E-Paper
Advertisement

అల్జీమర్స్‌తో బాధపడే వృద్ధుడు… అతన్ని చూసుకునే మహిళకు వచ్చిన కష్టం చూస్తే గుండె బరువెక్కాల్సిందే

అల్జీమర్స్‌తో బాధపడే వృద్ధుడు… అతన్ని చూసుకునే మహిళకు వచ్చిన కష్టం చూస్తే గుండె బరువెక్కాల్సిందే
Advertisement

Kannada Family Drama: ఒక మనిషి తన జీవితంలో ఎక్కువగా ప్రేమించిన వ్యక్తినే… ఒకరోజు పూర్తిగా మర్చిపోతే ? ప్రతిరోజూ తనను చూసుకునే వ్యక్తిని చూసి “నువ్వు ఎవరు” అని అడిగితే ? ప్రేమించిన మనిషి జ్ఞాపకాల నుంచి మనం చెరిగిపోతే… మన ప్రేమకు, మన బంధానికి అర్థం ఏముంటుంది ? ఇలాంటి గుండెను పిండేసే ప్రశ్నల చుట్టూ సాగే కన్నడ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘సెప్టెంబర్ 21’ (September 21). అల్జీమర్స్ అనే వ్యాధి ఒక మనిషి జ్ఞాపకాలను మాత్రమే కాదు… అతన్ని ప్రేమించే కుటుంబ సభ్యుల జీవితాలను కూడా ఎలా మార్చేస్తుందో చూపించే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఈ సినిమాను ఎక్కడ చూడవచ్చు? తెలుగులో స్ట్రీమింగ్ అవుతోందా ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

రాజ్ అనే వృద్ధుడు తన కుటుంబంతో కలిసి జీవిస్తుంటాడు. అయితే నెమ్మదిగా అతని జ్ఞాపకశక్తి క్రమంగా తగ్గిపోతుంది. అల్జీమర్స్ కారణంగా తన చుట్టూ ఉన్న మనుషులను, తన గతాన్ని, తన జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలను ఒక్కొక్కటిగా మర్చిపోతుంటాడు. చివరకు రోజువారీ జీవితంలో ఎంతో సాధారణమైన విషయాలను కూడా గుర్తుపట్టలేని పరిస్థితికి చేరుకుంటాడు. అతన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ఒక మహిళా కేర్‌టేకర్ అతని బాధ్యతను తీసుకుంటుంది. రాజ్‌కు ఏ అవసరం వచ్చినా చూసుకుంటూ, అతని కోసం తన జీవితాన్నే పక్కన పెట్టేస్తుంది. రాజ్ తనను మర్చిపోతున్నాడని తెలిసినా… అతనిపై ఉన్న ప్రేమ మాత్రం ఆమెకు తగ్గదు. అతనికి గతం గుర్తుండకపోయినా, అతని కోసం తన జ్ఞాపకాలను తానే మోస్తూ ముందుకు సాగుతుంది.

Advertisement

కానీ ఒకరోజు ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసే సంఘటన జరుగుతుంది. ప్రతిరోజూ తనను చూసే వ్యక్తినే రాజ్ గుర్తుపట్టలేకపోతాడు. ఆమెను చూసి “నువ్వు ఎవరు?” అని అడుగుతాడు. ఆ ఒక్క ప్రశ్న ఆమె గుండెను ముక్కలు చేస్తుంది. ఎందుకంటే ఆమెకు రాజ్ కేవలం ఒక వ్యక్తి కాదు… తన జీవితంలో ఎంతో ముఖ్యమైన బంధం. కానీ రాజ్ జ్ఞాపకాల్లో మాత్రం ఆమెకు చోటు లేకుండా పోతుంది. ఇక్కడి నుంచే సినిమా అసలు భావోద్వేగ ప్రయాణం మొదలవుతుంది. ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నప్పుడు… ఆ వ్యక్తికి మనం ఎవరో కూడా గుర్తుండకపోతే ఆ బంధాన్ని ఎలా కొనసాగించాలి? అతను గతాన్ని మర్చిపోయినా, మనం కలిసి గడిపిన జ్ఞాపకాలను ఎలా మర్చిపోగలం? అనే ప్రశ్నలు ఆమెను వెంటాడుతుంటాయి.

