SRH VS LSG: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament ) భాగంగా ఇవాళ.. మరో రసవత్తర పోరు జరుగుతోంది. ఏడవ మ్యాచ్ లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ ( Sunrisers Hyderabad vs Lucknow Super Giants ) జట్ల మధ్య… కీలక పోరు నడుస్తోంది. అయితే ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్.. భారీ స్కోర్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ టాప్ ఆర్డర్ అలాగే మిడిల్ ఆర్డర్ పెద్దగా రాణించలేదు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో…9 వికెట్లు నష్టపోయి 190 పరుగులు చేసింది సన్రైజర్స్ హైదరాబాద్. ఇవాళ 300 పరుగులు చేస్తుందని హైదరాబాద్ ఫ్యాన్స్ అందరూ అనుకున్నారు. కానీ హైదరాబాద్ ప్లేయర్లు విఫలం కావడంతో… 190 పరుగులకే సన్రైజర్స్ హైదరాబాద్ టీం పరిమితమైంది. ఇక నిర్ణీత 20 ఓవర్లలో 191 పరుగులు చేస్తే… హైదరాబాద్ పై లక్నో సూపర్ జెంట్స్ విజయం సాధిస్తుంది. ఒకవేళ ఆ లక్ష్యాన్ని చేదించలేకపోతే మళ్లీ హైదరాబాద్ విక్టరీ సాధించడం ఖాయం.
Also Read: SRH VS LSG: బ్యాటింగ్ చేయనున్న SRH… ఇక కాటేరమ్మ కొడుకులు 300 కొట్టడం పక్కా!
రాణించిన హెడ్ , నితీష్ కుమార్ రెడ్డి
లక్నో సూపర్ జెంట్స్ వర్సెస్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ లో సగం బ్యాటర్లు విఫలమైతే.. సగం బ్యాటర్లు మాత్రం రాణించారు. ముఖ్యంగా… హైదరాబాద్ డేంజర్ ఆటగాడు ట్రావిస్ హెడ్ ( Travis Head ) … తన వంతు పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 24 బంతుల్లో 47 పరుగులు చేసిన హెడ్ మూడు సిక్సర్లు అలాగే ఐదు బౌండరీలు కొట్టాడు. అలాగే నితీష్ కుమార్ రెడ్డి 28 బంతుల్లో 32 పరుగులు చేశాడు. ఇందులో రెండు బౌండరీలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత వచ్చిన క్లాసెన్ భయంకరంగా బ్యాటింగ్ చేశాడు. 17 బంతుల 26 పరుగులు చేసిన.. క్లాసెన్… దురదృష్టవశాత్తు రన్ అవుట్ అయ్యాడు. అయితే చివర్లో అంకిత్ వర్మ… 13 బంతుల 36 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సిక్సర్లు ఉన్నాయి. 276 స్ట్రైక్ రేటుతో దుమ్ము లేపాడు అంకిత వర్మ. ఇక ఆ తర్వాత వచ్చిన హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్… 4 బంతుల్లో మూడు సిక్సర్లు కొట్టాడు. 18 పరుగులు చేసిన తర్వాత అవుట్ అయ్యాడు. ఇలా కొంతమంది విఫలమైతే మరి కొంతమంది రాణించారు.
Also Read: Riyan Parag Fan: డబ్బులు ఇచ్చి, ఇలాంటి పనులు ఏంటీ పరాగ్ ?
మెరిసిన శార్దుల్ ఠాకూర్ ( Shardul Thakur )
ఇవాల్టి మ్యాచ్లో హైదరాబాద్ భారీ స్కోర్ చేయకుండా నిలిపింది శార్దూల్ ఠాకూర్ అని చెప్పవచ్చు. నాలుగు ఓవర్లలో 34 పరుగులు ఇచ్చిన శార్దూల్ ఠాకూర్… నాలుగు వికెట్స్ పడగొట్టాడు. దీంతో పర్పుల్ క్యాప్ కూడా దక్కించుకున్నాడు శార్దుల్ ఠాకూర్. అలాగే రవి బిష్ణయ్, ఆవేశ్ ఖాన్, ప్రిన్స్ యాదవ్ , దిగ్వేష్ రతి అందరూ తలో వికెట్ తీశారు. ముఖ్యంగా ప్రిన్స్ యాదవ్… డేంజర్ ఆటగాడైనా హెడ్ వికెట్ తీశాడు. దీంతో హైదరాబాద్ తక్కువ పరుగులు చేయగలిగింది.