Castor Oil: జుట్టు రాలడం ఒక సాధారణ సమస్య. కానీ ఈ సమస్య ఎప్పుడు బట్టతలగా మారుతుందో తెలియదు. ఈ రోజుల్లో చాలా మంది బట్టతల బాధితులుగా మారుతున్నారు. ఇలాంటి సమయంలో మీకు ఆముదం ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు మీ జుట్టుకు సరైన పద్ధతిలో ఆముదం అప్లై చేస్తే.. జుట్టు రాలడం సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. దీనితో పాటు.. అంతే కాకుండా జుట్టు పెరుగుదలకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
చుండ్రు సమస్యను కూడా తగ్గిస్తుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఆముదం నూనెను జుట్టు రాలడాన్ని నివారించడానికి ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం
ఆముదం నూనెలో కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. అంతే కాకుండా ఆముదం నూనెను తరచుగా వాడటం వల్ల జుట్టు రాలడం కూడా చాలా వరకు తగ్గుతుంది.
జుట్టు రాలడాన్ని నివారిస్తుంది:
ఆముదంలో కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఇ, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు వంటి అనేక లక్షణాలు ఉంటాయి. ఇవి తలపై చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచి, పోషణను అందిస్తాయి. అంతే కాకుండా ఇవి మీ తలపై చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. జుట్టు రాలడాన్ని నివారిస్తాయి.
ఆముదం ఎలా వాడాలి ?
ఆముదం అనేక జుట్టు సమస్యలను పరిష్కరిస్తుంది. కానీ దానిని సరిగ్గా ఎలా అప్లై చేయాలో తెలుసుకోవాలి. ఆముదం నూనెను జుట్టుకు ఎలా అప్లై చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ?
1: మీరు మీ జుట్టుకు ఆముదం నూనెను అప్లై చేసినప్పుడల్లా.. ముందుగా తల చర్మాన్ని బాగా శుభ్రం చేసుకోండి. దీని కోసం మీరు మీ జుట్టును షాంపూతో వాష్ చేసుకోవడం మంచిది.
2: ఆముదం నూనెను ఎప్పుడూ జుట్టుకు నేరుగా అప్లై చేయకూడదు.. కొబ్బరి లేదా, బాదం వంటి ఇతర నూనెలలో కలిపిన తర్వాతే అప్లై చేయండి.
3: ఆముదం చాలా మందంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, మొదట దానిని 1 నిమిషం పాటు తక్కువ మంట మీద వేడి చేయండి.
4: ఆముదం నూనెను గోరువెచ్చగా చేసి ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. నూనె గోరువెచ్చగా మారినప్పుడు.. దానిలో విటమిన్ E టాబ్లెట్ వేయండి. రెండింటినీ బాగా కలపండి.
5: ఇప్పుడు దీన్ని తలకు పట్టించి.. చేతులతో 5 నిమిషాలు బాగా మసాజ్ చేయండి.
6: ఇది నూనెను జుట్టుకు అప్లై చేయండి. చర్మంలోకి బాగా పీల్చుకోవడానికి సమయం ఇవ్వండి
7: దీన్ని అప్లై చేసిన 3-4 గంటల తర్వాత.. షాంపూ సహాయంతో జుట్టును శుభ్రం చేయండి. దీనివల్ల జుట్టు బాగా పెరుగుతుంది. కొత్త వెంట్రుకలు కూడా మూలాల నుండి పెరగడం ప్రారంభిస్తాయి.
Also Read: రోజూ 1 టీ స్పూన్ కొబ్బరి నూనె తాగితే.. ఇన్ని లాభాలా ?
వారానికి రెండుసార్లు ఉపయోగించండి:
జుట్టు పెరుగుదల బాగా ఉండాలని కొత్త జుట్టు కుదుళ్ల నుండి వేగంగా పెరగాలని మీరు కోరుకుంటే.. వారానికి 2-3 సార్లు ఈ విధంగా ఆముదం నూనెను ఉపయోగించండి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది కొత్త జుట్టు పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుంది.