BigTV English

Dragon OTT: డ్రాగన్ ఓటిటి ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే..?

Dragon OTT: డ్రాగన్ ఓటిటి ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే..?

Dragon OTT.. లవ్ టుడే (Love Today) సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ప్రముఖ హీరో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. సినిమాతో భారీ క్రేజ్ దక్కించుకున్న ఇటీవల ‘డ్రాగన్’ (Dragon) అనే సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని, ప్రదీప్ రంగనాథ్ మంచి ఇమేజ్ అందించింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతున్న ఈ సినిమా పూర్తి యూత్ ఫుల్ కంటెంట్తో రావడంతో ఈ చిత్రాన్ని చూడడానికి యువత కూడా బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అటు కలెక్షన్ల పరంగా కూడా దూసుకుపోతోంది.


డ్రాగన్ సినిమాతో భారీ గుర్తింపు..

అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అందాల భామలు అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) , కయాదు లోహర్ (Kayyadu Lohar) హీరోయిన్లుగా నటించగా.. ఇద్దరూ కూడా తమ అందంతో భారీగా పోటీపడ్డారు. ముఖ్యంగా అనుపమ కంటే యంగ్ బ్యూటీ కయాదు ఈ సినిమాతో భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా యువత అందాల రాకుమారిగా పేరు సొంతం చేసుకుంది . ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం అందుకున్న ఈ సినిమా ఓటీటీ లో చూడడానికి అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా థియేటర్లలో మిస్ అయినవారు ఓటీటీ కోసం ఎదురు చూస్తుండగా.. థియేటర్లలో చూసి ఎంజాయ్ చేసిన వారు కూడా మరొకసారి ఆ అనుభూతిని పొందడానికి ఓటీటీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఎట్టకేలకు ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను ఈ సినిమా లాక్ చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.


OTT స్ట్రీమింగ్ డేట్ లాక్..

ఇకపోతే ఈ సినిమా ఓటీటీలో ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కానుంది అనే విషయానికి వస్తే, ప్రముఖ ఓటీటి ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమా మార్చి 28వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సినీ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే ఈ సినిమా మార్చ్ 28 నుంచి ఓటీటీలోకి వస్తుందా అనేది ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే యూత్ కి , ప్రదీప్ అభిమానులకి పండగ అని చెప్పవచ్చు. ఇక సినిమా థియేటర్లలో సక్సెస్ఫుల్గా విజయం సాధించింది. మరి OTT లో ఎలాంటి టిఆర్పి రేటింగ్ అందుకుంటుందో చూడాలి. ఇక ప్రదీప్ రంగనాథన్ విషయానికి వస్తే.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈయన నటుడుగానే కాకుండా దర్శకుడిగా కూడా మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఇక తనలోని టాలెంట్ ను బయటకు తీస్తూ అభిమానులకు చేరువయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల రజనీకాంత్ (Rajinikanth) స్టైల్ ని అనుకరిస్తూ చేసిన విన్యాసాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Related News

SU from SO OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న కన్నడ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి 30 సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

OTT Movie : ఓటీటీలో దూసుకుపోతున్న సరికొత్త లవ్ స్టోరీ … సత్యదేవ్ వన్ మ్యాన్ షో … ఇందులో అంతగా ఏముందంటే ?

OTT Movie : ఈయన అలాంటి ఇలాంటి డాక్టర్ కాదులే … చేయిపడితే బెడ్ మీద గుర్రం సకిలించాల్సిందే …

OTT Movie : ‘జంబలకడి పంబ’ ను గుర్తు చేసే వెబ్ సిరీస్ … పొట్టచెక్కలయ్యే కామెడీ … ఫ్రీగానే చూడొచ్చు

OTT Movie : బాస్ తో హద్దులు మీరే యవ్వారం … పెళ్లి బట్టలతో కూడా వదలకుండా … ఒంటరిగా చూడాల్సిన సినిమా

Big Stories

×