OTT Movie : రియల్ లైఫ్ లో నిజంగా జరిగిన స్టోరీల ఆ ధారంగా, సినిమాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సెలబ్రిటీల స్టోరీలతో వచ్చిన సినిమాలు థియేటర్లతో పాటు, ఓటీటీలో కూడా దుమ్ములేపుతున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, ఒక సీనియర్ క్రైమ్ జర్నలిస్ట్ జ్యోతిర్మయ్ జీవితం ఆధారంగా తెరకెక్కింది. అతను 2011లో మాఫియా చేతిలో హత్యకు గురయ్యాడు. మనోజ్ బాజ్‌పాయ్ అతని పాత్రలో జీవించి, సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
స్టోరీలోకి వెళితే
జాయ్ బాగ్ (మనోజ్ బాజ్‌పాయ్) అనే సీనియర్ క్రైమ్ జర్నలిస్ట్, ముంబైలోని ‘డెస్పాచ్’ అనే వార్తాపత్రికలో పనిచేస్తుంటాడు. వార్తలు డిజిటల్ రూపంలోకి మారుతున్న తరుణంలో, న్యూస్ పేపర్లు కనుమరుగవుతుండటంతో, జాయ్ తన స్థానాన్ని కాపాడుకోవడానికి పోటీ పడాల్సి వస్తుంది. తన కెరీర్‌ను గాడిలో పెట్టుకోవడానికి, అతడు ఒక పెద్ద స్కూప్ (వార్త) కోసం వెతుకుతాడు. ఈ క్రమంలో ఒక డ్రగ్ లార్డ్ హత్య కేసును ఛేదించడానికి ప్రయత్నిస్తాడు. అతడు ఒక గ్యాంగ్ వార్ లో చనిపోయి ఉంటాడు. దర్యాప్తు లోతుగా వెళ్ళేకొద్దీ, ఈ హత్య వెనుక 2G స్పెక్ట్రమ్ స్కామ్, రియల్టీ వంటి భారీ కుంభకోణాలతో సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కుంభకోణం వెనుక రియల్ ఎస్టేట్ కంపెనీలు, అండర్‌వరల్డ్, రాజకీయ నాయకులు, పవర్‌ఫుల్ వ్యక్తుల నెట్‌వర్క్ ఉందని జాయ్ కనిపెడతాడు. అదే సమయంలో జాయ్ వ్యక్తిగత జీవితం కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది.
అతడు తన భార్య శ్వేతతో విడాకుల తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ప్రస్తుతం తన కొలీగ్ ప్రేరణతో అక్రమ సంబంధం నాడుపుతుంటాడు. అంతే కాకుండా నూరి అనే మరొక జర్నలిస్ట్‌తో కూడా సంబంధం పెట్టుకుంటాడు. ఈ సంబంధాలు అతని జీవితాన్ని మరింత చిక్కుల్లో పడేస్తాయి. మరోవైపు జాయ్ తన దర్యాప్తులో లోతుగా వెళ్ళేకొద్దీ, అతడు ఒక భారీ కుట్రలో చిక్కుకుంటాడు. అతని జీవితం చాలా ప్రమాదంలో పడుతుంది. నమ్మిన వ్యక్తులే అతన్ని మోసం చేస్తారు. ఇప్పుడు మాఫియా కళ్ళు ఇతని పై పడతాయి. చివరికి జాయ్ ఈ కుంభకోణాలను బయట పెడతాడా ? మాఫియా చేతిలో బలి అవుతాడా ? అక్రమ సంబంధాలు ఎటువంటి సమస్యలు తెస్తాయి ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ బాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : 13 సంవత్సరాల లవ్ స్టోరీ … ప్రియురాలు వేరొకడితో… మామూలుగా లేదబ్బా ఈ స్టోరీ
జీ 5 (ZEE5)
ఈ బాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘డెస్పాచ్’ (Despatch). ఇది కానూ బెహల్ దర్శకత్వంలో రూపొందింది. ఇందులో మనోజ్ బాజ్‌పాయ్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీ స్టోరీ 2012 లో వార్తాపత్రికలు, డిజిటల్ యుగంలోకి మారుతున్న నేపథ్యంలో నడుస్తుంది. ఈ మూవీ జీ 5 (ZEE5) ఓటీటీ ప్లాట్ ఫామ్ లో 2024 డిసెంబర్ 13 నుంచి అందుబాటులో ఉంది.