E-Paper
Advertisement

షెర్లాక్ హోమ్స్ కిడ్నాప్… తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న మిస్టరీ అడ్వెంచర్ థ్రిల్లర్

షెర్లాక్ హోమ్స్ కిడ్నాప్… తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న మిస్టరీ అడ్వెంచర్ థ్రిల్లర్
Advertisement

Mystery Adventure Thrlller: షెర్లాక్ హోమ్స్ గురించి, ఆయన సాహసాల గురించి తెలియని సస్పెన్స్, అడ్వెంచర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ లవర్స్ ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాగే ఇప్పటిదాకా వచ్చిన షెర్లాక్ హోమ్స్ మూవీస్, సిరీస్ లను కూడా చూసే ఉంటారు. కానీ అదే షెర్లాక్ కిడ్నాప్ అయితే, అతని కోసం అతని చెల్లెలు రంగంలోకి దిగితే ఎలా ఉంటుంది ? అది తెలుసుకోవాలంటే ‘ఎనోలా హోమ్స్ 3’ (Enola Holmes 3) అనే ఈ సినిమాపై ఒక లుక్కేయాల్సిందే.

కథలోకి వెళ్తే…

కథ ప్రారంభంలో ఎనోలా హోమ్స్ (మిల్లీ బాబీ బ్రౌన్), తన ప్రియుడు లార్డ్ ట్యూక్స్‌బరీ (లూయిస్ పార్ట్రిడ్జ్)ను వివాహం చేసుకోవడానికి మాల్టా (Malta) దేశానికి వెళ్తుంది. లార్డ్ హోదాను అందుకోవడం వల్ల తన సొంత గుర్తింపు ఎక్కడ కోల్పోతానో అని ఎనోలా కొద్దిగా భయపడుతుంది. సరిగ్గా పెళ్లికి సిద్ధమవుతున్న సమయంలో, పాపులర్ డిటెక్టివ్, ఎనోలా అన్నయ్య అయిన షెర్లాక్ హోమ్స్ (హెన్రీ కావిల్) మాల్టాలోనే హఠాత్తుగా కిడ్నాప్‌ కు గురవుతాడు. డాక్టర్ వాట్సన్ (హిమేష్ పటేల్) ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఎనోలా, పెళ్లిని పక్కన పెట్టి తన అన్నయ్యను రక్షించేందుకు రంగంలోకి దిగుతుంది.

Advertisement

ఈ దర్యాప్తులో ఆమెకు ట్యూక్స్‌బరీ, మాల్టా స్వాతంత్ర్య పోరాట యోధుడు మికియెల్ తోడవుతారు. విచారణలో ఎనోలాకు బ్రిటీష్ సైనికులు గతంలో అఫ్గానిస్తాన్ యుద్ధంలో దొంగిలించి, మాల్టా గుహల్లో దాచిన భారీ బంగారం గురించిన రహస్యం తెలుస్తుంది. ట్యూక్స్‌బరీ తండ్రి ఆ దొంగతనానికి వ్యతిరేకంగా ఉండటం వల్లే గతంలో అతన్ని చంపేస్తారు. ఈ బంగారాన్ని దక్కించుకోవడానికి, అలాగే హోమ్స్ తోబుట్టువులను దెబ్బతీయడానికి నెపోలియన్ ఆఫ్ క్రైమ్ ‘మోరియార్టీ’ ఈ కిడ్నాప్ డ్రామాను నడిపిస్తుందని ఎనోలా గుర్తిస్తుంది.

చివరికి ఎనోలా తన తెలివితేటలతో మోరియార్టీని ఎలా ఓడించింది ? అన్నయ్య షెర్లాక్‌ ను, ట్యూక్స్‌బరీ తల్లిని ఎలా కాపాడుతుంది ? బ్రిటీష్ సామ్రాజ్యవాద నేరాలకు నిరసనగా ట్యూక్స్‌బరీ తన లార్డ్ పదవిని వదులుకున్నాడా ? ఎనోలా తన ‘హోమ్స్’ గుర్తింపును పక్కన పెట్టిందా ? చివరికి ఆమె పెళ్లి జరిగిందా లేదా ? షెర్లాక్ ఎనోలాను తనతో సమానమైన డిటెక్టివ్‌గా అంగీకరించాడా ? అన్నది తెలియాలంటే ఈ మూవీపై ఒక లుక్కేయండి.

Advertisement

ఈ చిత్రం ఎనోలా హోమ్స్ సిరీస్‌లో మూడవ భాగంగా విడుదలైంది. ముందు భాగాల కంటే మరింత ఎమోషనల్ డెప్త్, రాజకీయ సందేశం యాక్షన్ సీక్వెన్స్‌లతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిల్లీ బాబీ బ్రౌన్ తెలివైన, ధైర్యవంతమైన ఎనోలా పాత్రతో మరోసారి మనసులు గెలుచుకుంది. హెన్రీ కావిల్ షెర్లాక్‌గా నటనతో తనదైన మార్క్ వేశాడు. ‘ఎనోలా హోమ్స్ 3’ ప్రస్తుతం Netflixలో ఉంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, ఇంగ్షీషు ఆడియోతో అందుబాటులో ఉంది. ఈ మిస్టరీ అడ్వెంచర్ జూలై 1 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also : తరతరాలను వెంటాడే శాపం… ఆ నగలు వేసుకున్నారో నరకానికే…

Tags

Related News

ఆ ఊరిలో ప్రతి 10 ఏళ్లకో నరబలి… ఓటీటీలోకి అల్టిమేట్ డార్క్ థ్రిల్లర్… హనుమాన్ చాలీసాను పక్కన పెట్టుకుని చూడండి

లోకాన్ని నాశనం చేయాల్సిన విలన్ బాబు మిస్సింగ్… ఏంజెల్ డెమన్ల టెన్షన్ పీక్స్… మతిపోగొట్టే ఫ్యాంటసీ సిరీస్

తండ్రినే చంపాలని కూతురికి ఆర్డర్… మైండ్ బ్లాకింగ్ స్పై థ్రిల్లర్ సిరీస్

30 వేల ఏళ్లుగా నిద్రపోతున్న డెవిల్ ని గెలికింది… క్యూట్ ఫెయిరీ చేసిన పనికి వరల్డ్ కే వణుకు… ఈ ఫాంటసీ లవ్ కాంబో వేరే లెవెల్

కేస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి లవ్ డ్రామా… డాక్టర్ తో ఫైర్‌ఫైటర్ రొమాంటిక్ లవ్ ట్రాక్

లండన్‌లో వడాపావ్ బిజినెస్‌తో కోట్ల సంపాదన… కానీ ఆ ఒక్క సీక్రెట్ బయటపడితే అంతా షెడ్డుకే

18 ఏళ్ల శత్రుత్వం… బద్దశత్రువుల ఇంట్లో పుట్టి ప్రేమలో పడే జంట… క్రేజీ కొరియన్ రొమాంటిక్ సిరీస్

24 ఏళ్లకే ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్… షుమాకర్ లెజెండ్ గా మారిన గూస్‌బంప్స్ మూమెంట్

Big Stories

Advertisement
×