Vijay Devarakonda : టాలీవుడ్ యంగ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకున్నాడు.. ఈ మధ్య ఈ హీరో ఖాతాలో పెద్దగా చెప్పుకొదగ్గ సినిమాలు పడలేదు. కానీ కొన్ని కంపెనిలకు బ్రాండ్ ఎంబాసిడర్ గా వ్యవరిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. తాజాగా ఈ హీరో ఖాతాలో మరో ప్రముఖ బ్రాండ్ వచ్చి చేరింది. ఇంతకీ ఆ బ్రాండ్ ఏంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
విజయ్ లిస్ట్ లోకి మరో బ్రాండ్..
విజయ్ దేవరకొండ అకౌంట్ లోకి ఇప్పటికే బోలెడు బ్రాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేషనల్ లెవెల్లో మరో బ్రాండింగ్ ప్రమోషన్ తో వైరల్ అవుతున్నాడు. ప్రముఖ బ్రాండ్ మెక్‌డోవెల్స్ సోడా అంబాసడర్ తమ కొత్త బ్రాండ్ అంబాసడర్‌గా విజయ్ దేవరకొండను ప్రకటించింది. దీనికి విజయ్ ఒక్కడే కాదు. మరో బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్ కూడా ఉన్నారు. ఇద్దరూ కలిసి ‘యారీ’ అనే థీమ్‌తో భారత యువతలో స్నేహం అనే బంధాన్ని ప్రోత్సహించనున్నారు.. విజయ్ ఆల్రడీ నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తున్నారు. కాంపెయిన్‌లో ఆ పాజిటివ్ ఎనర్జీని మెక్‌డోవెల్స్ వినియోగించుకోవడం ఖాయం.. హిట్ సినిమాలు పడుకున్నా కూడా బ్రాండ్స్ వల్ల తన క్రేజ్ మరింత పెరిగింది.. నెక్స్ట్ ఏ బ్రాండ్ కు ఎంబాసిడర్ గా వ్యవహారిస్తారో చూడాలి..
విజయ్ దేవరకొండ సినిమాలు..
రౌడీ హీరో విజయ్ దేవరకొండ కు గత కొన్నేళ్లుగా సరైన హిట్ సినిమా లేదు. గీతా గోవిందం తర్వాత ఆయనకు చెప్పుకొదగ్గ సినిమాలు పడలేదు. బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఆ మధ్య ఖుషి, ఫ్యామిలీ స్టార్ చిత్రాలలో నటించారు. అవి పెద్దగా హిట్ టాక్ ను సొంతం చేసుకోలేదు.. ఇక ఇటీవల గౌతమ్ తిన్ననూరి కాంబోలో కింగ్ డమ్ సినిమాలో నటించారు. థియేటర్లలోకి వచ్చింది. అయితే ఈ మూవీ కూడా విజయ్ కు పెద్దగా హిట్ టాక్ ను అందించలేదు. ఫ్యాన్స్ ను నిరాశ పరిచింది. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా తన స్టార్ హోదాను పెంచుకుంటూ వెళుతున్నాడు..నెక్స్ట్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడో చూడాలి..
Also Read: బుధవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. మూడు వెరీ స్పెషల్..
ఇకపోతే ప్రస్తుతం ఈ హీరో సినిమాలు యావరేజ్ టాక్ ను అందుకోవడానికి కారణం లైగర్ అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆ మూవీ వల్లే విజయ్ సినిమాకు డిమాండ్ తగ్గిందనే చర్చలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఈ హీరోకు ఒక్క బ్లాక్ బాస్టర్ పడితే మళ్లీ హిట్ ట్రాక్ మొదలవుతుంది. నెక్స్ట్ మూవీతో భారీ విజయాన్ని అందుకుంటుందేమో.. ఒకవైపు సినిమాలు ఉన్నా మరోవైపు హీరోయిన్ రష్మీక మందన్నతో డేటింగ్ లో ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రష్మిక వరుస సినిమాలతో బిజీగా ఉంది.