Sankranthiki Vasthunnam in TV : విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) మూవీ ఓటీటీతో పాటు టెలివిజన్ ప్రీమియర్ కు కూడా ఒకే టైంలో సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అయితే మూవీ రిలీజ్ టైంలో అనిల్ రావిపూడి సరికొత్త ప్రమోషనల్ స్ట్రాటజీతో ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయ్యేలా చూడడంలో సక్సెస్ అయ్యారు. ఫలితంగా మూవీ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా చరిత్రను సృష్టించింది. అయితే టెలివిజన్ ప్రీమియర్ విషయంలో కూడా ప్రమోషన్స్ చేస్తూ, అనిల్ రావిపూడి వెంకీ మామకు తెగ టార్చర్ చూపిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా రిలీజ్ చేసిన ఓ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
వెంకీ మామకు అనిల్ రావిపూడి టార్చర్
“ఫన్, డ్రామా అండ్ ఎమోషన్స్… పర్ఫెక్ట్ మిక్స్… సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఈ శనివారం సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో టెలికాస్ట్ కాబోతోంది” అంటూ జీ తెలుగు తాజాగా సోషల్ మీడియాలో ఓ చిన్న ప్రోమోను రిలీజ్ చేసింది. అందులో వెంకటేష్, అనిల్ రావిపూడి సందడి చేశారు. అనిల్ రావిపూడి పేపర్లు పట్టుకొని కనిపించగా, వెంకటేష్ ఆయనను పలకరిస్తూ ” ఏంటి అనిల్ ఇలా వచ్చేసావు? స్క్రిప్ట్ రెడీనా?” అని అడిగాడు. “నిజమే సర్… కానీ ఇది ప్రమోషనల్ స్క్రిప్ట్” అని సమాధానం ఇచ్చాడు అనిల్. కానీ వెంకటేష్ “ఏంటి అనిల్ వదలవా, అలసిపోవా… ఇంకా ప్రమోషన్స్ ఏంటి?” అని విసుగ్గా మొహం పెట్టారు. “అది కాదు సర్… మన సినిమా టీవీ ప్రీమియర్ కాబోతోంది. ఆడియన్స్ కి మళ్ళీ మనం ఒకసారి ప్రేమగా చెప్తే..” అని అనిల్ అనగానే… “సంక్రాంతికి వస్తున్నాం జీ తెలుగులో మార్చ్ 1న శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రసారం కాబోతోంది. డోంట్ మిస్” అని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టీవీతో పాటు ఓటీటీలోనూ సేమ్ రిలీజ్ డేట్
సాధారణంగా సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత ఓటీటీలోకి వస్తాయి. ఆ తర్వాతే టెలివిజన్ కు సిద్ధమవుతాయి. కానీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ మాత్రం ఈ ట్రెండ్ ను బ్రేక్ చేసి టీవీతో పాటు ఓటీటీలోనూ ఒకే టైంలో స్ట్రీమింగ్ కాబోతోంది. మార్చ్ 1 న సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులఓ ఈ మూవీ టెలికాస్ట్ అవుతుంటే, అదే రోజు జీ5 ఓటీటీలో సాయంత్రం 6 గంటలకు ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.
వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మించగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. జనవరి 14న రిలీజ్ అయిన ఈ మూవీ 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లతో సత్తా చాటిన సంగతి తెలిసిందే.
A perfect mix of fun, drama & emotions 😆
Watch #SankranthikiVasthunnam This Saturday 6PM, Only On #ZeeTelugu ✨#SankranthiKiVasthunnamOnZeeTelugu#WorldTelevisionPremiereSankranthikiVasthunnam #FirstTVloVasthunnam #SVonTV #SankranthikiVasthunnamFirstOnTV #ZeeTeluguSpotlight… pic.twitter.com/zQ7X7Oh6qz
— ZEE TELUGU (@ZeeTVTelugu) February 27, 2025