E-Paper
Advertisement

Riality Show OTT : ఏక్తా కపూర్ రియాలిటీ షో ఓటీటీలోకి… జైలు గోడల్లో ఎంటర్టైన్మెంట్ పక్కా

Riality Show OTT : ఏక్తా కపూర్ రియాలిటీ షో ఓటీటీలోకి… జైలు గోడల్లో ఎంటర్టైన్మెంట్ పక్కా
Advertisement

Riality Show OTT : ఓటీటీలో మరో కొత్త రియాలిటీ షో వస్తోంది. ఏక్తా కపూర్ ఈ రియాలిటీ షో ను ఆడియన్స్ ముందుకు తీసుకొస్తోంది. ఇది వరకే మొదటి భాగం హిట్ కావడంతో ఈ సీజన్ పై కూడా అందరికీ ఆసక్తి పెరుగుతోంది. పైగా ఇప్పుడు కొత్త ఫార్మాట్ లో దీనిని తీసుకొస్తున్నారు. సరికొత్త గేమ్స్ ఇందులో రబోతున్నాయి. విన్నర్ కి భారీ నగదు కూడా ఇవ్వబోతున్నారు. మరి ఈ రియాలిటీ షో పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో రానుంది అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

దీని పేరు ఏమిటంటే

ఏక్తా కపూర్ రూపొందిస్తున్న ఈ రియాలిటీ షో పేరు “లాకప్”. ఇది ఇప్పుడు సీజన్ 2 గా నెట్‌ఫ్లిక్స్‌ లో రాబోతోంది. బాలాజీ టెలిఫిల్మ్స్, నెట్‌ఫ్లిక్స్ కలసి దీనిని నిర్మిస్తున్నాయి. ఏక్తా కపూర్ సృష్టించిన “లాకప్” ఇప్పటికే మొదటి భాగంకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. రాబోయే సీజన్ 2 నెట్‌ఫ్లిక్స్‌లో మరింత పెద్ద ఎత్తున, ఆడియన్స్ ను పెంచుకోవడానికి, కొత్త ఫార్మాట్‌తో ప్రీమియర్ అవుతుంది. ఇందుకు గాను ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుందో తెలియాలంటే మరికొంత సమయం ఆగాల్సిందే.

లాకప్ సీజన్ 1 గురించి చెప్పాలంటే

Advertisement

మొదటి సీజన్‌ను కంగనా రనౌత్ హోస్ట్ చేశారు. సీజన్ 2 కు కూడా ఆమె తిరిగి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. జైలు లాంటి వాతావరణంలో సెట్ చేయబడిన ఈ రియాలిటీ షోలో 20 మంది పోటీదారులు పాల్గొన్నారు. కమెడియన్ మునావర్ ఫరూఖీ “లాకప్” మొదటి సీజన్‌కు ట్రోఫీని గెలుచుకున్నాడు. అతను ఫైనల్‌లో అత్యధిక ఓట్లతో పాయల్ రోహత్గిని ఓడించాడు. పొందాడు. మునావర్ కు నగదు బహుమతి ₹20 లక్షలతో పాటు, ఒక కారు, అన్ని ఖర్చులతో ఇటలీ టూర్ కి వెళ్ళే అవకాశం అందుకున్నాడు.

లాకప్ సీజన్ 2 గురించి చెప్పాలంటే

ఇందులో ఉమర్ రియాజ్, ప్రతీక్ సెహజ్‌పాల్, ఎమివే బంటాయ్, రాఖీ సావంత్ వంటి ప్రముఖులు ఈ షోలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఒక “క్యాప్టివ్ రియాలిటీ” షో. ఇందులో సెలబ్రిటీలు జైలు వంటి వాతావరణంలో ఉంటూ, ప్రజల తీర్పును ఎదుర్కోవాల్సి ఉంటుంది. సీజన్ 2 ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ (Netflix) వంటి గ్లోబల్ ప్లాట్‌ ఫామ్‌లో రాబోతోంది కాబట్టి, ప్రైజ్ మనీ గత సీజన్ కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Advertisement

Read Also : శరీరాలను మార్చే ఆత్మలు… గందరగోళంలో పడే ఫ్యామిలీ… మనసుకు హత్తుకునే క్లైమాక్స్

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×