రాజ్ పరిస్థితి రోజురోజుకూ మారుతుండటంతో అతన్ని చూసుకోవడం కూడా మరింత కష్టంగా మారుతుంది. అతని ప్రవర్తన, జ్ఞాపకశక్తిలో వచ్చే మార్పులు కుటుంబ సభ్యులకు మానసికంగా ఎంతో భారంగా మారతాయి. అయినప్పటికీ అతన్ని వదిలేయకుండా ప్రేమతో చూసుకోవడం, ఒక వ్యక్తిని కేవలం అతని జ్ఞాపకాల కోసం కాకుండా అతనిగా ప్రేమించడం అనే భావనను కథ చాలా సున్నితంగా చూపిస్తుంది. చివరకు రాజ్ తన గతాన్ని గుర్తు చేసుకోగలడా? తనను ఎంతో ప్రేమించిన ఆ వ్యక్తిని మళ్లీ గుర్తుపడతాడా? లేక జ్ఞాపకాలు చెరిగిపోయినా… ఆ బంధం మాత్రం మిగిలిపోతుందా? అనేదే సినిమా చివరి వరకు ప్రేక్షకులను వెంటాడే భావోద్వేగ ప్రశ్న.

స్ట్రీమింగ్ ఏ ఓటీటీలో ?

Advertisement

ప్రియాంక ఉపేంద్ర, ప్రవీణ్ సింగ్ సిసోడియా, జరీనా వహాబ్, అమిత్ బెహ్ల్, అజిత్ శిధాయే తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాకు కరెన్ క్షితి సువర్ణ దర్శకత్వం వహించారు. ఈ కన్నడ ఎమోషనల్ డ్రామాను Sun NXTలో చూడవచ్చు. ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవంతో ముడిపడిన టైటిల్, జ్ఞాపకశక్తిని కోల్పోతున్న వ్యక్తి చుట్టూ కుటుంబం పడే బాధ, ప్రేమించిన వ్యక్తి మనల్ని మర్చిపోయినా అతన్ని వదలని బంధం ఈ సినిమాకు ప్రధాన బలం. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలు, హృదయాన్ని తాకే కథలు చూడాలి అనుకుంటే ‘సెప్టెంబర్ 21’ను ఒకసారి చూడొచ్చు. కానీ తెలుగులో మాత్రం అందుబాటులో లేదు.

Read Also: ఒక్క రాత్రి డేట్ అనుకున్నారు… కానీ కారు ఎక్కగానే నరకం మొదలైంది

Tags

Related News

ఆ ఊరిలో ప్రతి 10 ఏళ్లకో నరబలి… ఓటీటీలోకి అల్టిమేట్ డార్క్ థ్రిల్లర్… హనుమాన్ చాలీసాను పక్కన పెట్టుకుని చూడండి

లోకాన్ని నాశనం చేయాల్సిన విలన్ బాబు మిస్సింగ్… ఏంజెల్ డెమన్ల టెన్షన్ పీక్స్… మతిపోగొట్టే ఫ్యాంటసీ సిరీస్

తండ్రినే చంపాలని కూతురికి ఆర్డర్… మైండ్ బ్లాకింగ్ స్పై థ్రిల్లర్ సిరీస్

30 వేల ఏళ్లుగా నిద్రపోతున్న డెవిల్ ని గెలికింది… క్యూట్ ఫెయిరీ చేసిన పనికి వరల్డ్ కే వణుకు… ఈ ఫాంటసీ లవ్ కాంబో వేరే లెవెల్

కేస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి లవ్ డ్రామా… డాక్టర్ తో ఫైర్‌ఫైటర్ రొమాంటిక్ లవ్ ట్రాక్

లండన్‌లో వడాపావ్ బిజినెస్‌తో కోట్ల సంపాదన… కానీ ఆ ఒక్క సీక్రెట్ బయటపడితే అంతా షెడ్డుకే

18 ఏళ్ల శత్రుత్వం… బద్దశత్రువుల ఇంట్లో పుట్టి ప్రేమలో పడే జంట… క్రేజీ కొరియన్ రొమాంటిక్ సిరీస్

24 ఏళ్లకే ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్… షుమాకర్ లెజెండ్ గా మారిన గూస్‌బంప్స్ మూమెంట్

Big Stories

Advertisement
×