Andhra-origin scientist : అంతరిక్ష పరిశోధనల్లో ఓ కీలక ఆవిష్కరణకు ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువ శాస్త్రవేత్త, ఆస్ట్రోఫిజిషియన్ రాగ దీపికా నేతృత్వం వహించారు. ఈమె పర్యవేక్షణలోని ఖగోళ శాస్త్రవేత్తల బృందం.. ఇంటర్మీడియట్-మాస్ బ్లాక్ హోల్స్, యాక్టీవ్లీ బ్లాక్ హోల్స్ కలిగి ఉండే అతిపెద్ద డ్వార్ఫ్ గెలాక్సీ లను కనుగొన్నారు. అస్ట్రోఫిజిక్స్ లో ఇది ఓ సంచలనాత్మక ఆవిష్కరణ అని శాస్త్రవేత్తలు ప్రశంసిస్తున్నారు. ఇప్పటి వరకు పరిశోధకుల అనుభవంలో ఉన్న యాక్టీవ్ బ్లాక్ హోల్స్ ఉ్నన ఇంటర్మీడియట్-మాస్ బ్లాక్ హోల్స్, డ్వార్ఫ్ గెలాక్సీల నమూనాల్లో ఇవే అతిపెద్దవిగా చెబుతున్నారు. రాగ దీపికా అమెరికాలో పరిశోధకురాలిగా పని చేస్తుండగా, ఆమెకు గుంటూరు జిల్లాలోని తెనాలి.. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన దీపిక, అక్కడే పరిశోధనలు చేస్తూ తాజా ఆవిష్కరణలో కీలకంగా పని చేశారు.
గతంలో కనుక్కున్న బ్లాక్ హోల్స్, డ్వార్ఫ్ గెలాక్సీల కంటే తాజాగా కనుక్కున్న గెలాక్సీ మూడు రెట్లు ఎక్కువగా విస్తరించి ఉన్నట్లు గుర్తించారు. కాగా.. డ్వార్ఫ్ గెలాక్సీ పరిణామం, బ్లాక్ హోల్ పెరుగుదల మధ్య పరిస్థితుల్ని తెలుసుకునేందుకు, మరింత లోతైన అధ్యయనం చేసేందుకు ఈ పరిశోధన బాగా పనికొస్తుందని ఆశిస్తున్నారు. డార్క్ ఎనర్జీ స్పెక్ట్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్ (DESI) తెలిపిన వివరాల ప్రకారం.. ప్రారంభ డేటా నుంచి కృష్ణ బిలాలకు చురుకుగా ఫీడ్ అందించే డ్వార్ఫ్ గెలాక్సీల అతిపెద్ద నమూనాను దీపిక బృందం కనుక్కుని, అధ్యయనం చేసినట్లు చెబుతున్నారు. ఈ ఆవిష్కరణ విశ్వంలోని కృష్ణ బిలాల సంఖ్య గురించి లోతైన అవగాహనకు ఉపయోగపడడంతో పాటు, వాటి నిర్మాణం, గెలాక్సీ పరిణామాన్ని రూపొందించడంలో వాటి పాత్రపై అధ్యయనాలకు ఉపయోగపడతాయని భావిస్తున్నారు.
డార్క్ ఎనర్జీ స్పెక్ట్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్ (DESI) అనేది 5,000 గెలాక్సీల నుంచి కాంతిని ఒకేసారి సంగ్రహించే అత్యాధునిక పరికరం. దీనిని US డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీ (DOE), ఆఫీస్ ఆఫ్ సైన్స్ నిధులతో నిర్మించి, నిర్వహిస్తున్నారు. 40 మిలియన్ గెలాక్సీలు, క్వాసార్లను సర్వే చేసే ప్రాజెక్ట్ లో భాగంగా ఈ అధ్యయం చేస్తుండగా, ప్రస్తుతం నాలుగో ఏడాది అధ్యయనం సాగుతున్నట్లు తెలుపుతున్నారు. ప్రాజెక్ట్ ముగిసే సమయానికి దాదాపు 40 మిలియన్ గెలాక్సీలు, క్వాసార్‌లను పరిశీలించాల్సి ఉంటుంది. DOE లారెన్స్ బర్కిలీ నేషనల్ లాబొరేటరీ నిర్వహించే DESI ప్రాజెక్ట్ కోసం 70 కి పైగా సంస్థల నుంచి 900 మందికి పైగా పరిశోధకులు సహకరిస్తున్నారు. ఈ బృందాలకు మన భారతీయ మూలాలున్న రాగ దీపిక నేతృత్వం వహిస్తున్నారు.
Also Read : Bihar Crime : పరీక్షల్లో మాస్ కాపీయింగ్ – ఓ విద్యార్థి కాల్చివేత – ఇలాంటి ఘటన చూసి ఉండరు
ఉతా విశ్వవిద్యాలయం నుంచి పోస్ట్ డాక్టోరల్ పరిశోధకురాలు దీపిక.. దాదాపు 1,15,000 డ్వార్ఫ్ గెలాక్సీలతో సహా 4,10,000 గెలాక్సీల స్పెక్ట్రాల గురించి అధ్యయనం చేసిన బృందానికి రాగ దీపిన నేయకత్వం వహించారు. వెయ్యి నుంచి అనేక బిలియన్లకు పైగా నక్షత్రాలు, చాలా తక్కువ వాయువు ఉండే చిన్న చిన్న గెలాక్సీలపైనా వీరి పరిశోధనలు సాగుతున్నాయి. మన పాలపుంతతో సహా అన్ని భారీ గెలాక్సీలు మధ్యలో బ్లాక్ హోల్స్ ఉంటాయనేది ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలు నమ్మకం. ఒక గెలాక్సీ మధ్యలో ఉన్న ఒక బ్లాక్ హోల్ శక్తిని తీసుకోవడం ప్రారంభించినప్పుడు, అది దాని పరిసరాల్లోకి అపారమైన శక్తిని విడుదల చేస్తుంది. మనం క్రియాశీల గెలాక్సీ కేంద్రకం అని పిలిచే దానిగా రూపాంతరం చెందుతుంది.