BigTV English

OTT Movie : భార్య లావుగా ఉందని ని ఫస్ట్ నైట్ కి నో చెప్పే భర్త… భార్య చేసే పనికి ఫ్యూజులు అవుట్

OTT Movie : భార్య లావుగా ఉందని ని ఫస్ట్ నైట్ కి నో చెప్పే భర్త… భార్య చేసే పనికి ఫ్యూజులు అవుట్

OTT Movie : భార్యా,భర్తల మధ్య జరిగే కీచులాటలు చాలా కుటుంబాలలో జరిగేవే. కొన్ని కుటుంబాలలో ఎక్కువగాను, మరి కొన్ని కుటుంబాలలో తక్కువగా ఉంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో భార్య లావుగా ఉన్న కారణంగా గొడవలు స్టార్ట్ అవుతాయి. వీళ్ళ గొడవల చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతూ ఉంటుంది. ఈ మూవీ సరదాగా సాగిపోతూ, కడుపుబ్బ నవ్విస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon prime video) లో

ఈ బాలీవుడ్ మూవీ పేరు ‘దమ్ లగా కే హైషా’ (Dum laga ka Haisha) ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి శరత్ కటారియా దర్శకత్వం వహించారు. ఇందులో ఆయుష్మాన్ ఖురానా, భూమి పెడ్నేకర్, సంజయ్ మిశ్రా, సీమా పహ్వా ప్రధాన పాత్రల్లో నటించారు.ఈ మూవీ 16 ఏప్రిల్ 2015న థియేట్రికల్ రన్‌లో 50 రోజులను జరుపుకుంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ₹72  కోట్ల వసూళ్లు సాధించింది. దమ్ లగా కే హైషా 61వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో ఐదు నామినేషన్లను అందుకుని రెండు గెలుచుకుంది. ఈ మూవీ హిందీలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీలోకి వెళితే

ప్రేమ్ పదవ తరగతి ఎప్పుడు రాసినా ఫైల్ అవుతూనే ఉంటాడు. ఇతడు ఒక మ్యూజిక్ షాపును పెట్టుకొని ఎప్పుడు ఫ్రెండ్స్ తో తిరుగుతూ ఉండటంతో, ఇంట్లో వాళ్ళు ప్రేమ్ కి పెళ్లి చేయాలనుకుంటారు. ఈ క్రమంలోనే, సంధ్య అని అమ్మాయిని చూస్తారు. బిఈడి కంప్లీట్ చేసి టీచర్ ఉద్యోగానికి రెడీ అవుతూ ఉంటుంది సంధ్య. అయితే ఆ అమ్మాయి చూడటానికి లావుగా ఉంటుంది. లావుగా ఉన్న సంధ్య ని పెళ్లి చేసుకోవడానికి ప్రేమ్ కి అంతగా ఇష్టం ఉండదు. ఇంట్లో వాళ్ళని ఎదిరించలేక పెళ్లి చేసుకుంటాడు. మొదటి రాత్రి ఆమెతో గడపకుండానే వెళ్ళిపోతాడు. ఈ విషయం ఇంట్లో వాళ్లకు తెలిసి ఇద్దరికీ సర్ది చెప్తారు. రెండో రోజు మాత్రం ఆ పని అయిపోతుంది. సంధ్య లావుగా ఉండటంతో, ఇంట్లో మంచం మీద శబ్దాలు వస్తూ ఉంటాయి. అవి విన్న ఇంట్లో వాళ్లు వీళ్లు దగ్గరయ్యారని అనుకుంటారు. ఆ తర్వాత ప్రేమ కజిన్ కి పెళ్లి కుదురుతుంది. ఆ పెళ్ళికి ప్రేమ్ తన భార్యని ఇష్టం లేకపోయినా తీసుకెళ్లాల్సి వస్తుంది.

అయితే అక్కడ ఫ్రెండ్స్ తో మందు తాగి తన భార్య గురించి చెడుగా వాగుతాడు. తనని చూస్తే ఫీలింగ్స్ కలగట్లేదు అని చెప్పడంతో, అక్కడే ఇది విన్న సంధ్య తనని చంప మీద కొడుతుంది. ప్రేమ్ కూడా తనని చంప మీద కొడతాడు. ఇలా వీరి పెళ్లి కాస్త విడాకులకు వెళుతుంది. కోర్టులో జడ్జి వీళ్ళకి ఆరు నెలలు సమయం ఇస్తాడు. ఆ తర్వాత సంధ్య భర్త దగ్గర ఆరు నెలలు ఉండటానికి ఒప్పుకుంటుంది. ఈ క్రమంలో ఆ ఊరిలో ప్రతి సంవత్సరం జరిగే పోటీలు ఉంటాయి. భర్త, భార్యని ఎత్తుకొని కొంత దూరం నడవాల్సి ఉంటుంది. కొన్ని పజిల్స్ కూడా దాటాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే తన కజిన్ కూడా ప్రేమ్ కు పోటీగా మ్యూజిక్ షాప్ పెడతాడు. అయితే ఎవరో ఒకరే పెట్టాలనుకుంటే, పోటీలో ఎవరు విన్ అయితే వాళ్లే షాప్ పెట్టుకోవచ్చని ప్రేమ్ తో కజిన్ అంటాడు. ప్రేమ్ భార్య లావుగా ఉండటంతో, ఈ పోటీలో గెలవడం సాధ్యం కాదని అనుకుంటాడు కజిన్. చివరికి ప్రేమ్ తన భార్యను ఎత్తుకొని ఆ పోటీలో గెలుస్తాడా? వీళ్ళిద్దరి సంసారం మళ్ళీ కొలిక్కి వస్తుందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీ నేమ్స్ కాకుండా చూడండి.

Related News

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

Big Stories

×