BigTV English

OTT Movie : పడుకున్న దెయ్యాలను లేపి మరీ ఆటలు… వాటి వాయింపుకు పార్ట్స్ ప్యాక్

OTT Movie : పడుకున్న దెయ్యాలను లేపి మరీ ఆటలు… వాటి వాయింపుకు పార్ట్స్ ప్యాక్

OTT Movie : ఈ రోజుల్లో సినిమాలు అందరూ చూస్తారు. అయితే హారర్ సినిమాలను కొంతమంది మాత్రమే చూడగలుగుతారు. వీటిలో కూడా కామెడీ సినిమాలతో పాటు, భయపెట్టే సినిమాలు కూడా ఉంటాయి. కామెడీ హారర్ సినిమాలను కూడా చాలా మంది చూడగలుగుతారు. అయితే ఈ భయపెట్టే సినిమాలను గుండె ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు. అందులోనూ ఇండోనేషియన్ సినిమాలంటే, భయంకరమైన వాతావరణం ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకునే మూవీలో ఒక అమ్మాయి పిచ్చి పని వల్ల, ఆత్మలు ఆ అమ్మాయి శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత సన్నివేశాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


ముబి (Mubi) లో

ఈ ఇండోనేషియన్ హర్రర్ థ్రిల్లర్ సినిమా పేరు ‘డొమినియన్ ఆఫ్ డార్క్‌నెస్’ (Dominion of darkness). 2024 లో వచ్చిన ఈ మూవీకి బాబీ ప్రసేత్యో దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఒక కాథలిక్ పూజారి అయిన ఫాదర్ థామస్ జీవితం చుట్టూ తిరుగుతుంది. ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీ ముబి (Mubi) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

ఫాదర్ థామస్ తన తల్లి, సోదరిని ఒక దుర్ఘటనలో కోల్పోతాడు. ఆ తర్వాత అతని మీద అతనికే నమ్మకంపోయి, ఫాదర్ వృత్తి ని వదిలేయాలని నిర్ణయించుకుంటాడు. అయితే అతనికి అప్పుడే ఒక బాధ్యతను అప్పగిస్తాడు ఫాదర్ రెండ్రా. ఇతనికి దయ్యాల విషయంలో మంచి అనుభవం ఉంటుంది. కైలా అనే దెయ్యం పట్టిన ఒక యువతిని, వీళ్ళు రక్షించాలని అనుకుంటారు. కైలా అనే యువతి చనిపోయిన థామస్  సోదరికి స్నేహితురాలుగా ఉండేది.  ఆమె ఒక జెలాంగ్‌కుంగ్ అనే ఆచారాన్ని ప్రయత్నించడం వల్ల, దెయ్యాల ప్రపంచానికి ఒక ద్వారం తెరుస్తుంది. దాని ద్వారా శక్తివంతమైన దెయ్యాలు ఆమెను ఆవహిస్తాయి. ఈ దెయ్యాలు కైలా శరీరంలో ఉండటమే కాకుండా, ఆమె తల్లి మాయాను కూడా భయపెడుతుంటాయి. థామస్, రెండ్రా కలిసి కైలాను రక్షించడానికి ఎక్సార్సిజం చేస్తారు. మొదటి ఎక్సార్సిజంలో వారు ఒక దెయ్యాన్ని తొలగించగలిగినప్పటికీ, కైలా శరీరంలో ఇంకా బలమైన దెయ్యాలు ఉన్నాయని తెలుస్తుంది.

ఈ దయ్యాలను వదిలించే క్రమంలో, రెండ్రా గాయపడి ఆసుపత్రిలో చేరతాడు. థామస్ ఒంటరిగా రెండవ ఎక్సార్సిజంను చేపట్టాల్సి వస్తుంది. ఈ ప్రక్రియలో దెయ్యం థామస్ విశ్వాసాన్ని బలహీనపరచడానికి చాలా ప్రయత్నిస్తుంది. చివరికి థామస్ తన శక్తిని ఉపయోగించి కైలా ను రక్షిస్తాడు. చివరికి ఆ దయ్యాలు కైలా నుంచి పూర్తిగా వెళ్లిపోతాయా ? థామస్ మళ్ళీ ఫాదర్ గా జీవితాన్ని ప్రారంభిస్తాడా ?ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మూవీని మిస్ కాకుండా చూడండి. దీనిని ఇండోనేషియాలో కాథలిక్ ఎక్సార్సిజం ఆధారంగా తీసిన మొదటి హర్రర్ మూవీగా చెప్పుకోవచ్చు. ఈ మూవీని చూస్తే మీకు పార్ట్స్ ప్యాక్ అయిపోతాయి. అంతలా భయపెట్టే సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. ఆలస్యం చేయకుండా ఈ మూవీని చూసి, మీరుకూడా ఒక మంచి అనుభూతిని పొందండి.

Tags

Related News

OTT Movie : సొంత కూతురితో ఆ పని కోసం అబ్బాయిని వెతికే తండ్రి… మైండ్ బెండింగ్ మలయాళ స్టోరీ

Virgin Boys: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన వర్జిన్ బాయ్స్.. ఎప్పుడు? ఎక్కడంటే?

OTT Movie : ఇండియన్ స్పైగా వెళ్లి, పాక్ ఆర్మీ ఆఫీసర్ కు భార్యగా… ఈ సిరీస్ ను ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు

OTT Movie: అక్క అంటూనే.. టీనేజ్‌లో అలాంటి పని చేసే అబ్బాయి, ఆ కథతోనే సినిమా తీసి.. ఫుల్ కామెడీ భయ్యా!

OTT Movie : పర్వతంపై అమ్మాయి మృతదేహం… గ్రిప్పింగ్ స్టోరీ… ఇంటెన్స్ మర్డర్ మిస్టరీ

Mothevari Love Story Review : మోతెవరి లవ్ స్టోరీ రివ్యూ… లవ్ స్టోరీలో ఆస్తుల రచ్చ

Big Stories

×