E-Paper
Advertisement

యుద్ధభూమిలో చావును జయించిన మృత్యుంజయుడు… ముందుంది ముసళ్ల పండగ… హై-వోల్టేజ్ సస్పెన్స్ థ్రిల్లర్

యుద్ధభూమిలో చావును జయించిన మృత్యుంజయుడు… ముందుంది ముసళ్ల పండగ… హై-వోల్టేజ్ సస్పెన్స్ థ్రిల్లర్
Advertisement

Hollywood War Movie: యుద్ధం అంటేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తిరగడం. అలాంటిది భీకరమైన వార్ జోన్‌ లో దొరికిపోయి, చావు అంచుల దాకా వెళ్లి ప్రాణాలతో బయటపడాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది ? చుట్టూ శత్రు సైన్యం… తప్పించుకునే దారి కనిపించదు… సాయం కోరేందుకు అవకాశాలు కూడా తక్కువే. ఇలాంటి ఉత్కంఠభరితమైన పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కిన హాలీవుడ్ వార్ థ్రిల్లర్ ‘లక్కీ స్ట్రైక్’ (Lucky Strike). ఈ చిత్రంలో రెండో ప్రపంచ యుద్ధంలోని ఒక భీకరమైన పోరాటాన్ని కళ్ళకు కట్టారు. మరి వార్ థ్రిల్లర్స్ ను ఇష్టపడే వారి కోసం ఈ సినిమా ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

కథలోకి వెళ్తే…

రెండో ప్రపంచ యుద్ధం చివరి దశలో జర్మనీ సైన్యం చేపట్టిన భారీ దాడుల సమయంలో ఈ కథ సాగుతుంది. బల్జ్ యుద్ధం నేపథ్యంలో అమెరికా సైన్యానికి చెందిన కెప్టెన్ జాన్ కాజిల్. శత్రువులు ఉన్న ప్రాంతంలో చిక్కుకుపోయిన అతను… చుట్టూ ఉన్న జర్మన్ సైనికులు, ముందుకు సాగుతున్న నాజీ ట్యాంకుల మధ్య నుంచి బయటపడాల్సి వస్తుంది. తన సైనిక విభాగాన్ని తిరిగి చేరుకోవడం అతని ప్రాణాల పైకి తెస్తుంది. కాజిల్ ఒకే ఒక్క రేడియో మాత్రం ఉంటుంది. అదే అతనికి బయటి ప్రపంచంతో సంబంధాలు కొనసాగించేందుకు ఉన్న కీలకమైన సాధనం. కానీ శత్రువుల మధ్య చిక్కుకున్నప్పుడు రేడియో ఒక్కటే ఉంటే సరిపోదు. దాన్ని ఎప్పుడు, ఎలా ఉపయోగించాలి ? శత్రువులకు తన స్థానం తెలియకుండా ఎలా వ్యవహరించాలి ? అనే విషయాల్లో అతను ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది.

Advertisement

తన ప్రాణాలను కాపాడుకోవడంతో పాటు శత్రు సైన్యం ముందుకు సాగకుండా అడ్డుకోవడానికి కూడా కాజిల్ ప్రయత్నిస్తాడు. ఒక్క చిన్న పొరపాటు చేసినా శత్రువులకు చిక్కిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ క్రమంలో కాజిల్ అక్కడి నుంచి ప్రాణాలతో బయట పడడానికి చేసే ప్రతి ప్రయత్నం కథలో ఉత్కంఠను పెంచుతుంది. శత్రువుల మధ్య ఒంటరిగా మిగిలిపోయిన ఆ సైనికుడు ప్రాణాలతో ఎలా బయట పడ్డాడు ? తన సైనిక విభాగాన్ని చేరుకోవడానికి కాజిల్ ఎలాంటి ప్లాన్స్ వేశాడు ? శత్రు సైన్యం నుంచి తప్పించుకోవడానికి తన రేడియోను ఎలా ఉపయోగించాడు ? చివరకు ఈ ప్రమాదకరమైన పరిస్థితి నుంచి బయటపడగలిగాడా ? అనేది సినిమాలో చూడాల్సిందే.

స్ట్రీమింగ్ ఏ ఓటీటీలో ?

‘లక్కీ స్ట్రైక్’ ఇంగ్లీష్ భాషలో తెరకెక్కిన వార్, యాక్షన్, హిస్టారికల్ డ్రామా. ఈ సినిమా 2026 జూన్ 26న అమెరికాలో థియేటర్లలో విడుదలైంది. అక్టోబర్ 26 నుంచి హులు (Hulu)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు రాడ్ ల్యూరీ (Rod) దర్శకత్వం వహించారు. కెప్టెన్ జాన్ కాజిల్ పాత్రలో స్కాట్ ఈస్ట్‌వుడ్ నటించగా, కోలిన్ హాంక్స్ (Colin Hanks), ఆంజన్యూ ఎల్లిస్-టేలర్ (Aunjanue Ellis-Taylor), టేలర్ జాన్ స్మిత్ (Taylor John Smith) కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. యుద్ధ సన్నివేశాలు, శత్రువుల మధ్య ఎదురయ్యే ప్రమాదాలు వంటి సీన్లు నరాలు కట్టయ్యే టెన్షన్ తో సాగుతాయి. నిజ జీవిత సంఘటనల నుంచి స్ఫూర్తి పొందిన ఈ కథలో చారిత్రక నేపథ్యం తెరకెక్కిన ఈ సినిమాను వార్ మూవీ లవర్స్ డోంట్ మిస్.

Advertisement

Read Also: సముద్రంలో మునిగే యుద్ధనౌక… సైనికుల రక్తం కోసం వెంటాడే భారీ షార్క్‌… తెలుగులోనే ఈ గుండె జారిపోయే సర్వైవల్ థ్రిల్లర్

Tags

Related News

స్టార్ కమెడియన్ నవ్వుల వెనుక ఇంతటి విషాదమా ? పాపులర్ నటుడి రియల్ లైఫ్ ను చూపించే డాక్యుమెంటరీ సిరీస్

పిజ్జా షాప్‌లో పిచ్చి బాస్… ఈ కుర్రాళ్ల లైఫ్ చూస్తే మీ యంగ్ ఏజ్ గుర్తొస్తుంది భయ్యా… కొత్త కామెడీ సిరీస్

ఫ్యాషన్ డిజైనర్ కావాలని సిటీకి… కట్ చేస్తే కథ రివర్స్… ఎమోషనల్ మూవీ

సిటీ డాక్టర్ పై మనసు పడే విలేజ్ కుర్రాడు… ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామా

ది గ్రేట్ పంజాబ్ రాబరీ… సినిమాను తలపించే రియల్ హీస్ట్… గూస్‌బంప్స్ గ్యారెంటీ

ఏడుగురు పెళ్లికొడుకుల మధ్య చిక్కుకున్న అమ్మాయి కథ… ఫ్యామిలీ డ్రామానే

వందల ఏళ్ల రాజభవనం.. అప్పులపాలైన రాజవంశం… వైభవం నుంచి పతనం వరకు కంటతడి పెట్టించే మాస్టర్ పీస్

Big Stories

Advertisement
×