Allu Arjun : టాలీవుడ్ స్టార్ హీరో ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే పుష్ప 2 మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. గత ఏడాది డిసెంబర్ 5న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ ప్రభంజనాన్ని సృష్టించింది. పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ అయిన ఈ మూవీ అన్ని ఏరియా లో మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. దాదాపు 2200 కోట్ల ప్రపంచవ్యాప్త గ్రాస్ వసూలైంది. ఇది నిజంగా ఒక సంచలనం. బాహుబలి ఫ్రాంఛైజీలో సాధించిన వసూళ్ల కు చేరువగా వచ్చింది పుష్ప 2.. రెండో సీక్వెల్ మూవీ మంచి సక్సెస్ ను అందుకోవడంతో పుష్ప 3 ని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.. దీనిపై కొన్ని రోజుల క్రితం వార్తలు కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు తాజాగా మరో వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. పుష్ప 3 తో పాటు పుష్ప 4 కూడా చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత అల్లు అర్జున్ ఇక ఇలాంటి సినిమాలు చేయకూడదని ఆలోచనకొచ్చినట్లు గతంలో వార్తలు వినిపించాయి. అయితే రీసెంట్ గా జరిగిన థ్యాంక్స్ మీట్ లో ఈ మూవీ సీక్రెట్స్ పై అల్లు అర్జున్ సంచల కామెంట్ చేశారు. అల్లు అర్జున్ పుష్ప-3 గురించి ఆసక్తికర కామెంట్ చేసారు. పుష్ప 3 గురించి ఇంకా పూర్తి స్పష్ఠత లేదు. కానీ పుష్ప పేరు వింటేనే అదొక ఎనర్జీలా ఉందని బన్ని వ్యాఖ్యానించారు. అటు డైరెక్టర్ సుకుమార్ కూడా ఈ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలను బట్టి ఈ ఫ్రాంఛైజీ అన్ లిమిటెడ్‌గా ముందుకు సాగనుంది..
కాగా, థ్యాంక్స్ మీట్ ఈవెంట్ లో సుకుమార్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు పుష్ప పూర్తి కథను అందించలేదు. పుష్ప 2 తో జస్ట్ ఇంటర్వెల్ లాగా ఇచ్చాం. ఇక పుష్ప3 ఫోర్ లో అసలు కథను రివిల్ చేయొచ్చు అని ఒక హింట్ ఇచ్చాడు. ఆయన మాటలను బట్టి చూస్తే ఈ పుష్ప 2, పుష్ప 3 తో పాటుగా పుష్ప 5, పుష్ప 6 కూడా వచ్చిన ఆశ్చర్య పోనవసరం లేదని చెప్పాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది టాలెంటెడ్ రచయితలు, డైరెక్టర్లు ఉన్నారు వాళ్ళందరూ సుకుమార్ కు సహాయం చేశారు. ఈ సీక్వెల్స్ ను ముందుకు తీసుకెళ్లడానికి ఆయనకు ఎంత సహకరించారని సుకుమార్ గతంలో పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ప్రస్తుతం సుకుమార్ కి ఇతర అగ్ర హీరో లతో కొన్ని కమిట్ మెంట్లు ఉన్నాయి. అలాగే బన్ని ఇతర దర్శకులకు ఇచ్చిన కమిట్ మెంట్లు పూర్తి చేయాలి.. అవన్నీ పూర్తి చేయాలంటే 2026 వరకు వెయిట్ చేయాలి. అప్పుడే పుష్ప3 ని అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది… మరి సుక్కు దీనిపై ఏం చెప్తారో అన్నది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం బన్నీ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో ఓ మూవీ చెయ్యనున్నాడు