OTT Movie : ఓటీటీలోకి సరికొత్త కంటెంట్ తో సినిమాలు, వెబ్ సిరీస్ లు వస్తున్నాయి. ప్రేక్షకులకు కొత్త తరహాలో కంటెంట్ ను చూపించడానికి మేకర్స్ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకే జనర్ లో బోర్ కొట్టించకుండా మిగతా ఎలిమెంట్స్ ను కూడా మిక్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్, 1990 లో ఉండే ముంబై అండర్‌వరల్డ్ మాఫియా బ్యాక్‌డ్రాప్ లో వచ్చింది. ఈ సిరీస్ క్రైమ్, యాక్షన్, గ్లామర్ వంటి జానర్ లలో తెరకెక్కింది. ఈ వెబ్ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
హంగామా (Hungama) లో
ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘బదాస్ బేగం’ (Badass Begum). 2025లో విడుదలైన ఈ హిందీ సిరీస్ కి తబ్రేజ్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఇది నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందింది. ఈ సిరీస్‌లో దివ్యా అగర్వాల్, అక్షయ్ డోగ్రా, అంకిత్ గెరా, మరియు తబ్రెజ్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది ముంబై అండర్‌వరల్డ్‌లో సెట్ చేయబడిన ఒక గ్రిట్టీ, డ్రామాటిక్ క్రైమ్ స్టోరీ. ఇది 2025 జూన్ 26 నుంచి హంగామా (Hungama) ఓటీటీలలో అందుబాటులోకి వచ్చింది.
స్టోరీలోకి వెళితే
ఉర్వశి రాజే అనే లోయర్-మిడిల్-క్లాస్ మహిళ, ముంబైలో ఎలాగైనా పైకి ఎదగాలనే బలమైన ఆశయంతో ఉంటుంది. ఆమె ఇప్పుడ తన లక్ష్యాన్ని సాధించడానికి ఎటువంటి రిస్క్ తీసుకోవడానికైనా సిద్ధ పడుతుంది. ఆమె జీవితం జాకీ అనే వ్యక్తిని కలిసిన తర్వాత అనూహ్యంగా మారుతుంది. అతను ఆమెను ముంబై అండర్‌వరల్డ్‌లోని ప్రమాదకరమైన ప్రపంచంలోకి లాగుతాడు. ఈ ప్రపంచంలో ఉర్వశి తన తెలివి, అందం వ్యూహాత్మకంగా ఉపయోగించి, ఒక గ్యాంగ్‌స్టర్ కి దగ్గరవుతుంది. అడ్డువచ్చిన వాళ్ళని అడ్డుతోలగించి, చివరికి ముంబై అండర్‌వరల్డ్‌లో అందరినీ భయపెట్టే డాన్ గా మారుతుంది.
ఉర్వశి ప్రయాణం మోసం, రక్తపాతం, ద్రోహంతో నిండి ఉంటుంది. ఆమె తన లక్ష్యాలను సాధించడానికి ఎటువంటి జాలి, దయ లేకుండా ముందుకు వెళ్తుంది. కానీ ఆమె శాసించాలనుకునే మనస్తత్వం, ఆమె జీవితాన్ని అస్తవ్యస్తంగా మారుస్తుంది. ఆమె అంతర్జాతీయ అండర్‌వరల్డ్ వ్యాపారంలో మరింత దూరం వెళ్తుంది. ఇది చాలా ప్రమాదకరమైనదిగా ఉంటుంది. ఇందులోకి వచ్చాక ఒకరోజు ఉర్వశి రాజే హఠాత్తుగా కనిపించకుండాపోతుంది. చివరికి ఆమె ఎలా అదృశ్యం అవుతుంది ? ప్రాణాలతోనే ఉంటుందా ? మాఫియాని ఆమె ఎలా శాసిస్తుంది ? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే, ఈ సిరీస్ ను మిస్ కాకుండా చూడండి.