OTT Movie : వైవిధ్యమైన కథలను ప్రేక్షకులు ఆదరిస్తూ ఉంటారు. హాలీవుడ్ నుంచి వచ్చే కొన్ని సినిమాలు, ప్రేక్షకులను కుర్చీలకి కట్టిపడేస్తూ ఉంటాయి. వీటిలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో ముందు వరుసలో ఉంటాయనే చెప్పాలి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో బొమ్మలు తయారు చేసే కంపెనీలో అమ్మాయిలను బంధించి, ఆ కంపెనీ ఓనర్ ప్రమాదకరమైన ఆటలు ఆడిస్తూ ఉంటాడు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
రెండు ఓటీటీలలో
ఈ హాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘డాల్ హౌస్ అమెరికన్ హారర్ స్టోరీస్’ (Doll house American horror stories). 1961 నాట్చెజ్, మిస్సిస్సిప్పిలో వాన్ విర్ట్ టాయ్ కంపెనీలో, ఒక సాధారణ ఉద్యోగి ఇంటర్వ్యూ భయంకరమైన మలుపు తీసుకుంటుంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney Plus hotstar), ఆపిల్ టీవీ (Apple TV) లలో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
డెన్ బొమ్మలు తయారు చేసే ఒక కంపెనీని నడుపుతూ ఉంటాడు. అందులో పని చేయడానికి అసిస్టెంట్ కావాలని పేపర్లో యాడ్ ఇస్తాడు. ఆ యాడ్ చూసి మీనన్ ఇంటర్వ్యూ కి వస్తుంది. డెన్, ఆమెను ఒక ప్రశ్న అడుగుతాడు. మనుషులకి, బొమ్మలకి తేడా ఏంటని. అందుకు ఆమె మనుషుల్లానే, బొమ్మలు కూడా ఉంటాయని, దేవుడు మనలాగే వాటిని కూడా సృష్టిస్తున్నాడని చెప్తుంది. అందుకు అతను రాంగ్ ఆన్సర్ అంటూ చెప్తాడు. మనుషులు నేరాలు చేస్తారని, బొమ్మలు అమాయకంగా ఉంటాయని చెప్తాడు. అయితే ఉద్యోగం ఇవ్వడం కుదరదని చెప్తాడు. ఆమె వెళ్ళిపోతుండగా కిడ్నాప్ చేసి ఒక గదిలో బంధిస్తాడు. ఆమెతో పాటు, కొంతమంది అమ్మాయిలు కూడా అక్కడ ఉంటారు. డెన్ వాళ్లకి కొన్ని గేమ్స్ పెడుతూ ఉంటాడు. ఓడిపోయిన వాళ్ళని దారుణంగా చంపేస్తూ ఉంటాడు. వాళ్లలో ఒకరు మాత్రమే గెలిచే పరిస్థితి ఉంటుంది. గెలిచిన ఒక అమ్మాయిని, డెన్ కొడుకు చార్లెస్ కి తల్లిగా ఉండే అవకాశం వస్తుంది.
అక్కడ ఉన్నవాళ్లు ఎంత తప్పించుకోవాలనుకున్నా, కుదరకుండా ఆ ఇంటిని డిజైన్ చేసి ఉంటాడు డెన్. ఈ గేమ్ అక్కడ ఉన్న అమ్మాయిలు మొహానికి మాస్క్ పెట్టుకుని ఆడాల్సి ఉంటుంది. మీనన్ వీళ్ళకు ఒక ఉపాయం చెబుతుంది. నిజమైన బొమ్మలను మన ప్లేస్ లో పెట్టి, ఇక్కడి నుంచి మనం తప్పించుకుందామని చెప్తుంది. ఈ ఐడియా వర్క్ అవుట్ అవుతుందేమో అని, అక్కడ ఉన్న వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. చివరికి హీరోయిన్ ఆ ప్రాంతం నుంచి తప్పించుకుంటుందా? అక్కడున్న అమ్మాయిలకు మరణం తప్పదా? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney Plus hotstar), ఆపిల్ టీవీ (Apple TV) లలో స్ట్రీమింగ్ అవుతున్న ‘డాల్ హౌస్ అమెరికన్ హారర్ స్టోరీస్’ (Doll house American horror stories) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.