E-Paper
Advertisement

లవర్ కి బ్రేకప్… కట్ చేస్తే మాజీ ప్రియుడితో మళ్లీ కనెక్షన్… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ లవ్ ట్రయాంగిల్

లవర్ కి బ్రేకప్… కట్ చేస్తే మాజీ ప్రియుడితో మళ్లీ కనెక్షన్… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ లవ్ ట్రయాంగిల్
Advertisement

Triangle Love Drama on OTT : ప్రేమలో ఉన్నప్పుడు ఇద్దరికీ ఒకే రకమైన భవిష్యత్తు కావాలని లేదు. ఒకరికి పెళ్లి చేసుకుని కుటుంబంతో స్థిరపడాలని ఉంటే, మరొకరికి ఆ బాధ్యతల గురించి ఆలోచించడానికే ఇష్టం ఉండకపోవచ్చు. ఇలాంటి చిన్న అభిప్రాయ భేదాలే క్రమంగా బంధంలో దూరాన్ని పెంచుతాయి. అలాంటి సమయంలో ప్రియుడే కొంతకాలం దూరంగా ఉందామని చెబితే, ఆ అమ్మాయి మనసులో ఎన్ని సందేహాలు మొదలవుతాయో ఊహించవచ్చు. సరిగ్గా ఇలాంటి పరిస్థితిలో ఉన్న ఓ యువతి జీవితంలోకి మాజీ ప్రియుడు మళ్లీ వస్తే? పాత ప్రేమను మళ్లీ మొదలుపెట్టాలా, ప్రస్తుత బంధం కోసం ఎదురుచూడాలా అనే గందరగోళం చుట్టూ తిరిగే అమెరికన్‌ రొమాంటిక్‌ డ్రామా ‘ది సన్‌ నెవర్‌ సెట్స్‌’ (The Sun Never Sets). మరి ఈ ఎమోషనల్ లవ్ ట్రయాంగిల్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు అంటే…

కథలోకి వెళ్తే…

వెండీ (డకోటా ఫానింగ్‌) అలాస్కాలోని యాంకరేజ్‌ లో నివసించే 31 ఏళ్ల యువతి. నిర్మాణ రంగంలో పని చేసే ఆమె గత రెండేళ్లుగా జాక్‌ తో ప్రేమలో ఉంటుంది. జాక్‌ వయసులో ఆమెకంటే పెద్దవాడు. గతంలో పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉంటారు. వెండీని అతను ఎంతో ప్రేమిస్తాడు. అయితే మళ్లీ పెళ్లి చేసుకోవడం, ఇంకోసారి పిల్లలను కనడం వంటి ఆలోచనలు తనకు లేవని స్పష్టంగా చెబుతాడు.

Advertisement

వెండీ మాత్రం తన భవిష్యత్తు గురించి ఇంకా స్పష్టమైన నిర్ణయానికి రాలేకపోతుంది. జాక్‌తో ఉన్న బంధంలో సంతోషంగా ఉన్నప్పటికీ, పెళ్లి, కుటుంబం వంటి విషయాల్లో అతనితో తన ఆలోచనలు కలుస్తాయా అనే సందేహం ఆమెను వెంటాడుతుంది. వెండీ మనసులోని ఈ గందరగోళాన్ని గమనించిన జాక్‌, కొంతకాలం దూరంగా ఉండి తమ బంధం గురించి ఆలోచించుకోవాలని సూచిస్తాడు. అతని ఉద్దేశం వెండీకి తనకు నిజంగా ఏం కావాలో తెలుసుకునే అవకాశం ఇవ్వడమే. కానీ జాక్‌ తీసుకున్న ఈ నిర్ణయం వెండీని మరింత అయోమయంలోకి నెట్టేస్తుంది.

