BigTV English

OTT Movie : అమ్మాయిని ఆ పని కోసమే పెళ్లి చేసుకునే హీరో… టైమ్ చూసి ఆమె కొట్టే దెబ్బకు మైండ్ బ్లాక్

OTT Movie : అమ్మాయిని ఆ పని కోసమే పెళ్లి చేసుకునే హీరో… టైమ్ చూసి ఆమె కొట్టే దెబ్బకు మైండ్ బ్లాక్

OTT Movie : పెళ్లయిన ఆడవాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో ఈ తమిళ మూవీలో చక్కగా చూపించారు. వంట చేయడానికి, భర్త కోరిక తీర్చడానికి మాత్రమే పెళ్లిళ్లు చేసుకునే కొన్ని కుటుంబాలకు ఈ మూవీ కనువిప్పు కలిగిస్తుంది. స్త్రీలకు కూడా ఒక మనసు ఉంటుందని, రాతి బొమ్మలా చూస్తే వాళ్లు కూడా తిరగబడతారని ఈ మూవీ చూసిన వాళ్లకు అర్థమవుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


యూట్యూబ్ (Youtube) లో

ఈ తమిళ ఫ్యామిలీ డ్రామా మూవీ పేరు ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ (The Great Indian Kitchen). 2023 లో విడుదలైన ఈ సినిమాకు R. కన్నన్ దర్శకత్వం వహించారు. 2021 లో విడుదలైన ఒక మలయాళ మూవీకి ఇది రీమేక్ గా వచ్చింది.  ఇందులో ఐశ్వర్య రాజేష్, రాహుల్ రవీంద్రన్ ప్రధాన పాత్రలు పోషించారు. సంగీతం ను  నూతన దర్శకుడు జెర్రీ సిల్వెస్టర్ విన్సెంట్ సమకూర్చారు.  సినిమాటోగ్రఫీ బాలసుబ్రహ్మణ్యం, ఎడిటింగ్ లియో జాన్ పాల్ అందించారు. 2008 లో జయంకొండన్, ఆర్. కన్నన్‌తో ఐశ్వర్య రాజేష్ మొదటి ప్రాజెక్ట్ చేసిన తర్వాత, బాలసుబ్రహ్మణ్యం, ఆర్. కన్నన్ మధ్య ఇది ​​రెండవ ప్రాజెక్ట్ కావడం విశేషం.  ఈ మూవీ స్త్రీలు వంటగదిలో, వివాహ జీవితంలో ఎదుర్కొనే సాంప్రదాయ సమస్యలతో తెరకెక్కింది. ఈ సినిమా కథ ప్రధానంగా ఒక నూతన వధువు జీవితం చుట్టూ తిరుగుతుంది. యూట్యూబ్ (Youtube) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

ఒక యువతి వివాహం చేసుకుని, ఒక సాంప్రదాయ కుటుంబంలోకి అడుగుపెడుతుంది. ఆమె భర్త, అత్తమామలు ఆమెను ఇంటి పనులు చేయడానికి మాత్రమే ఎక్కువగా వాడుకుంటారు. ముఖ్యంగా వంటగది బాధ్యతల్లో పూర్తిగా మునిగిపోయేలా చేస్తారు. భర్త మాత్రం పడక గదిలో మాత్రమే ఆమెతో సంతోషం గా ఉంటాడు. ఆతరువాత ఆమెను పట్టించుకోవడం మానేస్తాడు. ఆమె జీవితం వంటచేయడం. ఇళ్ళు శుభ్రపరచడం, కుటుంబ సభ్యులకు సేవ చేయడం, రాత్రయితే భర్త దగ్గరికి వెళ్ళడం. ఈ పనులు ఆమెను ఒక రోబో లాగా మారుస్తాయి. సమయం గడిచేకొద్దీ, ఆమె తన స్వంత కలలు, ఆశలు, స్వేచ్ఛను కోల్పోతున్నట్లు ఆమెకు అనిపిస్తుంది. ఇంట్లోని మగవాళ్ళు కూడా, ఆడవాళ్లను వంట గదికి మాత్రమే అన్నట్లుగా చూస్తారు. వీళ్ళు సాంప్రదాయ నియమాలను కఠినంగా అమలు చేస్తారు. అలా చేయడం వలన, ఆమె అసంతృప్తికరమైన జీవితం గడుపుతూ ఉంటుంది. భర్తకు వంటగదిలో చిన్న రిపేర్ ఉందని చెప్పి రోజులు గడుస్తున్నా పట్టించుకొక పోవడంతో, చివరికి ఆమె కోపం తారా స్తాయికి చేరుతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరిమీద, వంటగది లో లీక్ అవుతున్న గలీజు నీళ్ళను చల్లుతుంది.  ఈ అణచివేత ధోరణికి తిరగబడి, స్వేచ్చగా గా బ్రతకాలని నిర్ణయం తీసుకుంటుంది. చివరికి ఆ ఇల్లాలు తీసుకున్న నిర్ణయం ఏమిటి? భర్త నుంచి ఆమె ఎటువంటి సంఘటనలు ఎదుర్కొంది? ఈవిషయాలు తెలుసుకోవాలి అనుకుంటే. ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Tags

Related News

OTT Movie : భర్తే భార్యను వేరొకడితో … కుంభకోణాల ట్విస్ట్‌ లు, సీట్ ఎడ్జ్‌ థ్రిల్లర్ లు … ఒక్కసారి చూశారంటే

OTT Movie : డ్రగ్ ట్రాఫికింగ్ చుట్టూ తిరిగే బెంగాలీ సిరీస్ … తల్లీకూతుర్లదే అసలు స్టోరీ … IMDBలో కూడా మంచి రేటింగ్

OTT Movie : ఆటకోసం అబ్బాయిగా మారే అమ్మాయి … ట్రయాంగిల్ లవ్ స్టోరీతో అదిరిపోయే థ్రిల్లింగ్

OTT Movie : అడవిలో ఒంటరి అమ్మాయి … రాత్రీపగలూ అతడితోనే … క్లైమాక్స్ వరకూ రచ్చే

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

Big Stories

×