E-Paper
Advertisement

ICC ఛైర్మ‌న్ గా జై షా ఉన్న‌న్ని రోజులు టీమిండియాను ఓడించ‌డం క‌ష్ట‌మే !

ICC ఛైర్మ‌న్ గా జై షా ఉన్న‌న్ని రోజులు టీమిండియాను ఓడించ‌డం క‌ష్ట‌మే !
Advertisement

Shahid Afridi On IND VS PAK:  ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే జనాలు ఎగబడి చూస్తారు అన్న సంగతి తెలిసిందే. ఆదివారం రోజున ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ నిర్వహిస్తే ఆరోజు అందరూ టీవీలకే అతుక్కుపోతారు. అంతలా పాపులర్ అయింది ఈ దాయాదుల పోరు. అయితే అప్పట్లో టీమ్ ఇండియా పై ప్రతిసారి పాకిస్తాన్ విజయం సాధిస్తూ, ఇరగదీసేది. కానీ మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ అయిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రతి మ్యాచ్ లోనూ పాకిస్తాన్ జట్టును చిత్తు చేస్తూ టీమ్ ఇండియా పై చేయి సాధిస్తోంది. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో.. ప్రతిసారి ఐసీసీ టోర్నమెంట్లలో భాగంగానే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ నిర్వహిస్తున్నారు. వీటిల్లో ప్రతిసారి టీమిండియా గెలుస్తూ దుమ్ము లేపుతోంది.

జై షా ఉన్న‌న్ని రోజులు టీమిండియాను ఓడించ‌డం క‌ష్ట‌మే

ఐసీసీ టోర్నమెంట్లలో పాకిస్తాన్ జట్టును చిత్తు చేస్తున్న టీమ్ ఇండియాను ఉద్దేశించి మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐసీసీ చైర్మన్ గా జై షా ఉన్నన్ని రోజులు టీమిండియాను ఓడించడం కష్టమేనన్నారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగితే.. వేదిక ఎక్కడైనా సరే ఫ్లాట్ మైదానాలను ఐసీసీ సిద్ధం చేస్తుందని ఆరోపణలు చేశారు. అందుకే టీమిండియా ప్రతిసారి గెలుస్తూ వస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐసీసీ చైర్మన్ గా జై షా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి టీమిండియా అత్యంత బలంగా తయారైందని కూడా పేర్కొన్నారు షాహిద్ అఫ్రిది. జై షా కుట్ర చేసి మరి టీమిండియా కు అనుకూలంగా ఉండే మైదానాలను తయారు చేసి బదులుతున్నాడని ఫైర్ అయ్యారు షాహిద్ అఫ్రిది.

Advertisement

National Champions Cup 2026: వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం వేసిన PCB ప్లాన్ అట్ట‌ర్ ఫ్లాఫ్‌..గ్రౌండ్ లోనే కుప్ప‌కూలుతోన్న పాక్ ప్లేయ‌ర్లు !

దుబాయ్‌, శ్రీలంక‌లో పిచ్ లు మార్చేసి, పాకిస్తాన్ ను ఓడించారు

గ‌తంలో దుబాయి, శ్రీలంకలో పిచ్ లు మార్చేసి, పాకిస్తాన్ ను ఓడించార‌ని ఆరోప‌ణ‌లు చేశారు షాహిద్ అఫ్రిది. అందుకే ప్రతిసారి పాకిస్తాన్ పైన ఈ మధ్యకాలంలో టీమిండియా ఈజీగా విక్టరీ సాధిస్తుందని ఫైర్ అయ్యారు. అలాగే గత మూడు సంవత్సరాల కాలంలోనే మూడు ఐసీసీ ట్రోఫీలు టీమిండియా దక్కించుకుందని తెలిపారు. ఈ కుట్ర వెనుక కూడా ఐసీసీ బాస్ జై షా ఉన్నాడని సంచలన ఆరోపణలు చేశారు. ఆయన రాజీనామా చేస్తేనే టీమ్ ఇండియా పై పాకిస్తాన్ అవలీలగా గెలుస్తుందని పేర్కొన్నారు. మహిళల టీమిండియా కూడా ఇలాగే తమ మహిళలను ఓడిస్తూ వస్తోందని గుర్తు చేశారు. ఈ పరిస్థితి పూర్తిగా మారాలని.. లేకపోతే పాకిస్తాన్ జన్మలో కూడా టీమిండియా పై గెలవదని కుండబద్దలు కొట్టి చెప్పారు షాహిద్ అఫ్రిది.

Advertisement

Harbhajan singh On Ind Vs Ban: బంగ్లాదేశ్ ను కూడా పాకిస్తాన్ లాగానే ట్రీట్ చేయండి..వాళ్లు కూడా మ‌న‌కు శ‌త్రువులే

Related News

తిండికే దిక్కులేదు, పాకిస్తాన్ ముఖాలకు సిల్వ‌ర్ మెడ‌ల్ రావడమే ఎక్కువ..షోయబ్ అక్తర్ సంచలనం

సగానికి పైగా నష్టాలు… PCBలో ఆర్థిక సంక్షోభం, ఇక దేవుడు కూడా కాపాడ‌లేడు

4 ఏళ్లుగా ఒక్క మ్యాచ్ గెల‌వ‌లేక‌పోయాం…పాకిస్తాన్ త‌ల తెగిన‌ట్టుగా ఉంది

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

నేను రెచ్చగొట్టి సచిన్ ను ఔట్ చేశా…సెహ్వాగ్ సంచలనం

పాకిస్తాన్ సీనియ‌ర్లు చెత్త వెధ‌వ‌లే…హ‌స‌న్ నవాజ్ సంక‌నాకినా ప‌నికిరారు

వైభ‌వ్ కు కాదు, నిన్ను త‌న్ని త‌రిమేసే టైమ్ వ‌చ్చింది….సైమ్ అయూబ్ పై త‌న్వీర్ సీరియ‌స్‌

విరాట్ కోహ్లీ డ‌కౌట్…”షూ” చూపిస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్ !

Big Stories

Advertisement
×