్తింపు ఇండియాకే పరిమితమైంది అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అనూహ్యంగా అమెరికాలోని NBA గేమ్ లో పుష్ప 2 హవా కనిపించడంతో.. అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప 2 సినిమాలోని పీలింగ్స్ పాటకు అద్భుతంగా స్టెప్స్ వేశారు చీర్ లీడర్స్. ఎన్ బీ ఏ లోని టయోటా సెంటర్లో చీర్ లీడర్లు ఈ పాటకు అద్భుతమైన స్టెప్స్ వేసి అందరినీ ఆకట్టుకున్నారు . ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇకపోతే నిన్న హూస్టన్ రాకెట్స్ వర్సెస్ మిల్వాకీ బక్స్ ఆట ఆఫ్ టైం సందర్భంగా ఈ పీలింగ్స్ పాటను ప్రదర్శించారు. ఇక ప్రపంచ వేదికపై భారతీయ సినిమా తన ఉనికిని చాటుకుంతోంది అనడానికి ఇది మరో ఉదాహరణ అని చెప్పవచ్చు. మొత్తానికి అయితే 18 వేల మందికిపైగా ఆడియన్స్ ముందు 45 మంది చీర్ లీడర్స్ ఈ పీలింగ్స్ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసి ప్రాంగణాన్ని హోరెత్తించారు.
SSMB 29: సింహం సిద్ధమైంది.. ఆశ్చర్యపరుస్తున్న మహేష్ బాబు లుక్..!
అసలైన గ్లోబల్ స్టార్ అల్లు అర్జున్..
ఇకపోతే దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందించిన ఈ పీలింగ్స్ పాటను చంద్రబోస్(Chandrabose ) రచించగా.. శంకర్ బాబు కందుకూరి, లక్ష్మీ దాస్ ఆలపించారు. అటు మలయాళ సాహిత్యాన్ని సిచు రావూరు అందించడం జరిగింది. ఇక అల్లు అర్జున్ హీరోగా , రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా తమ అద్భుతమైన స్టెప్పులతో, అదిరిపోయే కెమిస్ట్రీతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ఇకపోతే ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ (Sekhar Master) కొరియోగ్రఫీ అందించడం జరిగింది. అంతేకాదు ఈ సినిమాలో ‘కిస్సిక్’ అనే పాటకు యంగ్ బ్యూటీ శ్రీ లీల (SreeLeela) అద్భుతంగా తన పర్ఫామెన్స్ తో అలరించింది. ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్, అనసూయ, సునీల్, జగదీష్ తోపాటు పలువురు కీలక పాత్రలు పోషించారు. మొత్తానికైతే ఇది చూసిన తర్వాత అల్లు అర్జున్ అసలైన గ్లోబల్ స్టార్ అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా ఒక్క సినిమాతో పాన్ ఇండియా కాదు ఏకంగా అంతర్జాతీయ గుర్తింపును సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్ అని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఈ వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు.
Great Tribute to Icon star @alluarjun & Telugu cinema by 45 dancers performing in front of 18,000+ fans in Houston, Texas. #Pushpa2 phenomenal global reach 🌎🔥 pic.twitter.com/iQ3lT2d0zg
— Censor Talk (@TheCensorTalk) February 27, 2025