E-Paper
Advertisement

సిటీ డాక్టర్ పై మనసు పడే విలేజ్ కుర్రాడు… ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామా

సిటీ డాక్టర్ పై మనసు పడే విలేజ్ కుర్రాడు… ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామా
Advertisement

Telugu Romantic Drama: ఒక పల్లెటూరి కుర్రాడికి డాక్టర్ అమ్మాయి నచ్చితే… ఆమె మనసు గెలుచుకోవడానికి ఎన్ని పాట్లు పడతాడు ? తన ప్రేమను గెలిపించుకోవాలనే ఆరాటంలో అతని జీవితమే ఊహించని మలుపు తిరిగితే ? ప్రేమలోని అమాయకత్వం, తండ్రి ఆశలు, కుటుంబం కోసం చేసే త్యాగం… ఇలా మనసుకు హత్తుకునే భావోద్వేగాలతో సాగే తెలుగు సినిమా ‘ఐ యామ్ హ్యాండ్సమ్’ (I am Handsome). ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో ఒక అందమైన ప్రేమకథను చెబుతూనే, తండ్రీకొడుకుల అనుబంధాన్ని కూడా అందంగా చూపిస్తుంది. మరి అచ్చమైన తెలుగు మూవీని చూడాలనుకుంటే ఓటీటీ మూవీ లవర్స్ ఈ సినిమాను ఎక్కడ చూడవచ్చు ? అంటే…

కథలోకి వెళ్తే…

సూరి ఒక గ్రామంలో నివసించే యువకుడు. అతని తండ్రి మార్కండేయులు మేస్త్రీగా పని చేస్తుంటాడు. తన కొడుకు భవిష్యత్తులో బాగా స్థిరపడాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన కోరుకుంటాడు. తన కష్టాన్ని లెక్కచేయకుండా కొడుకు కోసం ఎన్నో ఆశలు పెట్టుకుంటాడు. అలాగే కొడుకు కూడా తండ్రి కష్టాన్ని చూసి ఆయనకు చాలా గౌరవం ఇస్తాడు.

Advertisement

ఇలాంటి పరిస్థితుల్లో సూరి జీవితంలోకి కావ్య అనే డాక్టర్ వస్తుంది. ఆమె ప్రేమపై నమ్మకం కోల్పోయిన వ్యక్తి. కానీ సూరి మాత్రం ఆమెను చూసిన తర్వాత మనసు పారేసుకుంటాడు. ఆమె ప్రేమను గెలుచుకోవాలని నిర్ణయించుకుంటాడు. తనపై ఆమెకు మంచి అభిప్రాయం కలిగించేందుకు ప్రయత్నిస్తాడు. అయితే ప్రేమను నమ్మని ఒక అమ్మాయి మనసును గెలుచుకోవడం అంత ఈజీ కాదు కదా. సూరి చేసే ప్రయత్నాలు అతని జీవితంలో ఊహించని పరిస్థితులకు దారి తీస్తాయి.

ప్రేమను పొందాలనే ఆశ, తన భవిష్యత్తుపై ఉన్న కలలు ఒకవైపు ఉంటే… తండ్రిపై ఉన్న బాధ్యత మరోవైపు ఉంటుంది. ప్రేమ కోసం చేసే ప్రయత్నాల్లో ఎదురయ్యే పరిణామాలు చివరకు ఊహించని విషాదానికి దారి తీస్తాయి. అయితే ఈ కథలో అసలైన భావోద్వేగం సూరి తన తండ్రి కోసం చేసే త్యాగంలో కనిపిస్తుంది. సూరి చేసిన త్యాగం కావ్య మనసును కూడా మార్చేస్తుంది. అసలు సూరి చేసిన ఆ త్యాగం ఏంటి ? అతని జీవితంలో ఎలాంటి విషాదం చోటు చేసుకుంది ? చివరికి డాక్టర్ అమ్మాయితో అతని ప్రేమ ఎలాంటి మలుపు తిరిగింది ? అన్నది తెరపై చూడాల్సిందే.

తెలుగు సినిమానే

Advertisement

‘ఐ యామ్ హ్యాండ్సమ్’ తెలుగు భాషలో రూపొందిన సినిమా. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో తెలుగుతో పాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూడవచ్చు. ప్రేమకథతో పాటు తండ్రి, కొడుకుల మధ్య ఉండే అనుబంధాన్ని కూడా ఎమోషనల్‌గా చూపించే సినిమాలంటే ఇష్టమైతే ఈ చిత్రాన్ని మీ వీకెండ్ వాచ్‌లిస్ట్‌లో చేర్చుకోవచ్చు. దుర్గా దేవ్ నాయుడు దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా కూడా నటించాడు. అన్విష క్రాంతి హీరోయిన్ గా నటించింది.

Read Also: నవలల్లో రాసిన నిధి కోసమే రచయిత్రి కిడ్నాప్‌… అడవిలోకి వెళ్ళాక ఒక్కొక్కరికీ చుక్కలు

Related News

ది గ్రేట్ పంజాబ్ రాబరీ… సినిమాను తలపించే రియల్ హీస్ట్… గూస్‌బంప్స్ గ్యారెంటీ

ఏడుగురు పెళ్లికొడుకుల మధ్య చిక్కుకున్న అమ్మాయి కథ… ఫ్యామిలీ డ్రామానే

వందల ఏళ్ల రాజభవనం.. అప్పులపాలైన రాజవంశం… వైభవం నుంచి పతనం వరకు కంటతడి పెట్టించే మాస్టర్ పీస్

నవ్వినా అవుట్‌… భయపడినా అవుట్‌… హాలోవీన్‌ హంగామాలో అన్‌స్టాపబుల్ కామెడీ

ఓటీటీ విడుదలకు సిద్ధమైన సీఎం కొడుకు ఫస్ట్ సినిమా!

ఓడలో అమ్మాయిలనే టార్గెట్ చేసే కిల్లర్… 2000ల మందిలో హంతకుడు ఎవరు ?

ఒకే ఒక్క రాంగ్ డెసిషన్ తో బతుకు బస్టాండ్… గ్యాంగ్‌స్టర్లు, పోలీసుల మధ్య ఇరుక్కున్న కుర్రాళ్ల కథ

Big Stories

Advertisement
×