OTT Movies : ఈ మధ్య కాలంలో ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం రకరకాల కంటెంట్ ఉన్న సినిమాలు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అవుతున్నాయి. గత ఏడాది తక్కువ సినిమాలు ఓటీటీ లో స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. ఆ సినిమాలకు భారీ రెస్పాన్స్ తో పాటుగా బాక్సాఫీస్ ను షేక్ చేసే కలెక్షన్స్ ను కూడా అందుకుంటున్నాయి. ఇక సస్పెన్స్ కథలకు ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుండటంతో దర్శకనిర్మాతలు అలాంటి కథలతో సినిమాలను చేసేందుకు భారీ బడ్జెట్ ను ఖర్చు చేస్తున్నారు. ఇక థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఓటీటిలో కూడా సందడి చేస్తున్నారు. అక్కడ కూడా మంచి రెస్పాన్స్ ను అందుకుంటున్నాయనడం లో సందేహం లేదు. కేవలం సినిమాలు మాత్రమే కాదు. వెబ్ సిరీస్ లు కూడా మంచి రెస్పాన్స్ ను అందుకుంటున్నాయి. తాజాగా ఓటీటిలో ఓ సూపర్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఆ సిరీస్ ఏంటి? అసలు స్టోరీ ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో? ఒకసారి తెలుసుకుందాం..
వెబ్ సిరీస్ & ఓటీటీ..
మహత్ రాఘవేంద్ర, మానస చౌదరి, దేవిక ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ రొమాంటిక్ వెబ్‌సిరీస్ ఎమోజీ తెలుగులోకి వస్తోంది.. ఆహాలో కూడా సేమ్ టైటిల్ తోనే స్ట్రీమింగ్ కు వచ్చేసింది.. ఫిబ్రవరి 28 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ఆహా ఓటీటీ ప్రకటించింది. ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఎమోజీ వెబ్ సిరీస్‌కు సెన్ రంగసామీ దర్శకత్వం వహించాడు. అయితే మొదటగా ఈ తమిళ్లో రిలీజ్ అయింది ఆ తర్వాత రెండేళ్లకు తెలుగులో రిలీజ్ కాబోతుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన వెబ్ సిరీస్ స్టోరీ పర్వాలేదనిపించింది..
స్టోరీ విషయానికొస్తే.. ఈ మూవీ మొత్తం డిఫరెంట్ కథ తో తెరకేక్కింది.. రెండు జంటల మధ్య ప్రేమ ఎలా పుడుతుంది. అనే దాని మీద స్టోరీ రాశారు. ప్రేమ, పెళ్లి, బ్రేకప్‌ల విషయంలో యువతరం ఆలోచనలు, అభిప్రాయాలు ఎలా ఉంటున్నాయన్నది బోల్డ్ పంథాలో ఈ మూవీలో చూపించాడు డైరెక్టర్.. ఓ జంట మధ్య ఏర్పడిన పరిచయం ఎలా పెళ్లికి దారితీసింది? తను ప్రేమించిన అమ్మాయికి విడాకులు ఇచ్చి మరో అమ్మాయితో జీవితాన్ని పంచుకోవాలని ఆ యువకుడు ఎందుకు అనుకుంటాడు.. అయితే విడాకులు తీసుకున్న అమ్మాయే అతడి జీవితంలోకి మళ్లీ ఎలా వచ్చిందనే కాన్సెప్ట్‌తో తో వచ్చిన ఈ వెబ్ సిరీస్ తమిళ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. మంచి వ్యూస్ ను అందుకుంది. మరి తెలుగులో ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..
మహత్ రాఘవేంద్ర తెలుగు, తమిళ భాషల్లో ఇరవైకిపైగా సినిమాలు చేశాడు. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ మూవీతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. లేడీస్ అండ్ జెంటిల్‌మన్, సైకిల్‌తో పాటు మరికొన్ని సినిమాలు చేశాడు.. అలాగే తమిళ్లో కూడా పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనసు దోచుకున్నారు.. ఇక బిగ్ బాస్ లో కూడా పాల్గొని బాగా పాపులర్ అయ్యాడు.. ప్రస్తుతం వరుస సినిమాలు వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉన్నాడు…