E-Paper
Advertisement

OTT Movie : నడిరోడ్డుపై నిలబడి హెల్ప్ అడిగే అమ్మాయి… పోనీలే అని సాయం చేస్తే గుండె గల్లంతయ్యే ట్విస్ట్

OTT Movie : నడిరోడ్డుపై నిలబడి హెల్ప్ అడిగే అమ్మాయి… పోనీలే అని సాయం చేస్తే గుండె గల్లంతయ్యే ట్విస్ట్
Advertisement

OTT Movie : దెయ్యాల సినిమాలు ఎలా ఇంట్రెస్టింగ్ గా చూస్తామో, అందులో అప్పుడప్పుడు వచ్చే సౌండ్ ఎఫ్ఫెక్ట్స్ కి కూడా అంతలా ఉలిక్కి పడుతుంటాం. ఇవే సినిమాలు రియల్ ఇన్సిడెంట్స్ తో వస్తే, ఆ సినిమాలను చూసేందుకు మరింత ఇంట్రెస్ట్ చూపిస్తారు ఆడియన్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా రియల్ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఒక టౌన్‌లో ఒక సైతాన్ కల్ట్ నుంచి పారిపోయిన టీనేజ్ అమ్మాయి, ఆమెను కాపాడాలనుకున్న సైకియాట్రిస్ట్ డాక్టర్ చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. హారర్ ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

‘ డెవిల్ ఇన్ ఓహియో'(Devil in Ohio) డారియా పొలటిన్ క్రియేట్ చేసిన ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మినీ సిరీస్. ఇందులో ఎమిలీ డెషానెల్, సామ్ జేగర్, మాడెలైన్ ఆర్థర్ లీడ్ రోల్స్ లో నటించారు. 8 ఎపిసోడ్లతో వచ్చిన ఈ సిరీస్ ఐయండిబిలో 6/10 రేటింగ్ పొందింది. 2022 సెప్టెంబర్ 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్‌లో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

డాక్టర్ సుజాన్నా మాథిస్ రోడ్డు మీద కారులో వెళ్తుండగా, భయంతో పరిగెడుతున్న ఒక 15 ఏళ్ల మేని అనే అమ్మాయి లిఫ్ట్ అడుగుతూ కారు కింద పడుతుంది. ఇప్పుడు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ లో ఉంటుంది. ఒక కల్ట్ మనుషులు నన్ను వెంబడిస్తున్నారని, అక్కడికి నన్ను పంపొద్దు అని ఏడుస్తుంది. అక్కడ వికృతంగా టార్చర్ చేస్తున్నారని, మనుషులను కూడా బలి ఇస్తున్నారని చెప్తుంది. సుజాన్నా ఆమెను ఫాస్టర్ హోమ్‌లో పెట్టాల్సి ఉంటే, జాలి పడి తన ఇంటికే తీసుకొచ్చేస్తుంది. భర్త మెథ్యూ, ముగ్గురు టీనేజ్ పిల్లలతో మొదట్లో ఆమె బాగా కలసి పోతుంది. అంతా ఓకే అనుకుంటారు. కానీ మేని వచ్చాక ఇంట్లో వింత వింత సంఘటనలు స్టార్ట్ అవుతాయి. రాత్రి వింత సౌండ్స్ వస్తుంటాయి. పిల్లలు మేని మాటలే ఎక్కువగా వింటారు. ఒక్కో సీన్ గుండెల్లో గుబులు పుట్టించేలా ఉంటాయి.

Read Also : ముసలాడితో మాస్టర్ ప్లాన్… ఈ అమ్మాయి ఆశలకు అవాక్కవ్వాల్సిందే… గ్రిప్పింగ్ మలయాళ డ్రామా

 ఇప్పుడు సుజాన్నా కి మేని మీద అనుమానం వస్తుంది. నిజంగా ఆమె ఇన్నాసెంట్ విక్టిమా? లేక కల్ట్ ఆమెను ఇంకా కంట్రోల్ చేస్తుందా? అని సందేహ పడుతుంది. ఇక క్లైమాక్స్ ఊహించని మలుపులు తిరుగుతుంది. మేనిలో ఉన్న దెయ్యం వల్ల సుజాన్నా ఫ్యామిలీలో భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. దీంతో ఆ ఫ్యామిలీ ప్రాణాలు పోయే స్థితికి వెళ్తుంది. ఈ సమయంలో కల్ట్ మెంబర్స్ మేని తిరిగి తీసుకెళ్లడానికి టౌన్‌లోకి వస్తారు. ఇప్పుడు కథ మరింత భయంకరంగా మారుతుంది. చివరికి కల్ట్ మెంబర్స్ మేనిని తీసుకెళ్తారా ? ఆమెలో ఉన్న దెయ్యం గతం ఏమిటి ? సుజాన్నా ఫ్యామిలీ దీని నుంచి బయట పడుతుందా ? అనే విషయాలను, ఈ హారర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Advertisement

 

 

Related News

ఈజిప్ట్ ఎడారిలో విగతజీవిగా చిన్నారి.. మమ్మీగా ఇంట్లోకి ఎంట్రీ.. దాన్ని ముట్టుకుంటే పోతారు!

లాంగ్ డిస్టెన్స్ లవ్ స్టోరీ.. ప్రేమికులు మిస్ అవ్వకుండా చూడాల్సిన రొమాంటిక్ డ్రామా

పచ్చని సంసారంలో నిప్పులు పోసే కేర్‌టేకర్.. డార్క్ సీక్రెట్స్ తో దడ పుట్టించే థ్రిల్లర్

గ్యాంగ్‌స్టర్లకు చుక్కలు చూపించే అండర్‌కవర్ టీమ్.. హై-వోల్టేజ్ యాక్షన్-కామెడీ డ్రామా సిరీస్

కన్న తల్లిదండ్రులని చంపేసే లేడీ సైకో.. ఒళ్ళు గగుర్పొడిచే రియల్ స్టోరీ తెలుగులో!

మిత్రుడి మరణం.. ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్‌ ఎంట్రీతో మతిపోగొట్టే ట్విస్ట్

లాటరీలో వందల కోట్లు.. ఉద్యోగానికి రాజీనామా చేయకుండా ఆఫీస్‌‌లో అరాచకం, తెలుగులోనూ ఉంది

సైబర్ క్రైమ్ స్కామ్ తో సర్వం కోల్పోయే అమ్మాయి.. క్లైమాక్స్ అదుర్స్, తెలుగులో మలయాళ థ్రిల్లర్

Big Stories

Advertisement
×