అదే సమయంలో ఆమె జీవితంలోకి మాజీ ప్రియుడు చక్‌ మళ్లీ వస్తాడు. చక్‌ ఒక పర్యాటక విమాన పైలట్‌. గతంలో అతనితో ఉన్న అనుబంధం, అప్పటి జ్ఞాపకాలు వెండీకి మళ్లీ గుర్తుకొస్తాయి. జాక్‌తో ఉన్న సంబంధంలో భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడం, చక్‌ తిరిగి రావడం.. ఈ రెండూ ఆమెను భావోద్వేగంగా ఇబ్బంది పెడతాయి. చక్‌తో గడిపిన రోజులు గుర్తుకొస్తున్న కొద్దీ, గతంలో తీసుకున్న నిర్ణయం సరైనదేనా అనే ఆలోచన కూడా మొదలవుతుంది.

Advertisement

ఇక్కడే కథ ఆసక్తికరంగా మారుతుంది. జాక్‌ వెండీని ప్రేమిస్తున్నప్పటికీ, ఆమె కోరుకునే భవిష్యత్తును అందించగలడా అనే సందేహం ఉంటుంది. మరోవైపు చక్‌తో మళ్లీ దగ్గరవడం ఆమెకు కొత్త అవకాశంలా కనిపించినా, పాత బంధం తిరిగి మొదలైతే అంతా సాఫీగా సాగుతుందనే హామీ లేదు. మరి జాక్‌తో తన బంధాన్ని వెండీ కొనసాగిస్తుందా ? చక్‌ తో మళ్లీ ప్రేమలో పడుతుందా ? లేక తన జీవితంపై తానే నిర్ణయం తీసుకుని కొత్త దారిని ఎంచుకుంటుందా ? ఈ చిక్కుముడికి సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

Also Read : రేపు ఒక్కరోజే ఓటీటీలోకి 2 సినిమాలు, 1 వెబ్‌సిరీస్, మోస్ట్ అవైటెడ్ రియాలిటీ షో… అన్నీ తెలుగులోనే

స్ట్రీమింగ్ ఎక్కడ ?

‘ది సన్‌ నెవర్‌ సెట్స్‌’ 2026లో విడుదలైన ఇంగ్షీషు రొమాంటిక్‌ డ్రామా. దర్శకుడు జో స్వాన్‌బర్గ్‌ రూపొందించిన ఈ చిత్రంలో డకోటా ఫానింగ్‌, జేక్‌ జాన్సన్‌, కోరీ మైఖేల్‌ స్మిత్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రైమ్‌ వీడియోలో ఈ చిత్రం అద్దెకు అందుబాటులోకి వచ్చింది. ప్రేమలో ఉన్నప్పుడు భవిష్యత్తుపై వచ్చే అభిప్రాయ భేదాలు, పాత ప్రేమ మళ్లీ ఎదురైనప్పుడు కలిగే భావోద్వేగాలు, మనకు నిజంగా కావాల్సింది ఏమిటనే సందేహాలతో ఈ సినిమా ఆసక్తికరంగా సాగుతుంది.

Related News

ముప్పైల్లో హార్మోన్ల గోల… నవ్వలేక చస్తారు… నెట్‌ఫ్లిక్స్‌లోకి కొత్త స్టాండప్ స్పెషల్

రేపు ఒక్కరోజే ఓటీటీలోకి 2 సినిమాలు, 1 వెబ్‌సిరీస్, మోస్ట్ అవైటెడ్ రియాలిటీ షో… అన్నీ తెలుగులోనే

ప్రెగ్నెన్సీ లోనూ తగ్గేదేలే.. సమంత కొత్త అవతారం అదుర్స్!

కారు వద్దు బాబోయ్.. ముందు నా చలాన్లు కట్టండి! దర్శకుడు బాబు కామెంట్స్ వైరల్

కూరగాయల కోసం కొంటె కుందేలు పోరాటం… పిల్లలతో కలిసి ఎంచక్కా చూడదగ్గ యానిమేషన్ కామెడీ

పెళ్ళైనట్టు నటిస్తూ ఇవేం మెంటల్ మాస్ పనులు భయ్యా… యాక్షన్, రొమాన్స్‌తో అదరగొట్టే కామెడీ సిరీస్

అపార్ట్‌మెంట్‌లో అపరిచిత శవం… ప్రైమ్ వీడియోలోకి డార్క్ రొమాంటిక్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×